తారకరత్న, పునీత్, ఉదయ్ కిరణ్, యశో సాగర్ సహా.. చిన్న వయసులోనే ప్రాణాలు వదిలిన సినీ స్టార్స్ వీరే.!
చిత్ర పరిశ్రమలో బోలెడంత జీవితాన్ని చూడాల్సిన మన యంగ్ హీరోలు చాలా మందే మృత్యువు బారిన పడ్డారు. తాజాగా నందమూరి తారకరత్న కూడా అకాల మరణం చెందారు. ఆయన సహా మరికొందరు సినీ స్టార్స్ కూడా అతిచిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలను చేరారు.
టాలీవుడ్ నటుడు, నందమూరి తారకరత్న (Taraka Ratna) అతిచిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు చేరుకోవడం బాధాకరం. ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్న నందమూరి హీరో మృత్యువు బారిన పడటం అందరిని కంటతడి పెట్టిస్తోంది. 39 ఏండ్ల వయస్సులోనే గుండెపోటుతో అకాల మరణం చెందడం బాధాకరం. 23 రోజుల పాటు బెంగళూరులో అత్యాధునికి చికిత్స అందించిన ఫలితం లేదు. శనివారం (2023 జనవరి 18)న సాయంత్రం కన్నుమూశారు. యంగ్ ఏజ్ లోనే చనిపోయిన సినీ నటుడిగా మిలిపోయారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కన్నడ పవర్ స్టార్, అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) కూడా అకాల మరణం చెందారు. చాలా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండే ఆయన వయస్సు కాని వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు. 2021 అక్టోబర్ 29న తన 46ఏట ప్రాణాలు వదిలారు. ఆయన మరణంతో ఒక్కసారిగా సినీలోకం ఉల్కిపడింది. అప్పు లేరనే బాధలో కన్నీరుమున్నీరయ్యారు. ఇక అన్న శివరాజ్ కుమార్ ఇప్పటికీ పునీత్ ను మరిచిపోలేకపోతున్నారు.
టాలీవుడ్ లవర్ బాయ్ గాపేరొందిన ఉదయ్ కిరణ్ (Uday Kiran) అత్యంత చిన్నవయస్సులోనే మరణించారు. తన నటనా జీవితాన్ని 2000ల నుండి ప్రారంభి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. యూత్ లో మంచి ఫేమ్ సంపాధించాడు. అప్పట్లో ఇండస్ట్రీలోనూ ఉదయ్ కిరణ్ క్రేజ్ అంతాఇంతా కాదు. అలాంటి యంగ్ హీరో జనవరి 5, 2014లో కన్నుమూశారు. 33 ఏండ్లలోనే మరణించిన కుర్రహీరోగా అభిమానులకు బాధను మిగిల్చారు.
‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ మూవీ హీరో యశో సాగర్ (Yasho Sagar) తొలిచిత్రంతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కన్నడ ఫేమస్ నిర్మాత కొడుకుగా 2008లో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కేవలం నాలుగేండ్లు కేరీర్ పూర్తి చేసుకొని కన్నుమూశారు. బెంగళూరులోని ఓ హైవేలో కారు యాక్సిడెంట్ తో 25 డిసెంబర్ 2012న యశో సాగర్ మరణించిన విషయం తెలిిసందే.
తెలుగు యంగ్ హీరో సుధీర్ వర్మ (33) రీసెంట్ గా వైజాగ్‌లో తన నివాసంలోనే మరణించారు. పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. అతని వ్యక్తిగత జీవితం సరిగా లేదనే మనస్థాపంతో 23 జనవరి, 2023న సూసైడ్ చేసుకున్నారు. దీంతో సినీలోకం దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘సెకండ్ హ్యాండ్’,‘కుందనపు బొమ్మ’ వంటి చిత్రాలతో అలరించాడు.
బాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందిన సుషాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) యుక్తవయస్సులోనే సూసైడ్ చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. 34 ఏండ్లలోనే 2020 జూన్ 14న తన ఫ్లాట్ లోనే ఆత్మహత్య చేసుకొని విగత జీవిగా కనిపించాడు. అప్పట్లో ఈన్యూస్ ఇండస్రీలో విషాద ఛాయలను నెలకొల్పింది. చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవడం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.