- Home
- Entertainment
- మీ తమ్ముడి వల్ల ఇబ్బంది పడ్డా, ఆ మూవీ మీరు చేయొద్దు.. చిరంజీవిని ముందుగానే హెచ్చరించిన డైరెక్టర్
మీ తమ్ముడి వల్ల ఇబ్బంది పడ్డా, ఆ మూవీ మీరు చేయొద్దు.. చిరంజీవిని ముందుగానే హెచ్చరించిన డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత మిక్స్డ్ రిజల్ట్స్ అందుకుంటున్నారు. ఒక సినిమా హిట్ అవుతుంటే మరొకటి డిజాస్టర్ అవుతోంది. ఇక నుంచి అయినా చిరు వరుసగా హిట్లు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Chiranjeevi, Pawan Kalyan
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత మిక్స్డ్ రిజల్ట్స్ అందుకుంటున్నారు. ఒక సినిమా హిట్ అవుతుంటే మరొకటి డిజాస్టర్ అవుతోంది. ఇక నుంచి అయినా చిరు వరుసగా హిట్లు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుసగా యువ దర్శకులకే అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.
విజువల్ వండర్ గా, సూపర్ నేచురల్ అంశాలతో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ ఈ ఏడాది రిలీజ్ కానుంది. శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి లాంటి దర్శకులతో చిరంజీవి తదుపరి చిత్రాలకు కమిటయ్యారు. ఇటీవల చిరంజీవికి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకులలో డైరెక్టర్ బాబీ ఒకరు. బాబీతో కూడా ఫ్యూచర్ లో మరో చిత్రం ఉండబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి.
డైరెక్టర్ బాబీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవితో జరిగిన సంచలన సంభాషణని బయట పెట్టాడు. డైరెక్టర్ బాబీకి వాల్తేరు వీరయ్య కంటే ముందే చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. చిరంజీవి లూసిఫెర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. టాక్ బాగానే వచ్చింది కానీ వసూళ్ల పరంగా ఈ చిత్రం నిరాశ పరిచింది.
photo-i dream
చిరంజీవి ముందుగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయమని బాబీకి చెప్పారట. బాబీ చిరుని మీట్ అవడానికి వెళ్లారు. తాను ఇబ్బంది పడుతున్న విషయం చిరంజీవి గమనించారు. దీనితో సినిమా తప్ప మిగిలిన అన్ని విషయాలని చిరు మాట్లాడుతున్నారు. చివరగా లూసిఫెర్ చూసావా అని అడిగారు. చూశాను సార్.. మంచి కథ ఐ బాబీ సమాధానం ఇచ్చారట. మంచి కథే కానీ అందులో నేను ఊహించుకున్న చిరంజీవి కనిపించడం లేదు సార్ అని బాబీ మొహమాటం లేకుండా చెప్పేశాడు.
మరొక విషయం ఏంటంటే నా కథ అయితే నేను న్యాయం చేస్తాను.. వేరే కథలకి నేను న్యాయం చేయలేను అని బాబీ చిరంజీవితో తేల్చేశారట. మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఏమైందో చూశాం. అది నా కథ కాదు. కాబట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెంకీ మామ చిత్రం కూడా అంతే. నా కథతో అయితే పూర్తి న్యాయం చేస్తానని బాబీ చెప్పేశారు. బాబీ ఒపీనియన్ ని గౌరవించిన చిరు.. ఒకే మనం మరో చిత్రం చేద్దాం అని చెప్పారు. బాబీ ఊహించినట్లుగానే గాడ్ ఫాదర్ చిత్రం డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.