- Home
- Entertainment
- చిరంజీవి పూజ గదిలో వాళ్ళిద్దరి ఫోటోలు..అలాంటి క్యారెక్టర్ కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు, ఫ్యాన్స్ కామెంట్స్
చిరంజీవి పూజ గదిలో వాళ్ళిద్దరి ఫోటోలు..అలాంటి క్యారెక్టర్ కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు, ఫ్యాన్స్ కామెంట్స్
తాజాగా మరోసారి దటీజ్ మెగాస్టార్ అనిపించేలా ఒక దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. రక్షా బంధన్ సందర్భంగా చిరంజీవి చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి రావు ఆయనకి రాఖి కట్టారు.

మెగాస్టార్ చిరంజీవి నటుడిగా ఎన్నో విజయాలు సాధించారు టాలీవుడ్ లో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఏకఛత్రాధిపత్యం వహించారు. చిరంజీవి వ్యక్తిత్వం గురించి అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఆయన్ని తిట్టే వారికంటే ఆదర్శనంగా తీసుకుని అభిమానించే వారే ఎక్కువ కనిపిస్తారు. తాజాగా మరోసారి దటీజ్ మెగాస్టార్ అనిపించేలా ఒక దృశ్యం ఆవిష్కృతం అయ్యింది.
రక్షా బంధన్ సందర్భంగా చిరంజీవి చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి రావు ఆయనకి రాఖి కట్టారు. అన్నయ్యకి ప్రేమతో భక్తి శ్రద్దలతో వీరిద్దరూ రాఖీ కట్టి చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోలని చిరు సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి నివాసంలో చెల్లెళ్లు ఇద్దరూ అన్నయ్యకి రాఖీ కట్టారు. ఈ చిరంజీవి పూజ గది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటి చిరు పూజగది వైరల్ కావడం ఏంటి అనుకుంటున్నారా. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి తన పూజగదిలో ఇద్దరి వ్యక్తుల ఫోటోలని ఉంచారు. దీనిని బట్టి చూస్తే ఆ ఇద్దరికీ చిరు నిత్యం నమస్కరిస్తూ పూజలు చేస్తున్నారని అర్థం అవుతోంది.
వాళ్లిద్దరూ చిరు లైఫ్ లో ఎంతో ప్రత్యేకమైనవారు. ఒకరు జన్మనిచ్చిన తండ్రి కొణిదెల వెంకట్రావు కాగా మరొకరు పిల్లనిచ్చిన మామ అల్లు రామలింగయ్య. వీరిద్దరి ఫోటోలు చిరు పూజ గదిలో కనిపించాయి. దీనితో చిరంజీవిని ప్రశంసిస్తూ అభిమానులు ఈ దృశ్యాలని వైరల్ చేస్తున్నారు. చిరంజీవి ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఈ వ్యక్తిత్వమే అని అంటున్నారు. చిరంజీవి అంటే ఏంటో మరోసారి చేయబడింది అని కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి ప్రతిభని అల్లు రామలింగయ్య ఆరంభంలోనే గ్రహించి ప్రోత్సహించారు. మంచి గుణం, ప్రతిభ ఉన్న నటుడు కావడంతో తన కుమార్తె సురేఖని ఇచ్చి చిరుకి వివాహం చేశారు. తన స్నేహితుడు సత్యనారాయణ అనే వ్యక్తిని కలుసుకునేందుకు తాను కెరీర్ ఆరంభంలో అల్లు రామలింగయ్య ఇంటికి వెళుతూ ఉండేవాడిని అని చిరు పలు సందర్భాల్లో తెలిపిన సంగతి తెలిసిందే.
చిరంజీవి రీసెంట్ గా భోళా శంకర్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనితో చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇదిలా ఉండగా చిరు తదుపరి బింబిసార దర్శకుడు వసిస్ట్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు.