ఈవారం ఓటీటీకి పోటీగా థియేటర్ రిలీజ్ లు... ఏ సినిమాలు రాబోతున్నాయంటే..?
ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలు కూడా పోటా పోటీ రిలీజ్ లకు సై అంటున్నాయి. ఈ సారి థియేటర్లను ఓ రెండు మంచి సినిమాలు పలకరించబోతుంటే. ఓటీటీల్లో డీజే దడదడలు వినిపించబోతున్నాయి

కరోనాను చిన్నగా మర్చిపోతున్నారు జనాలు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలంటే మొన్నటి వరకూ బయపడ్డ ఆడియన్స్ కు ఇప్పుడు భయం పోయింది. ధైర్యంగా వెళ్లి సినిమాలు చూస్తున్నారు. ఇక మూవీ మేకర్స్ కూడా ధైర్యంగా తమ సినిమాలు థియేటర్ రూటు పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం బాక్సాఫీస్ ను మంచిమంచి సినిమాలు పలకరించబోతున్నాయి. అటు ఓటీటీల్లో కూడా కొత్త సినిమాల సంబరం జరగబోతోంది.
ముందుగా థియేటర్ల సంగతి చూసుకుంటే ఈ వారం.. అందులోను శుక్రవారం వరుస రిలీజ్ లు ఉండగా.. అంతకంటే ముందు గురువారం మార్చ్ 3న థియేటర్లను పలకరించబోతోంది దుల్కర్ సల్మాన్ నటించిన హేసినామిక సినిమా. కాజల్ అగర్వాల్, అదితిరావ్ హైదరీ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాను.. ప్రముఖ కొరియోగ్రఫర్ బృదా మాస్టార్ డైరెక్ట్ చేశారు.
ఇక శుక్రవారం సినిమాల వింధు ఉండనే ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో.. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. సీనియర్ హీరోయిన్లు రాధికా, కుష్భు, ఊర్వశి ఇంపార్టెంట్ రోలో చేసిన ఈ సినిమా ను మార్చి 4న రిలీజ్ చేయబోతున్నారు. వరుస సినిమాల ఫేయిల్యూర్స్ ను చూస్తూ.. ఈ సినిమాపై శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
రాణీ వారు రాజావారు, ఎస్ ఆర్ కల్యాణ మండపం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ స్టార్ నటించిన మరో సినిమా సెబాస్టియన్ పీసీ524. రేచీకటి ఉన్న వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది... తను ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని బాలాజీ సయ్యపురెడ్డి డైరెక్ట్ చేయగా.. కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చ్ 4 శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా హిట్ అయితే కిరణ్ కు హ్యాట్రిక్ పడ్డట్టే.
ఇక ఈవారం థియేటర్లకు పోటీగా ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల్లో ఇంట్రెస్టింగ్ మూవీ డీజే టిల్లు. యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమాలో సిద్థు జోన్నల గడ్డతో పాటు నేహా శెట్టి జంటగా నటించింది. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను. తెలుగు మొట్టమొదటి ఓటీటీ యాప్ ఆహాలో మార్చ్ 4న స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
తమిళ స్టార్ విశాల్ హీరోగా డింపుల్ హయతీ హీరోయిన్ గా శరవణన్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా సామాన్యుడు. జనవరి 26న రిలీజ్ అయిన్ ఈ మూవీ పెద్దగా ప్రేక్షకఆదరణ పొందలేదు. ఇక ఈసినిమాను మార్చ్ 4న జీ5 లో స్ట్రీమింగ్ చేయడానికిరెడీ అవుతున్నారు టీమ్. ఇవే కాదు మరికొన్ని వెబ్ సిరీస్ లు .. హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి