MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘డీజే టిల్లు 2’ హీరోయిన్ గా శ్రీలీలా తప్పుకోవడానికి కారణం ఇదే.. ఫైనల్ అయిన అనుపమా పరమేశ్వరన్.!

‘డీజే టిల్లు 2’ హీరోయిన్ గా శ్రీలీలా తప్పుకోవడానికి కారణం ఇదే.. ఫైనల్ అయిన అనుపమా పరమేశ్వరన్.!

బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా  ‘డీజే టిల్లు 2’ రాబోతోంది. ఈమూవీలో హీరోయిన్ గా తొలుత శ్రీలీలాను అనుకున్నా.. అనుపమా పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు. ఇంతకీ శ్రీలీలా తప్పుకోవడానికి, అనుపమా ఫైనల్ కావడానికి కారణమేంటో తెలిసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 01 2022, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డేర్ అండ్ డాషింగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) తాజాగా  నటిస్తున్న చిత్రం ‘డీజే టిల్లు 2’. కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ‘డీజే టిల్లు’కు ఇది సీక్వెల్. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇంతకీ హీరోయిన్ ఎవరనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. 

26

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)ను Dj Tillu 2 హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలిపారు. తొలి భాగంలో హీరోయిన్ నేహా శెట్టి నటించిన విషయం తెలిసిందే. ‘రాధిక’గా ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టింది. కానీ ఊహించని విధంగా మేకర్స్ సీక్వెల్ లో హీరోయిన్ మార్పును తప్పనిసరిగా భావించారు. 
 

36

ఈ క్రమంలో నేహా శెట్టికి బదులుగా యంగ్ హీరోయిన్, ‘పెళ్లి సందడి’ బ్యూటీ శ్రీలీలా (Sree Leala)ను తీసుకోవాలని భావించారు. కానీ శ్రీలీలా చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే  మాస్ మహా రాజా రవితేజ సరసన ‘ధమాకా’లో, ‘అనగనగా ఒక రాజు’ మూవీలో నటిస్తోంది. మరోవైపు బాలయ్య అప్ కమింగ్ ఫిల్మ్ లోనూ మెరియనున్నట్టు తెలుస్తోంది. 
 

46

ఇదీగాకా ‘డీజే టిల్లు’ను నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే శ్రీలీలాకు సంబంధించిన మరో మూడు ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి. అదీగాకా ఈ బ్యూటీ కన్నడలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది. ఇతర భాషల సినిమాల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ‘డీజే టిల్లు 2’కు హీరోయిన్ గా ఎంపిక చేస్తే  డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉందని శ్రీలీలానే తప్పుకున్నట్టు తెలుస్తోంది. 
 

56

శ్రీలీలా తప్పుకోవడంతో వెంటనే అనుపమా పరమేశ్వరన్ ను ఫైనల్ చేసి షూటింగ్ ను ప్రారంభించారు. శ్రీలీలా కంటే అనుపమాకు యూత్ గట్టి ఫాలోయింగ్ ఉండటం, ఇటీవలనే ‘కార్తీకేయ 2’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో అనుపమాను ఫైనల్ చేశారు. మొత్తంగా ‘డీజే టిల్లు 2’ హీరోయిన్ గా కేరళ కుట్టిని ఫైనల్ చేసినట్టు మేకర్స్ కన్ఫమ్ చేయడం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
 

66

‘డీజే టిల్లు’ ఊహించని స్థాయిలో విజయవంతం కావడంతో సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యూలర్ షూటింగ్ హైదరాబాద్ లోనే కొనసాగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమా మధ్య సాగే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ‘డీజే టిల్లు 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగార్జున, ఎన్టీఆర్ నుంచి సుమ శ్రీముఖి వరకూ.. భారీ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ యాంకర్స్ ఎవరో తెలుసా?
Recommended image2
Dhurandhar 2 Box Office: కలెక్షన్లలో భారీ డ్రాప్, అయినా `ధురంధర్‌ 2` సరికొత్త రికార్డు
Recommended image3
Jr NTR: జూ.ఎన్టీఆర్ మిస్సైన పొలిటికల్ మూవీ.. బెదిరింపులు ఏ రేంజ్ లో వచ్చాయో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved