- Home
- Entertainment
- వరుస ఫ్లాపులతో ట్రాక్ తప్పిన కెరీర్.. ఒక్క హిట్టు ప్లీజ్ అంటున్న గోపీచంద్, నితిన్, వరుణ్, రామ్
వరుస ఫ్లాపులతో ట్రాక్ తప్పిన కెరీర్.. ఒక్క హిట్టు ప్లీజ్ అంటున్న గోపీచంద్, నితిన్, వరుణ్, రామ్
వరుస ఫ్లాపులతో కొందరు యువ హీరోల కెరీర్ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తోంది. త్వరపడి మంచి చిత్రాలతో రాకుంటే కెరీర్ డేంజర్ లో పడే ప్రమాదం ఉంది.

వరుస ఫ్లాపులతో కొందరు యువ హీరోల కెరీర్ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తోంది. త్వరపడి మంచి చిత్రాలతో రాకుంటే కెరీర్ డేంజర్ లో పడే ప్రమాదం ఉంది. ఈ ఏడాది కూడా కొందరు హిట్ అందులేక బోల్తా పడ్డారు. మరికొందరు హిట్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.
నితిన్ : యంగ్ హీరో నితిన్ కి భీష్మ తర్వాహ క్లీన్ హిట్ అంటూ లేదు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఇలా నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఎక్స్ట్రా విమర్శలు మూటగట్టుకుంది. దీనితో నితిన్ తదుపరి చిత్రాలతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరుణ్ తేజ్ : వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ నటుడిగా గుర్తింపు పొందుతున్నాడని ప్రశంస తప్ప వరుణ్ తేజ్ కి కలిసొచ్చే అంశం ఒక్కటీ కనిపించడం లేదు. వరుణ్ తేజ్ నుంచి రీసెంట్ గా విడుదలైన ఆపరేషన్ వాలంటైన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నష్టపోయింది. అంతకు ముందు వచ్చిన గాండీవదారి అర్జున, గని, ఎఫ్ 3 చిత్రాలది కూడా అదే పరిస్థితి. వీలైనంత త్వరగా వరుణ్ తేజ్ అలెర్ట్ అయి కెరీర్ ని చక్కబెట్టుకోవాలి.
గోపీచంద్ : ఆరడగుల ఆజానుబాహుడు గోపీచంద్ పరిస్థితి కూడా అలానే ఉంది. గోపీచంద్ కి నిఖార్సైన హిట్ పది ఎన్నేళ్లు అవుతోందో.. రీసెంట్ గా విడుదలైన భీమా చిత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. దీనితో గోపీచంద్ కి ఎదురుచూపులు తప్పడం లేదు. క్రమంగా గోపీచంద్ మార్కెట్ పరిధి తగ్గుతూ వస్తోంది. మరింత దిగజారకుండా ఉండాలంటే నెక్స్ట్ రాబోతున్న శ్రీనువైట్ల చిత్రంతో హిట్ కొట్టాల్సిందే.
అఖిల్ : అక్కినేని వారసుడు ఇంతవరకు హిట్ ఖాతా తెరవనేలేదు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పటి వరకు అఖిల్ 5 చిత్రాల్లో నటించాడు. కానీ సంతృప్తికరమైన రిజల్ట్ ఒక్కటి కూడా లేదు. మరి అఖిల్ కి మహర్దశ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
వైష్ణవ్ తేజ్ : ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. గత ఏడాది వైష్ణవ్ తేజ్ కి ఆదికేశవ రూపంలో ఫ్లాప్ ఎదురైంది. మంచి కథలు ఎంచుకుంటేనే ఈ మెగా మేనల్లుడి కెరీర్ ట్రాక్ లోకి వస్తుంది.
nagashourya
నాగ శౌర్య : నాగ శౌర్య కి కూడా ఇటీవల ఏమాత్రం కలసి రావడం లేదు. బాగా కష్టపడుతున్నాడు కానీ ఒక్క హిట్ కూడా దక్కడం లేదు. మరి నాగశౌర్య ఛలో తరహాలో ఎప్పుడు మెప్పిస్తాడో చూడాలి.
బెల్లంకొండ శ్రీనివాస్ : బెల్లంకొండ అమ్మాయిది కెరీర్ మొదటి నుంచి ఒకటే పంథా. వరుసగా మాస్ చిత్రాలు చేస్తున్నాడు కానీ కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదు. ఆ మధ్యన బాలీవుడ్ లో ఛత్రపతి చిత్రాన్ని రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. వీలైనంత త్వరగా ఒక్క హిట్ అయినా కొట్టకపోతే కెరీర్ డైలమాలో పడిపోతుంది.
రామ్ పోతినేని : ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పోతినేని కి కూడా హిట్ లేదు. రెడ్, వారియర్, స్కంద ఇలా వరుస ఫ్లాప్ చిత్రాలు ఎదురయ్యాయి. మరోసారి రామ్ తన ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నే నమ్ముకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ లో నటిస్తున్నాడు.