ఎన్టీఆర్ ను ఇప్పటికీ బాధపెడుతున్న సినిమా ఏదో తెలుసా? తారక్ ఆ మూవీ చేసుంటే?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతీ హీరో తన కెరీర్ లో ఏదో ఒక సినిమా రిజెక్ట్ చేయడం సహాజం. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక అరే.. చేసుంటే బాగుండేది అని ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి. ఎన్టీఆర్ కెరీర్ లో కూడా అలాంటి సినిమా ఒకటి ఉందట. ఇంతకీ ఏంటా సినిమా?

పాన్ ఇండియా హీరోగా యంగ్ టైగర్..
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ ను సాధించాడు. ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఆయన దేవర సినిమాతో మరో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు రాజమౌళి సినిమా చేసిన తరువాత ఎంత పెద్ద హీరో అయినా.. నెక్ట్స్ ప్లాప్ చూడాల్సిందే అనే సెంటిమెంట్ ఉంటుంది. కానీ ఆ సెంటిమెంట్ ను కూడా తారక్ బ్రేక్ చేసి.. దేవరతో సక్సెస్ సాధించి చూపించాడు.
ఎన్టీఆర్ కెరీర్ లో మిస్ అయిన హిట్ సినిమాలు..
కథ నచ్చకపోవడ, కాల్షీట్లు లేకపోవడం, దర్శకుడిపై నమ్మకం లేకనో.. ఇమేజ్‌కు సెట్ కాదన్న కారణాలతో చాలామంది హీరోలు కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తుంటారు. అలాగే ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లో కొన్ని సినిమాలు మిస్ అయ్యాడు. బొమ్మరిల్లు, ఆర్య, పటాస్ లాంటి సినిమాల కథలు ముందుగా ఎన్టీఆర్ వద్దకే వచ్చాయని సమాచారం. రకరకాల కారణాలతో ఆయన కొన్ని ప్రాజెక్టులను వదిలేశారు. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్ని సినిమాలు మిస్ అయినా.. పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఒక సినిమా విషయంలో మాత్రం తారక్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడుట. ఆ సినిమా చేసి ఉంటే బాగుండు అనుకుంటున్నాడట.
చిన్నవయస్సులోనే హీరోగా ఎంట్రీ..?
జూనియర్ ఎన్టీఆర్ టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇరవై ఏళ్లు నిండకముందే స్టార్ ఇమేజ్ సాధించాడు. వరుసగా స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోయాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ జీవితాన్ని మార్చేసింది. ఈసినిమాతో ఎన్టీఆర్ స్టేటస్ భారీగా పెరిగింది. ఇమేజ్ డబుల్ అయ్యింది. కానీ సింహాద్రి సినిమా తరువాత తారక్ కెరీర్ లో భారీ కుదుపులు చూశాడు. వరుస ఫేయిల్యూన్స్ ఫేస్ చేశాడు. ఆ టైమ్ లో ఒక్క సినిమా ను మిస్ చేసుకుని ఇప్పటికీ బాధపడుతున్నాడట ఎన్టీఆర్.
ఎన్టీఆర్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏది?
ఎన్టీఆర్ మిస్ చేసుకున్న సినిమాలలో భద్ర కూడా ఒకటని తెలుస్తోంది. ఈసినిమా మిస్ చేసుకున్నందుకు తారక్ ఎక్కువగా ఫీల్ అయ్యేవారట. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా కథను మొదట ఎన్టీఆర్‌కు వినిపించారట. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ కథను ఆయన రిజెక్ట్ చేశారు. దాంతో ఆ కథ రవితేజ వద్దకు వెళ్లింది. 2005లో విడుదలైన భద్ర సినిమా లవ్, యాక్షన్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయం సాధించింది. ఈ సినిమా రవితేజ కెరీర్‌కు మంచి బ్రేక్‌గా నిలిచింది.
వరుస ఫెయిల్యూర్స్ తో ఎన్టీఆర్ కెరీర్ లో కుదుపు..
భద్ర విడుదలైన సమయంలో ఎన్టీఆర్ వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా, సాంబ , నా అల్లుడు, నరసింహుడు వంటి సినిమాలు డబుల్ డిజాస్టర్స్‌గా మారాయి. అందులో సాంబ సినిమా ఒక్కటే కాస్త యావరేజ్ గా ఆడింది. అటువంటి టైమ్ లో భద్ర సినిమా చేసి ఉంటే.. చాలా కాలం ఫెయిల్యూర్స్ వెయిట్ ను ఎన్టీఆర్ మోసే ఇబ్బంది లేకపోయేది. అందేకే ఈ ప్రాజెక్ట్‌ను వదిలేసినందుకు ఎన్టీఆర్ ఇప్పటికీ బాధపడుతున్నాడట. ఈ విషయంలో అఫీషియల్ గా ఎవరు వెల్లడించకపోయినా.. ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర ఈవిషయం చెపుతుంటాడని సమాచారం.
ఎన్టీఆర్ ను నిలబెట్టిన రాజమౌళి..
అయితే భద్ర చేయకపోయినా ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. 2007లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌కు ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు. వరుస హిట్స్‌తో కెరీర్‌ను బలంగా నిలబెట్టుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ ఫేమ్‌ను సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ సినిమాల లైన్ అప్ ..
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ సీనిమాను చేస్తున్నాడు. ఈసినిమాకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా తరువాత ఆయన దేవర 2 సెట్స్ లోకి వెళ్లబోతున్నట్టు సమాచారం. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. అందుకోసం భారీగా బరువు తగ్గి.. చాలా స్లిమ్ గా.. డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. వీటితో పాటు మరికొన్ని కథలను ఆయన వింటున్నట్టు సమాచారం.

