MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, అమిత్ షా భేటీ.. ఫ్యాన్స్ కి కావాల్సింది అదే, తెరవెనుక ఉన్నది ఎవరో తెలుసా ?

ఎన్టీఆర్, అమిత్ షా భేటీ.. ఫ్యాన్స్ కి కావాల్సింది అదే, తెరవెనుక ఉన్నది ఎవరో తెలుసా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా అద్భుతమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాలిటిక్స్ ని పట్టించుకోవడం లేదు. అలాగని ఎన్టీఆర్ ని పాలిటిక్స్ నుంచి వేరు చేసి చూడలేం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 22 2022, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా అద్భుతమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాలిటిక్స్ ని పట్టించుకోవడం లేదు. అలాగని ఎన్టీఆర్ ని పాలిటిక్స్ నుంచి వేరు చేసి చూడలేం. 2009 ఎన్నికల కోసం ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయ కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చారు. కానీ తరచుగా తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకరిద్రు టిడిపి నేతలు అప్పుడప్పుడూ టిడిపి పగ్గాలు తారక్ కి అప్పగించాలి అని కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఇటీవల ఎన్టీఆర్ రాజకీయాలపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. 

36

ఊహించని విధంగా ఆదివారం రోజు హైదరాబాద్ లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ జరిగింది. అమిత్ షాతో లంచ్ మీట్ కు హాజరు కావాలని బిజెపి నుంచి తారక్ కి ఆహ్వానం వెళ్ళింది. దీనితో ఎన్టీఆర్ ఆయన్ని కలిశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ అద్భుత నటనని ప్రశంసించేందుకు అమిత్ షా ఆహ్వానించినట్లు పైకి చెబుతున్నారు. కానీ ఈ భేటీ వెనుక పొలిటికల్ స్కెచ్ ఉన్నట్లు సినీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. 

46

కొమరం భీం తెలంగాణ ప్రాంతానికి చెందిన యోధుడు కాబట్టి ఆ సెంటిమెంట్, అలాగే తెలంగాణ టిడిపి ఓట్లు కొల్లగొట్టేందుకు కూడా అయి ఉండొచ్చు అనేది ఒక వాదన. అమిత్ షాతో తారక్ భేటీ వెనుక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే బిజెపి విజయేంద్ర ప్రసాద్ ని రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. 

56
RRR Movie

RRR Movie

ఎన్టీఆర్, అమిత్ షా భేటీ వెనుక ఎలాంటి పొలిటికల్ మోటివ్ ఉన్నప్పటికీ అభిమానులు కోరుకుంటున్నది ఒక్కటే. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటనకి గాను తారక్ ఆస్కార్స్ నామినేషన్స్ కి ఎంపిక అవుతారనే అంచనాలు మొదలయ్యాయి. అలా జరగాలంటే ముందుగా ఇండియా నుంచి ఆస్కార్స్ కి పంపే లిస్ట్ లో ఆర్ఆర్ఆర్, తారక్ ని ఫైనల్ చేయాలి. 

66
RRR Movie

RRR Movie

మోడీ తర్వాత ఇండియాలో అంతటి పవర్ ఫుల్ పర్సన్ అమిత్ షానే తారక్ నటనకి ఫిదా అయ్యాడంటే.. ఇండియా నుంచి ఆస్కార్స్ కి పంపే లిస్ట్ లో యంగ్ టైగర్ పేరు ఖాయం అని అంటున్నారు. ఇది తప్పకుండా జరగాలి అని తారక్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
అమిత్ షా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved