MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ డైరెక్టర్లకు ఈ హీరోయిన్లు చాలా ఫేవరెట్.. వీరి కాంబోలో హిట్ పక్కా!

టాలీవుడ్ డైరెక్టర్లకు ఈ హీరోయిన్లు చాలా ఫేవరెట్.. వీరి కాంబోలో హిట్ పక్కా!

తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్లు - హీరోలకు మధ్య హిట్ కాంబినేషన్లు ఉన్న విషయం తెలిసిందే. ఇక మన దర్శకులకు ఫేవరెట్ హీరోయిన్లు కూడా ఉన్నారు. వారితో సినిమా సెట్ అయితే పక్కా హిట్ అందిస్తున్నారు. ఆ కాంబినేషన్ల గురించి తెలుసుకుందాం. 

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 17 2023, 01:03 PM IST| Updated : Nov 17 2023, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం’ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)కు ఆరేళ్ల తర్వాత హిట్ అందింది. వీరి కాంబోలో మొదట వచ్చిన RX100 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. మళ్లీ అదే కాంబో రిపీట్ చేస్తూ Mangalavaaram తో హిట్ అందుకోవడం విశేషం. దీంతో వీరిది హిట్ కాంబినేషన్ అని తేలిపోయింది.
 

27

మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) చాలా మంది హీరోయిన్లతో వర్క్ చేశారు. కానీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde)ను తన సినిమాలకు రిపీట్ చేస్తూ వస్తున్నారు. వీరి కాంబోలో గతంలో ‘అరవింద సమేత’, ‘అల వైకుంటపురంలో..’ చిత్రాలు వచ్చిన సక్సెస్ అయ్యాయి. ఇక ‘గుంటూరు కారం’లోనూ పూజాకు అవకాశం ఇచ్చారు గురూజీ. ఈ క్రేజీ కాంబినేషన్ ఈసారి కాస్తాలో మిస్ అయ్యింది.
 

37

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)కి హీరోయిన్ల సెంటిమెంట్ లేదు. ఆయన సినిమాల్లోనే ఛాన్స్ కోసం ముద్దుగుమ్మలు ఎదురుచూస్తుంటారు. కానీ జక్కన్న కూడా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty)కి రెండు సార్లు అవకాశం ఇచ్చారు. వీరి కాంబోలో వచ్చిన ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. మిగితా హీరోయిన్లతో పోల్చితే రాజమౌళి సినిమాలో  స్విటీ ఉంటే బాక్సాఫీస్ బద్దలనే చెప్పాలి. 

47

లవ్ స్టోరీలను తెరకెక్కించే దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana). ఈయన తీసింది ‘నిన్ను కోరి’, ‘మజిలి’, ‘టక్ జగదీష్’, ‘ఖుషి’ వంటి నాలుగు సినిమాలే. అందులో రెండుసార్లు స్టార్ బ్యూటీ సమంత (Samantha)కు అవకాశం ఇచ్చారు. హిట్ కొట్టారు. ‘మజిలి’, ‘ఖుషి’తో శివనిర్వాణ - సామ్ రెండు సార్లు కలిసి పనిచేశారు. వారిది సక్సెస్ ఫుల్ కాంబినేషనల్ అని ఫ్రూవ్ చేశారు.
 

57

విభిన్న కథలతో పాటు లవో స్టోరీలనూ గుర్తుండిపోయేలా తెరకెక్కించడం శేఖర్ కమ్ముల (Shekar Kammula)  ప్రత్యేకత. ‘హ్యాపీ డేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’, మధ్యలో ‘లీడర్’ వంటి సినిమాలతో ఆయన దర్శక ప్రతిభను చాటుకున్నారు. ఇక శేఖర్ కమ్ములకు ఫెవరేట్ హీరోయిన్ అంటే సాయిపల్లవి (Sai Pallavi) అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి కాంబోలో వచ్చిన ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’తో ఆ విషయం తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ తో 51వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 

67

దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)  ‘బృందావనం’తో తొలిహిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)  నటించింది. ఆ వెంటనే ‘ఎవడు’ సినిమాలోనూ కాజల్ ను రిపీట్ చేశారు. వంశీ పైడిపల్లి -కాజల్ కాంబోలోనూ సక్సెస్ అందడం విశేషం. 

77

మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని (Gopichand Malineni)  - శృతిహాసన్ (Shruti Haasan) కాంబో కూడా హిట్ అనిపించింది. ‘క్రాక్’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో సక్సెస్ గా నిలిచారు. శృతిని రిపీట్ చేసిన గోపీచంద్ మాలినేని కూడా హిట్ అందించారు. దీంతో వీరిది కూడా హిట్ కాంబో అనే చెప్పొచ్చు,. 


 

About the Author

SG
Sreeharsha Gopagani
అనుష్క శెట్టి
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved