MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jason Sanjay: డైరెక్టర్‌గా ఫ్లాప్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

Jason Sanjay: డైరెక్టర్‌గా ఫ్లాప్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు రూట్ మార్చాడు. త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 09 2026, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jason Sanjay Hero Debut
Image Credit : FaceBook

Jason Sanjay Hero Debut

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నాన్నలాగే సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని సంజయ్ ఆశపడ్డాడు. అందుకే ముందుగా మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా మారాడు. కానీ, అతను తీసిన మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఇప్పుడు రూట్ మార్చాడు. డైరెక్టర్ కుర్చీ వదిలేసి, హీరోగా కెమెరా ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
'సిగ్మా' ఫ్లాప్ తర్వాత కొత్త అవతారంలో జేసన్!
Image Credit : Asianet News

'సిగ్మా' ఫ్లాప్ తర్వాత కొత్త అవతారంలో జేసన్!

జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమైన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మొదటి సినిమా రిజల్ట్ తేడా కొట్టినా, జేసన్ సంజయ్ సినిమాలకు దూరం కాలేదు. ఈసారి తన అదృష్టాన్ని నటనలో పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ కొత్త ప్రాజెక్టును కూడా లైకా సంస్థే నిర్మించబోతోందని సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

35
మొదటి సినిమాకే రూ.35 కోట్ల బడ్జెట్?
Image Credit : Asianet News

మొదటి సినిమాకే రూ.35 కోట్ల బడ్జెట్?

జేసన్ సంజయ్ హీరోగా చేయబోయే కొత్త సినిమా గురించి ఇప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా కోసం ఏకంగా 35 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట. అంతేకాదు, మొదటిసారి హీరోగా నటిస్తున్న జేసన్‌కు 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అయితే, ఈ బడ్జెట్, రెమ్యునరేషన్ గురించి నిర్మాణ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మాత్రమే.

ఈ కొత్త సినిమా కోసం సరైన డైరెక్టర్‌ను వెతికే పనిలో పడింది చిత్రయూనిట్. ప్రముఖ దర్శకుడు లింగుసామితో పాటు పలువురు డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నారని కోలీవుడ్ టాక్. 'సిగ్మా' సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంజీవ్ పేరు కూడా డైరెక్టర్ల లిస్టులో వినిపిస్తోంది.

45
నాన్న ఇమేజ్ నుంచి బయటపడటం పెద్ద సవాలే!
Image Credit : Instagram

నాన్న ఇమేజ్ నుంచి బయటపడటం పెద్ద సవాలే!

జేసన్ సంజయ్‌కు సినిమా ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. ఎందుకంటే, అతని తండ్రి దళపతి విజయ్ సౌత్ ఇండియాలోనే టాప్ స్టార్. విజయ్ సినిమాలకు తమిళనాడులోనే కాదు, ఇండియా వైడ్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్న జేసన్‌పై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి.

కానీ, జేసన్ కేవలం తన తండ్రి ఇమేజ్‌పైనే ఆధారపడకుండా, సొంత టాలెంట్‌తో పైకి రావాలని అనుకుంటున్నాడట. డైరెక్టర్‌గా మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయినా, నటుడిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇప్పుడు అతని ముందుంది.

అయితే, హీరోగా మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు, అభిమానులు కచ్చితంగా విజయ్ యాక్టింగ్‌తో జేసన్‌ను పోల్చి చూస్తారు. నాన్నకున్న క్రేజ్ మధ్యలో, తనకంటూ ఒక సెపరేట్ యాక్టింగ్ స్టైల్ క్రియేట్ చేసుకోవడం అతనికి నిజంగా పెద్ద సవాలే.

55
అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు వెయిటింగ్!
Image Credit : X

అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు వెయిటింగ్!

జేసన్ సంజయ్ కొత్త సినిమా కథ ఎలా ఉండబోతోంది? అతనికి జోడీగా ఎవరు నటిస్తారు? డైరెక్టర్‌గా ఎవరిని ఫిక్స్ చేస్తారు? ఇలాంటి చాలా ప్రశ్నలకు ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని అంతా ఆశిస్తున్నారు.

మొత్తానికి, డైరెక్టర్‌గా తొలి అడుగులోనే తడబడిన జేసన్ సంజయ్, ఇప్పుడు హీరోగా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. దళపతి విజయ్ కొడుకు అనే ముద్రను చెరిపేసి, తన సొంత టాలెంట్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Smita: వెంకటేష్ సినిమాలో నటించి తప్పు చేశా..బలవంతంగా ఆ పాత్ర చేయించారు, సింగర్ కామెంట్స్
Recommended image2
Hanuman Ansh Telugu Review: హనుమాన్‌ అంశ్‌ మూవీ రివ్యూ.. నీమ్‌ కరోలి బాబా జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image3
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, రాజకీయం చేసి తప్పించారు..నిర్మాత కొడుకు కామెంట్స్
Recommended image2
Singer Smita: వెంకటేష్ సినిమాలో నటించి తప్పు చేశా..బలవంతంగా ఆ పాత్ర చేయించారు, సింగర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved