చిరంజీవి ఫోటో దిండు కింద పెట్టుకుని నిద్ర పోయే హీరోయిన్, కానీ ఎంత అన్యాయం జరిగిందో తెలుసా ?
మెగాస్టార్ చిరంజీవితో నటించడం చాలా మంది హీరోయిన్లకు ఒకప్పుడు డ్రీం. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ వస్తే నటీమణులు వదులుకునేవారు కాదు. 90 దశకంలో రాణించిన క్రేజీ హీరోయిన్లంతా మెగాస్టార్ తో నటించారు. ఒకరిద్దరు మిస్ అయ్యారు.

megastar chiranjeevi
మెగాస్టార్ చిరంజీవితో నటించడం చాలా మంది హీరోయిన్లకు ఒకప్పుడు డ్రీం. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ వస్తే నటీమణులు వదులుకునేవారు కాదు. 90 దశకంలో రాణించిన క్రేజీ హీరోయిన్లంతా మెగాస్టార్ తో నటించారు. ఒకరిద్దరు మిస్ అయ్యారు. వారిలో ప్రధానంగా ఆమని పేరు వినిపిస్తుంది. ఆమని స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు. ఆమె కెరీర్ లో శుభలగ్నం చిత్రం ఒక క్లాసిక్ గా మిగిలిపోతుంది.

ఆ మూవీలో ఆమని నటనని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. డబ్బు పిచ్చితో భర్తని సైతం అమ్ముకున్న భార్యగా ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి. బాలకృష్ణ, నాగార్జునతో ఆమని హీరోయిన్ గా నటించింది. కానీ చిరంజీవి, వెంకటేష్ లతో నటించే ఛాన్స్ ఆమెకి రాలేదు. దీనిపై ఆమని ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.
చిరంజీవి గారితో నటించాలనేది నా డ్రీం. కానీ అది నెరవేరలేదు. ఒకటి రెండు సార్లు ఛాన్స్ వచ్చింది. ఒకసారి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. నన్ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. డేట్లు కూడా తీసుకున్నారు. చిరంజీవి గారితో మాట్లాడి నా సంతోషాన్ని తెలియజేశాను. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో కానీ నన్ను తీసేసి మరో హీరోయిన్ ని తీసుకున్నారు. అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు.
మరొక సందర్భంలో ఆయనకు సిస్టర్ గా నటించే అవకాశం వచ్చింది అని ఆమని పేర్కొంది. అయితే చిరంజీవి గారి పక్కన నటిస్తే హీరోయిన్ గానే నటిస్తాను.. సిస్టర్ పాత్రలు ఛస్తే చేయను అని తేల్చి చెప్పేసింది. తనకి చిరంజీవి అంటే పిచ్చి అభిమానం అని, తన గది మొత్తం మెగాస్టార్ ఫోటోలు పోస్టర్లే ఉండేవి అని ఆమని పేర్కొంది. చిరంజీవి గారి ఫోటో దిండు కింద పెట్టుకుని నిద్రపోయేదాన్ని. ఆయనంటే అంత అభిమానం అని పేర్కొంది.
రాంచరణ్ కి తల్లిగా నటించడానికి ఒకే, కానీ చిరంజీవి పక్కన చెల్లిగా మాత్రం నటించను అని ఆమని పేర్కొంది. జంబలకిడి పంబ లాంటి సూపర్ హిట్ చిత్రంతో ఆమని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, వంశానికొక్కడు, మావిచిగురు లాంటి హిట్ చిత్రాలలో ఆమని నటించింది.