- Home
- Entertainment
- Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి జైలర్ 2.. 1000 కోట్ల కలెక్షన్లకు బ్రేకులు.. అది ఇక కలే
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి జైలర్ 2.. 1000 కోట్ల కలెక్షన్లకు బ్రేకులు.. అది ఇక కలే
సూపర్ స్టార్ రజనీకాంత్, ఎస్.జె.సూర్య, విద్యాబాలన్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'జైలర్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

జైలర్ 2 థియేటర్లో బ్లాక్ బస్టర్
రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ 2 సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు అంతా వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూసిన వాళ్లు, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని మళ్లీ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు ఎస్ జే సూర్య, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, యోగిబాబు, రమ్యకృష్ణ, సూరజ్‌తోపాటు గెస్ట్ రోల్స్ లో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్ నటించిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడంతో, ఈ సీక్వెన్స్ కూడా అదిరిపోయే ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా జైలర్ 2
జైలర్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో రజనీకాంత్ తన కొడుకుని కాల్చినట్లు చూపించారు. కానీ అక్కడ కేవలం తుపాకీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. అసలు కొడుకు ఏమయ్యాడు అనే సస్పెన్స్‌తో సెకండ్ పార్ట్ మొదలవుతుంది. ఫస్ట్ పార్ట్ కథకు కంటిన్యూయేషన్‌గా వచ్చిన ఈ సినిమాలో కూడా పాత స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్
అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. థియేటర్లలో సినిమా చూసిన అభిమానులు, ఇప్పుడు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జైలర్ 2 సినిమా నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఓటీటీలో ఈ బ్లాక్‌బస్టర్‌ను చూసేయొచ్చు.
వెయ్యి కోట్లకు బ్రేక్
జైలర్ ఫస్ట్ పార్ట్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఉంది. జైలర్ 2 సినిమా ఇప్పటివరకు రూ.820 కోట్లకు పైగా వసూలు చేసింది. దీపావళి తర్వాత కూడా థియేటర్లలో రన్ చేసి 1000 కోట్ల మార్క్ టచ్ చేయాలని ఓనర్లు ప్లాన్ చేశారు. కానీ సడెన్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ రావడంతో ఆ 1000 కోట్ల కలెక్షన్ల కలకు బ్రేక్ పడింది. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ 900 కోట్లతో ఆగిపోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా కోలీవుడ్‌కి వెయ్యి కోట్లు అనేది కలగానే మిగిలిపోనుంది.





