- Home
- Entertainment
- Enneno Janmala Bandham: యష్ ని టార్చర్ చేస్తున్న వేద, ఖుషి.. పగతో రగిలిపోతున్న అభిమన్యు!
Enneno Janmala Bandham: యష్ ని టార్చర్ చేస్తున్న వేద, ఖుషి.. పగతో రగిలిపోతున్న అభిమన్యు!
Enneno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Enneno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యశోదర్ బెడ్రూంలో వేద పడుకొని యశోదర్ (Yashodhar) ను సోఫాలో పడుకోమని ఆర్డర్ వేస్తుంది.

Enneno Janmala Bandham
ఈ క్రమంలో అక్కడకు ఖుషి (Khushi) వచ్చి అమ్మ పడుకుందాం రా.. నాన్న పడుకుందాం రా అంటూ ఇద్దరినీ తన పక్కన పడుకునేలా చేస్తుంది. ఇక నిద్రపోయే సమయంలో యశోదర్ (Yashodhar) గురక పెడుతూ ఉండగా వేద, ఖుషిలు ఆ సౌండ్ ను ఫన్నీగా భరించలేక చెవులు మూసుకుంటారు.
Enneno Janmala Bandham
ఆ గురక సౌండ్ కి చిరాకు పడిన వేద (Vedha) తలగడతో యశోదర్ ను గట్టిగా కొట్టి మళ్లీ ఏమీ తెలియనట్టు నిద్ర పోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. దాంతో యశోదర్ (Yashodhar) ఉలిక్కిపడి లేచి కంగారుగా అటూ ఇటూ చూస్తాడు.
Enneno Janmala Bandham
మరోవైపు అభిమన్యు (Abhimanyu) మన పగ తీరాక మనిద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం బంగారం అంటూ మాళవిక తో అంటాడు. మరోవైపు వేద వేకువజామున మేల్కొని పూజలు చేస్తుంది. ఈలోపు అది చూసిన సులోచన (Sulochana) తన కూతురు కోసం ఫిల్టర్ కాఫీ ప్రేమగా ఇస్తుంది.
Enneno Janmala Bandham
ఆ తర్వాత వేద ఖుషి (Khushi) ను స్కూల్ కి రెడీ చేస్తూ యశోదర్ ను షూ పాలిష్ చేయమని చెబుతుంది. యశోదర్ షూ పాలిష్ లేట్ చేసినందుకు వేద ఫన్నీగా తనపై చిరాకు పడుతుంది. ఇక యశోదర్ ఖుషి ను స్కూల్ కి తీసుకొని వెళతాడు. ఆ తర్వాత వేద (Vedha) తన తల్లి దగ్గర ఈ రోజు నా జీవితంలో గొప్ప రోజమ్మ అంటూ ఏడుస్తుంది.
Enneno Janmala Bandham
అంతేకాకుండా వేద (Vedha) ఖుషి కి తల్లిగా ఈరోజు నాకు పెద్ద పునర్జన్మ అని చెప్పుకు వస్తుంది. ఇక ఆ మాటలు విన్న మాలిని ఫ్యామిలీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. సులోచన (Sulochana) కూడా ఎంతో ఆనంద పడుతుంది.
Enneno Janmala Bandham
ఆ తర్వాత పంతులు గారు వచ్చి యశోదర్ (Yasodar) వెద లకు శోభన ముహూర్తం పెడతాడు. దాంతో మాలిని (Malini) వాళ్ళిద్దర్నీ ఆట పట్టిస్తుంది. కాగా ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.