MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Thimmarajupalli TV Collections: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కలెక్షన్లు.. కొత్త కుర్రాళ్ల సినిమాకి ఈ రేంజ్‌లో వసూళ్లా?

Thimmarajupalli TV Collections: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కలెక్షన్లు.. కొత్త కుర్రాళ్ల సినిమాకి ఈ రేంజ్‌లో వసూళ్లా?

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతోంది. క్రిటికల్‌గా ప్రశంసలందుకున్న ఈ చిత్రం డీసెంట్‌గా వసూళ్లని రాబడుతోంది. మరి నాలుగు రోజుల్లో ఎంత రాబట్టిందంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 20 2026, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సక్సెస్ ఫుల్‌గా రన్‌ అవుతున్న తిమ్మరాజులపల్లి టీవీ
Image Credit : Asianet News

సక్సెస్ ఫుల్‌గా రన్‌ అవుతున్న తిమ్మరాజులపల్లి టీవీ

కొత్త ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు కలిసి రూపొందించిన చిత్రం `తిమ్మరాజుపల్లి టీవీ`. హీరో కిరణ్‌ అబ్బవరం ఈ మూవీని నిర్మించడం విశేషం. వి మునిరాజు దర్శకుడిగా పరిచయం కాగా, సాయితేజ, వేద జలంధర్‌, ప్రదీప్‌ ఇలా చాలా మంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు ఈ మూవీ ద్వారా పరిచయం అయ్యారు. గత వారం విడుదలైన చిత్రాల్లో ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటుతోంది. రోజు రోజుకి కలెక్షన్లు పెరగడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

తిమ్మరాజుపల్లి టీవీ మూవీ కలెక్షన్లు

`తిమ్మరాజుపల్లి టీవీ` మూవీకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతోంది. లిమిటెడ్‌ థియేటర్లో విడుదలైనా, తెలిసిన కాస్టింగ్‌ లేకపోయినా ఈ చిత్రానికి డీసెంట్‌ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమాకి నాలుగు రోజుల్లో రూ.1.30కోట్లు రావడం విశేషం. మొదటి వీకెండ్‌లో పుంజుకున్న ఈ చిత్రం సోమవారం కూడా బుకింగ్స్ స్టడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం నెమ్మదిగా మరింతగా దూసుకుపోయే ఛాన్స్ ఉంది. సోమవారం ఒక్క రోజే ఇప్పటికే బుకింగ్స్ ద్వారా రూ.14లక్షలు వచ్చాయి. ఇది సాయంత్రానికి పెరిగే అవకాశం ఉంది. 

Related Articles

Related image1
Peddi Cast Remuneration: పెద్ది మూవీ ఆర్టిస్ట్‌ ల పారితోషికాలు
Related image2
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే.. రేణు దేశాయ్‌, ఇలియానా, అలియాభట్‌ ఇంకా ఎవరంటే?
34
సక్సెస్ అయిన కిరణ్‌ అబ్బవరం
Image Credit : Asianet News

సక్సెస్ అయిన కిరణ్‌ అబ్బవరం

ఈ మూవీకి సుమారు రెండున్నర నుంచి మూడు కోట్ల బడ్జెట్‌తో రూపొందించారట. బిజినెస్‌ కూడా అయ్యింది. థియేట్రికల్‌గా నాలుగు రోజుల్లోనే కోటిన్నర వచ్చింది. అంటే ఈ మూవీ హిట్‌ దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. ఈ వారం కూడా ఇది బాగానే రన్‌ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మూవీ క్రిటికల్‌గా ప్రశంసలందుకుంది. ఇప్పుడు కమర్షియల్‌గానూ సేఫ్‌లోనూ ఉండబోతుందని తెలుస్తోంది. హీరో కిరణ్‌ అబ్బవరం కొత్తవారిని పరిచయం చేస్తూ, వారికి లైఫ్‌ ఇస్తూ చేసిన ప్రయత్నం సక్సెస్‌ అవుతుందని చెప్పొచ్చు.

44
తిమ్మరాజుపల్లి టీవీ కథ
Image Credit : Asianet News

తిమ్మరాజుపల్లి టీవీ కథ

ఇక తిమ్మరాజుపల్లి టీవీ మూవీ విషయానికి వస్తే ఇది రాయలసీమలోని తిమ్మరాజుపల్లి అనే ఊర్లో సాగుతుంది. ఆ ఊర్లో టీవీ లేదు.  హీరోయిన్‌ అన్న కొత్తగా టీవీ కొంటాడు. దీంతో ఊరంతా వాళ్ల ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తుంటారు. దీంతో అతను తన భార్యతో కూడా గడపలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో హీరో.. హీరోయిన్‌ కోసం వాళ్ల ఇంటికి టీవీ చూడ్డానికి వెళ్లినప్పుడు గొడవఅవుతుంది. ఆ రాత్రినే టీవీ కనిపించకుండా పోతుంది. ఆ టీవీని హీరోనే దొంగిలించాడని అంతా భావిస్తారు. దొంగగా నిందవేస్తాడు. ఆ నిందని పోగొట్టుకునేందుకు ఆయన ఏం చేశాడు? టీవీని కొట్టేసింది ఎవరు? తన ప్రియురాలిని ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది మూవీ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image2
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image3
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Related Stories
Recommended image1
Peddi Cast Remuneration: పెద్ది మూవీ ఆర్టిస్ట్‌ ల పారితోషికాలు
Recommended image2
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే.. రేణు దేశాయ్‌, ఇలియానా, అలియాభట్‌ ఇంకా ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved