- Home
- Entertainment
- Raja Saab Collections : ప్రభాస్ కు భారీ షాక్, ది రాజా సాబ్ రెండో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఇంత దారుణమా?
Raja Saab Collections : ప్రభాస్ కు భారీ షాక్, ది రాజా సాబ్ రెండో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఇంత దారుణమా?
Raja Saab Box Office Day 2 Collections : ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ సాధించింది. కానీ రెండో రోజు మాత్రం ప్రభాస్ అభిమానులకు షాక్ తప్పలేదు. ఈసినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇంతకీ ఈసినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

'ది రాజా సాబ్' రెండో రోజు కలెక్షన్స్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దాసరి డైరెక్ట్ చేసిన హారర్ కామెడీ సినిమా 'ది రాజా సాబ్. ఈసినిమా రెండో రోజు సుమారు 27.83 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. మొదటి రోజుతో పోలిస్తే, దీని వసూళ్లలో దాదాపు 48.22 శాతం తగ్గుదల కనిపించింది. ఈ సినిమా మొదటి రోజు 53.75 కోట్ల రూపాయలు (ప్రీమియర్ షోలు మినహా) సంపాదించింది.
100 కోట్ల క్లబ్‌కు చేరువలో 'ది రాజా సాబ్'
ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ లాంటి స్టార్స్ నటించిన 'ది రాజా సాబ్' సినిమా రెండో రోజు ఇండియాలో 100 కోట్లు సాధిస్తుందని అనుకున్నారు. కానీ.. ఈ సినిమా ఆ మార్క్ ను అందుకోలేకపోయింది. కానీ రెండు రోజుల మొత్తం కలెక్షన్స్ తో 100 కోట్ల క్లబ్‌కు చాలా దగ్గరగా వెళ్లింది మూవీ. రాజాసాబ్ సినిమా మొత్తం రెండు రోజుల వసూళ్లు కలిపి 90.73 కోట్ల రూపాయలకు చేరాయి. ఇందులో గురువారం ప్రీమియర్ల ద్వారా వచ్చిన 9.15 కోట్ల రూపాయల వసూళ్లు కూడా ఉన్నాయి.
'ది రాజా సాబ్' హిందీ వెర్షన్ కలెక్షన్లు ఎంత?
'ది రాజా సాబ్' హిందీ వెర్షన్ వసూళ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఫస్ట్ డే ప్రభాస్ సినిమా 6 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు 5.2 కోట్లకే పరిమితం అయ్యింది మూవీ. రెండురోజులకు కలిపి మొత్తం కలెక్షన్ 11.2 కోట్లకు చేరింది. సినిమా మిగతా నాలుగు వెర్షన్లు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రెండు రోజుల తర్వాత మొత్తం వసూళ్లు వరుసగా 78.68 కోట్లు, 55 లక్షలు, 14 లక్షలు, 16 లక్షల రూపాయలుగా ఉన్నాయి.
'ది రాజా సాబ్' వరల్డ్‌వైడ్ వసూళ్లు..?
వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 'ది రాజా సాబ్' పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100.60 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, రెండు రోజుల తర్వాత మొత్తం వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ 138.4 కోట్లకు మాత్రమే చేరింది. అంటే, రెండో రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 29.8 కోట్లు మాత్రమే సంపాదించింది, ఇది మొదటి రోజుతో పోలిస్తే కేవలం 29.6 శాతం మాత్రమే.
ఓవర్సీస్ మార్కెట్‌లో 'ది రాజా సాబ్' మొత్తం కలెక్షన్ ఎంత?
ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడితే, ఈ సినిమా రెండు రోజుల్లో అక్కడ కేవలం 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇందులో 25 కోట్లు మొదటి రోజే వచ్చాయి. ఈ లెక్కన చూస్తే, రెండో రోజు ఓవర్సీస్ నుంచి కేవలం 5 కోట్లు మాత్రమే వచ్చాయి, ఇది మొదటి రోజుతో పోలిస్తే 20 శాతం మాత్రమే.

