విజయ్ సొంత టీవీ ఛానెల్ ప్లానింగ్, పేరు ఏం పెడుతున్నారంటే?
నటుడు విజయ్ తన రాజకీయ పార్టీ, తమిళగ వెట్రి కళగం, కోసం ఒక టీవీ ఛానెల్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఛానెల్ ద్వారా పార్టీ ప్రచారం మరియు కార్యక్రమాలను ప్రసారం చేయాలని భావిస్తున్నారు. విజయ్ పార్టీ పేరులో మార్పులు చేయనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
Thalapahy Vijay
రాజకీయాల్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ తనేంటో ,తన దూకుడు ఏంటో చూపబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ.. ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్. ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజాసేవకే అంకితం కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే ప్రకటించారు.
పార్టీ ప్రకటన తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్న విజయ్.. ప్రస్తుతం పొలిటికల్‌గా తన సత్తా చూపటానికి సైలెంట్ గా పనులు పూర్తి చేస్తున్నారు. పార్టీ ప్రకటన, బహిరంగ సభ అనంతరం ఇన్నాళ్లు మౌనంగా ఉన్న విజయ్.. ఇప్పుడు స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ ని రెడీ చేయిస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించి తమిళనాడులో పెద్ద నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు.ఈ క్రమంలో తన సినీ జీవితాన్ని సైతం పణంగా పెట్టారు. 2026లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నందున, నటుడు ప్రస్తుతం తన 69వ చిత్రం కోసం పని చేస్తున్నాడు.
అయితే తనకు అండగా సరైన మీడియా సంస్థలు లేవని భావించినట్లున్నారు. మిగతా మీడియా సంస్దల ప్రమోషన్స్ కు ఎలాగో ఖర్చు పెట్టాలి కాబట్టి..అదేదో ఆ డబ్బుతో సొంత టీవి ఛానెల్ పెట్టుకుంటే బెస్ట్ అని భావిస్తున్నారు. అప్పుడు ఎడిటింగ్ లేకుండా తమ పార్టీ ప్రసంగాలు వస్తాయనేది ఆయన నమ్మకం. అయితే ఆ టీవీ ఛానెల్ కు ఏ పేరు పెట్టాలనేది మల్లగుల్లాలు పడుతున్నారట. విజయ్ పేరులో వి తీసుకుని ఛానెల్ వి అని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని వినికిడి.
seeman
ఈ క్రమంలో విజయ్ తన సొంత టీవీ ఛానెల్‌ని ప్రారంభించనున్నారని తమిళనాట వినపడుతోంది. ఇప్పటికే పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో విజయ్ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటులపై కీలక చర్చిస్తున్నారు.
అయితే.. విజయ్ దూకుడు పెంచడంతో ప్రధాన పార్టీల్లో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. తమిళగ వెట్రి కళగం పార్టీ పేరులో స్వల్ప మార్పు చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పేరులో అదనంగా ‘క్’ అనే అక్షరాన్ని చేర్చబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
TVK Leader Vijay
ప్రస్తుతం విజయ్ పార్టీని టీవీకే అని పిలుస్తుండగా అదే పేరుతో తమిళనాడులో ఉన్న కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో.. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం పేరులో ‘క్’ అనే అక్షరాన్ని కలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దానిలో భాగంగా.. తమిళగ వెట్రిక్ కళగం అని పిలవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఏదేమైనా.. పార్టీ పేరులో మార్పులు సంగతి పక్కనబెడితే.. టీవీ ఛానెల్ పెట్టబోతున్నారు విజయ్ దళపతి.. అనే వార్త తమిళనాట రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
TVK Vijay
విజయ్ తన పార్టీ భారీ విజయం సాధించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్దమవుతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీతో పారదర్శకమైన, కుల రహిత, అవినీతి రహిత పరిపాలన అందిస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక తమిళనాడులో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు టీవీ ఛానెల్‌ని నిర్వహిస్తున్నాయి. అందుకే విజయ్ కూడా త్వరలోనే టీవీ ఛానల్ లాంఛ్ పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.