- Home
- Entertainment
- చలాకీ చంటి ‘బిగ్ బాస్’కు వెళ్లడానికి అసలు కారణం.. జబర్దస్త్ నుండి వెళ్లగొట్టడానికి ఇంత కుట్ర జరిగిందా?
చలాకీ చంటి ‘బిగ్ బాస్’కు వెళ్లడానికి అసలు కారణం.. జబర్దస్త్ నుండి వెళ్లగొట్టడానికి ఇంత కుట్ర జరిగిందా?
పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు 6’ నిన్న సాయంత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్ లో చలాకీ చంటి కంటెస్టెంట్ గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ‘జబర్దస్త్’ నుంచి ఈషోకు రావడానికి అసలు కారణం ఏంటో చంటి రివీల్ చేశాడు.

నటుడు, కమెడియన్ చలాకీ చంటి (Chalaki Chanti) పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు 6’ (Bigg Boss Telugu 6) కంటెస్టెంట్ గా ఎంపికైన విషయం తెలిసిందే. షోకు ఎంట్రీ ఇవ్వడానికి ముందుకు కంటెస్టెంట్లు హౌజ్ లోకి ఎందుకు వెళ్లారో వారివారి కథను వినిపించారు.
అయితే అప్పటికే సెలబ్రెటీ అయినా.. కమెడియన్ చంటి కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేముందు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను తెలిపారు. జబర్దస్త్ కు రావడానికి ముందే పలు చిత్రాల్లో నటించిన చంటి.. ఈషోతోనే ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనను వెళ్లగొట్టడానికి ‘జబర్దస్త్’లో జరిగిన కుట్రలను వెల్లడించారు.
చంటి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానన్నారు. నాగార్జున నోట తన ‘చంటి’అనే పేరు వినాలని ఆశించానన్నారు. తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ తనకు సపోర్ట్ చేయాలని కోరారు. అయితే ‘బిగ్ బాస్ తెలుగు 6’కు వచ్చేముందు ‘మల్లెమాల’లో జరిగిన విషయాలను రివీల్ చేశారు.
మల్లెమాల షోలో తనకు అవమానం జరిగిందని తెలిపారు. వాళ్లు ఇచ్చే డబ్బులు సరిపోలేదని.. వాళ్లని రిక్వెస్ట్ చేస్తే దారుణంగా బదులిచ్చారన్నారు. ‘నీ టాలెంట్ ఇదే ఎక్కువ’ అంటూ అనడం తనను బాధించిందన్నారు. మరోవైపు తను ముక్కుసూటి మనిషినని, తప్పు జరిగితే వెంటనే ప్రశ్నిస్తానని అన్నారు. అలా ఎప్పటికప్పుడు ప్రశ్నించడం మూలంగా తనను ‘కోపిష్టి, పొగరు, అటిట్యూడ్, ఈగో’ అంటూ తనను ముద్రవేశారని తెలిపారు.
ఇలాంటివన్నీ తనను ‘జబర్దస్త్’ నుంచి వెల్లగొట్టడానికి కారణం అయ్యాయని తెలిపారు. ఇక నాగబాబు గురించి కూడా మాట్లాడుతూ.. ఆయన Jabardasth లో పనిచేసే వారందరికీ దగ్గరగానే ఉన్నారని తెలిపారు. ఆయన ఆఫీసులోకి అందరూ వెళ్లేవారని చెప్పారు. అలాంటి వ్యక్తి ఎదో చేశారనేదానిపై పరోక్షంగా కాదనే సమాధానం ఇచ్చారు.
ఏదేమైనా చలాకీ చంటి హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎలా ఎంటర్ టైన్ చేయనున్నారనేది చూడాలి. ‘చంటిసారా’గా పవర్ ఫుల్ ఏవీతో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చంటి.. పక్కా ఎంటర్ టైన్ చేస్తానని హామీనిచ్చారు. ఇక నెలలు మాత్రమే నిండిన తన బిడ్డను, ఫ్యామిలీ వదిలి వెల్లడం కొంచెం బాధాగా ఉందన్నారు.