- Home
- Entertainment
- 2024 సెకండాఫ్ లో రాబోతున్న ఎన్టీఆర్, నితిన్, చైతు, అల్లు అర్జున్ చిత్రాలు..తేడా కొడితే నిర్మాతల పని అంతే
2024 సెకండాఫ్ లో రాబోతున్న ఎన్టీఆర్, నితిన్, చైతు, అల్లు అర్జున్ చిత్రాలు..తేడా కొడితే నిర్మాతల పని అంతే
టాలీవుడ్ కి 2024 ఫస్ట్ హాఫ్ ముగిసినట్లే. కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. ఇక 2024 సెకండాఫ్ మొదలు కాబోతోంది. కొన్ని భారీ చిత్రాలు, మరికొన్ని యువ హీరోల చిత్రాలు సెకండాఫ్ లో రిలీజ్ కాబోతున్నాయి.

టాలీవుడ్ కి 2024 ఫస్ట్ హాఫ్ ముగిసినట్లే. కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. ఇక 2024 సెకండాఫ్ మొదలు కాబోతోంది. కొన్ని భారీ చిత్రాలు, మరికొన్ని యువ హీరోల చిత్రాలు సెకండాఫ్ లో రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో కొన్ని చిత్రాలు తప్పనిసరిగా హిట్ కావలసిందే. లేకుంటే హీరోలకు, నిర్మాతలకు డేంజర్ బెల్స్ మోగినట్లే.
ఎన్బీకే 109
అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి బాలయ్య మంచి జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109 చిత్రంలో నటిస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంతో కూడా హిట్ కొట్టి జైత్ర యాత్ర కొనసాగించాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తండేల్
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ అవుతోంది. చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య చివరగా నటించిన కస్టడీ, థ్యాంక్యూ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. తండేల్ చిత్రంతో చైతు తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిందే. లేకుంటే హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డట్లు అవుతుంది.
రాబిన్ హుడ్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. నితిన్ పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. నితిన్ సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలం అవుతోంది. కాబట్టి రాబిన్ హుడ్ పై ఆశలు పెట్టుకున్నాడు. మంచి ఎంటర్టైనింగ్ కథతో మ్యాజిక్ చేయడం వెంకీ కుడుముల స్టైల్. ఆ ధీమాతోనే రాబిన్ హుడ్ మూవీ హిట్ అవుతుందని నితిన్ ఆశిస్తున్నాడు.
పుష్ప 2:
అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే పుష్ప 2 ఆగష్టు లో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 6కి వాయిదా వేశారు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో కొన్ని రోజులు వాయిదా పడ్డా నిర్మాతలకు భారం అవుతుంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోందట. ఇంత బడ్జెట్ రికవరీ కావాలంటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలసిందే. పుష్ప మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.
దేవర
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై హైప్ మామూలుగా లేదు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు రాబట్టడం కేక్ వాక్ అనే చెప్పొచ్చు. తేడా కొడితే భారీ బడ్జెట్ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
ఓజి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనుకున్న టైంకి ఈ చిత్రం వస్తుందా లేదా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందా అనే విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్ ఒక రేంజ్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
సరిపోదా శనివారం
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. వైద్యమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దసరాతో పర్వాలేదనిపించిన నాని ఈ చిత్రంతో జూలు విదిల్చాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆగష్టు ఎండింగ్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
డబుల్ ఇస్మార్ట్
అటు పూరి జగన్నాధ్ కి, ఇటు రామ్ పోతినేని ఇద్దరికీ డబుల్ ఇస్మార్ట్ చాలా కీలకం. ఆగష్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 వాయిదా పడడంతో ఆరోజున డబుల్ ఇస్మార్ట్ వచ్చేస్తున్నాడు. పూరి సొంత నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కించారు. పూరి చివరి చిత్రం లైగర్ ఏమైందో తెలుసుగా.. మరోవైపు రామ్ పోతినేనికి కూడా వారియర్, స్కంద లాంటి వరుస ఫ్లాపులు పడ్డాయి.
కల్కి 2898 AD
జూన్ ఎండింగ్ లో 27వ తేదీన యావత్ దేశం ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి చిత్రం రాబోతోంది. ఆల్మోస్ట్ 2024 సెకండాఫ్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్లే భావించాలి. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కల్కి. దాదాపు 600 కోట్ల పైగా బడ్జెట్ లో వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.