MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?

The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?

నేచురల్‌ స్టార్‌ నాని యాక్షన్‌ సినిమాలతో అలరిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల `ది ప్యారడైజ్‌` మూవీతో వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఇప్పుడు ఫెయిల్యూర్‌ చిత్రంగా మిగలబోతుందని సమాచారం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 08 2026, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్యారడైజ్‌తో తనలోని పీక్‌ యాక్షన్‌ చూపించిన నాని
Image Credit : X/@SLVCinemasOffl

ప్యారడైజ్‌తో తనలోని పీక్‌ యాక్షన్‌ చూపించిన నాని

`దసరా` మూవీ నుంచి నాని యాక్షన్‌ సినిమాల వైపు టర్న్ తీసుకున్నారు. అంతకు ముందు ఫ్యామిలీ, లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉంది. దాన్నుంచి బయటపడాలని, తన మార్కెట్‌ని పెంచుకోవడం కోసం యాక్షన్‌ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత `సరిపోదా శనివారం`, `హిట్‌ 3` చిత్రాలతో తనలోని యాక్షన్‌ని చూపించాడు. ఇటీవల వచ్చిన `ది ప్యారడైజ్‌`తో తనలోని ఊరమాస్‌ యాక్షన్‌ని ఆవిష్కరించాడు. ఇంతకు మించి యాక్షన్‌ ఉండబోదనేలా ఈ సినిమా ఉండటం విశేషం. సెప్టెంబర్‌ 24న విడుదలైన ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి పెదవి విరుపు కనిపించింది. కేవలం యాక్షన్‌ లవర్స్ కి, తెలంగాణలోని కొంత మంది ఆడియెన్స్ కి మాత్రం బాగా నచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్యారడైజ్‌ 14రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

ప్యారడైజ్‌ 14రోజుల కలెక్షన్లు

సినిమా విడుదలై 14 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత వచ్చాయి. రోజుకి ఎంత వస్తున్నాయనేది చూస్తే, బుధవారం ఈ చిత్రానికి కోటి రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి. అందులో రూ.94లక్షల ఇండియా నెట్‌, 1.05కోట్ల టోటల్‌ గ్రాస్‌ వచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.169.10కోట్లు వచ్చాయి. అటు ఇటుగా ఇది రూ.170కోట్లకు చేరిందని చెప్పొచ్చు. కానీ సినిమా హిట్‌ కావాలంటే ఇంకా ముప్పై కోట్లు రావాలి.

35
ప్యారడైజ్‌కి నష్టాలు తప్పవా?
Image Credit : Asianet News

ప్యారడైజ్‌కి నష్టాలు తప్పవా?

ప్రారంభంలో `ప్యారడైజ్‌` మూవీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ఓపెనింగ్‌ డే అదరగొట్టింది. వీకెండ్‌ వరకు దుమ్ములేపింది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఇక ఇప్పుడు దారుణంగా పడిపోయింది. రోజుకి కోటీ మాత్రమే వస్తుంది. ఇలా అయితే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌కి చేరడం కష్టమనే టాక్‌ వినిపిస్తుంది. టార్గెట్‌ ఇంకా ముప్పై కోట్లు ఉంది. ఇప్పుడు వస్తున్న కలెక్షన్ల ప్రకారం టార్గెట్‌ రీచ్‌ కావడం కష్టమనే చెప్పొచ్చు. అంతేకాదు ఈ మూవీకి లాస్ట్ ఛాన్స్ మాత్రమే ఉంది. ఈ ఒక్క రోజు మాత్రమే థియేటర్‌ నుంచి ఏమైనా రాబట్టగలదు. శుక్రవారం నుంచి కొత్త సినిమాలు వస్తాయి. చాలా వరకు థియేటర్లు ఎత్తేస్తాయి. వచ్చే వారం `జైలర్‌ 2`, `రణబాలి` మూవీస్‌ ఉన్నాయి. దీంతో మొత్తంగా ఎత్తేయాల్సి వస్తుంది. ఇంకా ఏం చేసినా ఈ సినిమా రెండు మూడు కోట్లు మాత్రమే రాబట్టగలదు. మొత్తంగా షేర్‌ రూపంలో సుమారు రూ.12-15కోట్ల వరకు నష్టాలను మిగిల్చబోతుందని చెప్పొచ్చు.

45
అక్కడ ప్యారడైజ్‌కి భారీ నష్టాలు
Image Credit : Asianet News

అక్కడ ప్యారడైజ్‌కి భారీ నష్టాలు

అయితే ఈ చిత్రం తెలంగాణలో చాలా వరకు బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని సమాచారం. కానీ మిగిలిన అన్ని చోట్ల నష్టాల దిశగా వెళ్తుందట. ఓవర్సీస్‌లోనూ నష్టాలు తప్పలేదని సమాచారం. అక్కడ ఈ మూవీ రూ.31కోట్లు రాబట్టింది. అయినా నష్టాలనే మిగిల్చిందట. ఇక ఏపీలో మాత్రం దారుణంగా పోతుందని, దాదాపు నలభై శాతం నష్టాలు తప్పవని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. టికెట్‌ రేట్ల వల్ల కొంత కలక్షన్లు వచ్చాయని, లేకపోతే అది కూడా కష్టమే అంటున్నారు. ఓవరాల్‌గా భారీ హైప్‌తో వచ్చిన ఈ మూవీ నష్టాలతో క్లోజ్‌ కాబోతుండటం గమనార్హం.

55
సవారీలు గుర్తింపు కోసం చేసిన పోరాటమే ప్యారడైజ్‌
Image Credit : Asianet News

సవారీలు గుర్తింపు కోసం చేసిన పోరాటమే ప్యారడైజ్‌

ఇక నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించగా, కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. మోహన్‌ బాబు విలన్‌గా చేశారు. సంపూర్నేష్‌ బాబు, ఈశ్వరీ రావు, సోనాలీ కులకర్ణి, విషిక, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. సవారీ అనే జాతి తన గుర్తింపు కోసం చేసే పోరాటం ప్రధానంగా వారికి జడల్‌(నాని) చేసిన పోరాటం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం యాక్షన్‌ ప్రధానంగా సాగింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Recommended image2
AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్
Recommended image3
Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే
Related Stories
Recommended image1
Bigg Boss 10 Wild Card Entry: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చేది వీళ్లే.. ఇప్పుడే అసలు మజా
Recommended image2
Roja Selvamani: చిరంజీవి, రోజా, సురేఖ దొంగతనంగా మారువేషంలో చేసిన పనేంటో తెలుసా? వామ్మో అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved