MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Vijay Top 10 Movies: బాక్సాఫీస్‌ను దున్నేసిన దళపతి టాప్ 10 సినిమాలు ఇవే.. కోలీవుడ్‌లోనే నెంబర్‌ 1

Vijay Top 10 Movies: బాక్సాఫీస్‌ను దున్నేసిన దళపతి టాప్ 10 సినిమాలు ఇవే.. కోలీవుడ్‌లోనే నెంబర్‌ 1

Vijay Top 10 Movies: దళపతి విజయ్ నేడు తన 52వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు.  ఆయన సీఎం అయ్యాక వచ్చిన తొలి బర్త్ డే ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా, ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 22 2026, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
విజయ్‌ టాప్‌ 10 సినిమాలు
Image Credit : Asianet News

విజయ్‌ టాప్‌ 10 సినిమాలు

తమిళ సినిమా బాక్సాఫీస్ కింగ్ దళపతి విజయ్. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఇప్పటివరకు 69 సినిమాల్లో నటించారు. వాటిలో ఎన్నో రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా బాక్సాఫీస్ వసూళ్లలో విజయ్‌ను మించిన వారు లేరనే చెప్పాలి. కోలీవుడ్‌లో ఆయనో ప్రత్యేక సామ్రాజ్యాన్ని నడిపారు. ఈ నేపథ్యంలో, ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలేంటో ఈ గ్యాలరీలో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
10. కత్తి
Image Credit : our own

10. కత్తి

విజయ్ - ఏ.ఆర్. మురుగదాస్ కాంబోలో వచ్చిన సినిమా 'కత్తి'. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'తుపాకి' బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ సినిమా వచ్చింది. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లు వసూలు చేసి విజయ్‌ టాప్‌ 10 మూవీస్‌లో  10వ స్థానంలో నిలిచింది. 

311
9.  తెరి
Image Credit : instagram

9. తెరి

విజయ్‌కు ఇష్టమైన దర్శకుల్లో అట్లీ ఒకరు. అట్లీ దర్శకత్వంలో విజయ్ వరుసగా మూడు సినిమాలు చేశారు. అందులో మొదటి సినిమా 'తెరి'. ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 2016లో విడుదలైన ఈ సినిమా రూ.172 కోట్లు వసూలు చేసింది.
411
8. బీస్ట్
Image Credit : instagram

8. బీస్ట్

విజయ్ కెరీర్‌లో భారీ హైప్‌తో వచ్చిన సినిమా 'బీస్ట్'. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదట భారీ అంచనాలున్నాయి. కానీ సినిమా  అంచనాలను అందుకోలేకపోయింది. అయినా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద రూ.215 కోట్లు వసూలు చేసింది.

511
7. మాస్టర్‌
Image Credit : our own

7. మాస్టర్‌

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన సినిమా 'మాస్టర్'. 'మానగరం', 'ఖైదీ' వంటి హిట్‌ల తర్వాత లోకేష్ తీసిన సినిమా ఇది. ఈ చిత్రంతో విజయ్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకు పైగా వసూలు చేసింది.
611
6.సర్కార్‌
Image Credit : our own

6.సర్కార్‌

విజయ్ - ఏ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ 'సర్కార్'. విజయ్ రాజకీయ ప్రవేశానికి ఈ సినిమా పునాది వేసిందని చెప్పొచ్చు. 2018లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద రూ.258 కోట్లు కొల్లగొట్టింది.
711
5. మెర్సల్‌
Image Credit : X/Films and Stuffs

5. మెర్సల్‌

విజయ్ మూడు విభిన్న పాత్రల్లో అదరగొట్టిన సినిమా 'మెర్సల్'. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.267 కోట్లు వసూలు చేసింది.
811
4. వారసుడు
Image Credit : instagram

4. వారసుడు

విజయ్ హీరోగా 2023లో విడుదలైన సినిమా 'వారసుడు' (తమిళంలో వారిసు). తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.306 కోట్లు వసూలు చేసింది.

911
3. బిగిల్‌(విజిల్‌)
Image Credit : our own

3. బిగిల్‌(విజిల్‌)

విజయ్ - అట్లీ కాంబినేషన్‌లో 2019లో దీపావళికి విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం 'బిగిల్'. ఈ సినిమాలో విజయ్, బిగిల్, రాయప్పన్ అనే రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.321 కోట్లు వసూలు చేసింది.

1011
2. ది గోట్‌
Image Credit : facebook

2. ది గోట్‌

విజయ్ నటించిన చిత్రాల్లో ఒకటి 'ది గోట్'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా అదరగొట్టారు. 2024లో విడుదలైన ఈ సినిమా రూ.440 కోట్లు వసూలు చేసింది.
1111
1. లియో
Image Credit : instagram

1. లియో

విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.615 కోట్లు వసూలు చేసింది. త్వరలో విడుదల కానున్న విజయ్ 'జననాయగన్' సినిమా ఈ రికార్డును బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా కోలీవుడ్‌ అత్యధిక కలెక్షన్లు  సాధించిన హీరోగా విజయ్‌ నిలిచారని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image2
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Recommended image3
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
Pawan First Wife: పవన్‌ కళ్యాణ్‌ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుందో తెలుసా? షాకింగ్‌ నిజాలు
Recommended image2
Maa Inti Bangaram 3 Days Collections: బాక్సాఫీసు వద్ద దుమ్ముదులుపుతున్న సమంత.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved