MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • KeedaaCola Review:కీడా కోలా ప్రీమియర్ షో టాక్.. తరుణ్ భాస్కర్ చిత్రం హిట్టా ఫట్టా, కామెడీ ఉంది కానీ..

KeedaaCola Review:కీడా కోలా ప్రీమియర్ షో టాక్.. తరుణ్ భాస్కర్ చిత్రం హిట్టా ఫట్టా, కామెడీ ఉంది కానీ..

ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం 'కీడా కోలా'. ప్రీమియర్ షోల నుంచి కీడా కోలా చిత్రానికి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది చూద్దాం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 03 2023, 06:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం 'కీడా కోలా'. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో సైతం నటించారు. చైతన్య, రాగ్ మయూర్, జీవన్ కుమార్, బ్రహ్మానందం ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. కతరుణ్ భాస్కర్ ఇప్పటి వరకు తెరకెక్కించింది రెండు చిత్రాలే. అయినప్పటికీ తన చిత్రాలు వైవిధ్యంగా ఉండేలా చూసుకున్నారు. దీనితో కీడా కోలా ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి నెలకొంది. రానా దగ్గుబాటి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కడం మరో విశేషం. నేడు గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. 

 

27

ప్రీమియర్ షోల నుంచి కీడా కోలా చిత్రానికి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది చూద్దాం. ఈ చిత్రం నిడివి కేవలం 2 గంటలు. ప్రధాన పాత్రల పరిచయం వైవిధ్యంగా సాగుతుంది. బ్రహ్మానందం తన మనవడు చైతన్య రావు పెళ్లి కోసం చేసే ప్రయత్నాలతో చిత్రంలో కామెడీ మొదలవుతుంది. 

 

37

ఇంతలో కథలోని ప్రధాన పాత్రధారులు డబ్బు సంపాదించడం కోసం క్రైమ్ ఆలోచన చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు టైం తీసుకున్నాడు. కథ యూనిక్ వేలో ముందుకు సాగుతూ ఉంటుంది. వన్ లైన్ కామెడీ పంచ్ లు, కొన్ని సన్నివేశాలు మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఆకట్టుకునేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించే విధంగా ఉంటుంది. 

 

47

అసలైన కథని దర్శకుడు ఇంటర్వెల్ సన్నివేశం ముందే రివీల్ చేశాడు. దీనితో ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచేలా ముగిసింది.ఇక కీడా కోలా చిత్రం సెకండ్ హాఫ్ మరింత ఫన్ మూమెంట్స్ తో ఉంటుంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు వివేక్ సాగర్ బ్యాగ్రౌండ్ సంగీతం క్రేజీగా ఉందనే చెప్పాలి. 

 

57

చాలా సన్నివేశాలని వివేక్ సాగర్ సంగీతం ప్రాణం పోసింది. ముఖ్యంగా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ లో సన్నివేశాలని బ్యాగ్రౌండ్ సంగీతమే ఎలివేట్ చేసింది. అయితే ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వం కంటే అతడి నటనే బావుందని కూడా ఆడియన్స్ పేర్కొంటున్నారు. 

 

67

అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్, షార్ప్ వన్ లైన్ పంచ్ డైలాగ్స్ తో కీడా కోలా చిత్రం టైం పాస్ ఎంటర్టైనర్ గా సాగుతుంది. అయితే ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించే కామెడీ చిత్రం అని చెప్పలేం. 

 

77

ఓవరాల్ గా కీడా కోలా చిత్రం అబౌ యావరేజ్ నుంచి వన్ టైం వాచ్ అన్నట్లుగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో నెమ్మదిగా మొదలైన కథ, పూర్తిస్థాయిలో కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు లేకపోవడం కీడా కోలాలో మైనస్ అని చెప్పాలి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image2
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved