విజయ్ దేవరకొండను తొక్కేస్తున్న ఆ బ్యాచ్... తమ్ముడు ఆనంద్ దేవరకొండ కీలక కామెంట్స్
ఫ్యామిలీ స్టార్ సినిమా మీద పనిగట్టుకుని టపుడు ప్రచారం చేశారని ఆనంద్ దేవరకొండ ఆవేదన చెందాడు. ఓ ముఠా చిత్ర విడుదలకు రెండు రోజుల ముందే నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టిందని దుయ్యబట్టారు. ఆనంద్ దేవరకొండ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మించాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ కి నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. ఫస్ట్ షో నుండే ట్విట్టర్ ఎక్స్ లో సినిమా బాగోలేదని ప్రచారం జరిగింది.
అయితే ఫ్యామిలీ స్టార్ ప్రచారం చేస్తున్నంత చెత్త సినిమా కాదు. విజయ్ దేవరకొండపై అక్కసుతోనే కొందరు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. దిల్ రాజు మీడియా ముఖంగా ఇదే తరహా అభిప్రాయం వెల్లడించారు. అసలు సినిమా విడుదలైన రెండు రోజుల వరకు రివ్యూలు రాకూడదు. సినిమాను చంపేస్తున్నారని, వసూళ్లను దెబ్బ తీస్తున్నారని ఆవేదన చెందాడు.
ఫ్యామిలీ స్టార్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేసిన కొన్ని ఛానల్స్ మీద చర్యలకు కూడా పాల్పడటం జరిగింది. విజయ్ దేవరకొండ టార్గెట్ గానే ఫ్యామిలీ స్టార్ చిత్రంపై నెగిటివ్ ప్రచారం చేశారనే వాదన వినిపిస్తుండగా... ఆనంద్ దేవరకొండ స్పందించాడు. ఓ గ్రూప్ పనిగట్టుకుని ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దెబ్బ తీశారని ఆయన అన్నారు.
Anand Devarakonda
ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ గం గం గణేశా. ట్రైలర్ విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా... ఒక సినిమా ఎలా ఉందని చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే ఫ్యామిలీ స్టార్ విషయంలో ఒక గ్రూప్ కావాలనే దుష్ప్రచారం చేశారు.
Vijay Devarakonda
ఫ్యామిలీ స్టార్ విడుదలకు 48 గంటల ముందే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. యూట్యూబ్ ఛానల్స్ లో థంబ్ నెయిల్స్ పెట్టి, విజయ్ దేవరకొండ పాత చిత్రాలు ప్రస్తావిస్తూ జనాల్లోకి తప్పుడు మెసేజ్ తీసుకెళ్లారు. ఇది సరైనది కాదు. విజయ్ దేవరకొండ ప్రకటించిన అప్ కమింగ్ చిత్రాలు ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది... అన్నారు.
Family Star Review
ఓ గ్రూప్ టార్గెటెడ్ గా విజయ్ దేవరకొండ సినిమాను తొక్కేయాలని చూశారని పరోక్షంగా తెలియజేశాడు ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గత చిత్రాల మీద కూడా నెగిటివ్ ప్రచారం జరిగింది. ఫ్యామిలీ స్టార్ విషయంలో మరింతగా జరిగింది. విజయ్ దేవరకొండ అప్ కమింగ్ చిత్రాలకు కూడా ఈ నెగిటివ్ ప్రచారం బెడద తప్పేలా లేదు.