MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్

Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్

Ravi Mohan: నటుడు రవి మోహన్(జయం రవి) ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈసందర్భంగా సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. విడాకులు వచ్చేంత వరకు సినిమాల్లో నటించనని ఆయన స్పష్టం చేశారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : May 16 2026, 10:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రవి మోహన్‌ సంచలన నిర్ణయం
Image Credit : X

రవి మోహన్‌ సంచలన నిర్ణయం

రవి మోహన్(జయం రవి) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. విడాకుల సమస్య ముగిసే వరకు ఏ సినిమాలోనూ నటించనని స్పష్టం చేశారు. తనను వేధించడం, బెదిరించడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే నేరుగా తన ఆఫీస్‌కు రావొచ్చని సూచించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిల్లల్ని కూడా కలవనివ్వడం లేదు
Image Credit : X

పిల్లల్ని కూడా కలవనివ్వడం లేదు

తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు కోర్ట్ లో ఉంది. ఈ క్రమంలో తన పిల్లలను చూసేందుకు కూడా ఆమె అనుమతించడం లేదని రవి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు చదివే స్కూళ్లకు సెక్యూరిటీ సిబ్బందిని పంపుతున్నారని, తన మొబైల్ కనెక్షన్ కూడా కట్ చేశారని ఆయన ఆరోపించారు.

35
కెనీషాతో రవిమోహన్‌ బ్రేకప్‌
Image Credit : Google

కెనీషాతో రవిమోహన్‌ బ్రేకప్‌

సోషల్ మీడియాలో కెనీషాపై దాడులు జరిగాయని, అందుకే ఆమె వెళ్లిపోవాల్సి వచ్చిందని రవి మోహన్ చెప్పారు. 'ఆమె ఎక్కడున్నా ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని తెలిపారు. కెనీషా.. `ఇకపై అతను మీవాడు` అని పోస్ట్ పెట్టిన నేపథ్యంలో వీరిద్దరు విడిపోయినట్టు ప్రచారం జరిగింది.  రవిమోహన్‌ ఆ విషయాన్ని స్పష్టంచేశారు. విడాకులు వచ్చే వరకు తన సినిమాలు విడుదల కావని, గత కొన్నేళ్లుగా ఎదుర్కొన్న అవమానాల వల్ల ఇక నటించలేనని స్పష్టం చేశారు.

45
 నా పిల్లలు లేకుండా బతకలేను
Image Credit : X

నా పిల్లలు లేకుండా బతకలేను

‘నన్ను రెచ్చగొట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే, ప్రయత్నించి చూడండి. ఈ ఇండస్ట్రీలో నేను 23 ఏళ్లు కష్టపడ్డాను’ అని ఆయన గట్టిగా హెచ్చరించారు. తన పెళ్లి బలవంతంగా జరిగిందని, పెళ్లయిన రోజు నుంచి తన జీవితం నరకంగా మారిందని ఆరోపించారు. 'నా పిల్లలు లేకుండా నేను బతకలేను' అని ఆయన ఆవేదన చెందారు.
55
హీరోయిన్‌కి రవి మోహన్‌ వార్నింగ్‌
Image Credit : X

హీరోయిన్‌కి రవి మోహన్‌ వార్నింగ్‌

కొంతమంది పీఆర్ టీమ్‌లను ఉపయోగించి సోషల్ మీడియాలో తనపై దాడి చేస్తున్నారని రవి మోహన్ ఆరోపించారు. 'ఓ మూడక్షరాల ఇడ్లీ నటి ఉంది. ఆమె నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిందని ముగ్గురు నటులు నాతో చెప్పారు. అలాంటిది నా గురించి మాట్లాడుతోంది. నా పర్సనల్ లైఫ్ గురించి ఇంకోసారి మాట్లాడితే బాగోదు. నా గురించి మాట్లాడే అర్హత నీకేముంది?' అని ఆ నటిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ఆమె ఖుష్బూ అంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో దీనిపై రవి మోహన్‌ భార్య ఆర్తి స్పందించారు. `నిద్ర పోతున్న సింహాన్ని లేపొద్దు` అని వెల్లడించింది. ఇది రవిని ఉద్దేశించే అని అంటున్నారు. ఏదేమైనా జయం రవి ఇప్పుడు ఫ్యామిలీ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. తన భార్యా విడాకులు ఇస్తోంది, మరోవైపు తన ప్రియురాలు వెళ్లిపోయింది. దీంతో ఒంటరైపోయాడు రవి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది.. నా అన్వేష్‌పై మాధవీలత బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved