MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్టరీలో క్రేజీ హీరోయిన్, దాదాపు స్టార్ హీరోలందరితో ఆడి పాడిన సీనియర్ బ్యూటీ, 12 మందితో ఎఫైర్ రూమర్స్, ఒకరితో పెళ్లి, విడాకులు, చివరకు 55 ఏళ్ల వయసులో ఒంటరిగా జీవిస్తోన్ననటి ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 06 2026, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫిల్మ్ ఇండస్ట్రీ రంగులు ప్రపంచం..
Image Credit : Manisha Koirala

ఫిల్మ్ ఇండస్ట్రీ రంగులు ప్రపంచం..

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే హంగులు.. ఆర్భాటాలు, లగ్జరీ లైఫ్ మాత్రమే కనిపిస్తుంటుంది. కానీ తెర వెనుక చాలామంది జీవితం దుర్భరంగా ఉంటుంది. కొంత మంది ఆస్తులు పోగోట్టుకుంటే.. మరికొంత మంది ఆరోగ్యాన్ని కోల్పోతుంటారు. మరికోంత మంది ఎవరిచేతిలోనో మోసపోయి జీవితం నాశనం చేసుకుంటుంటారు. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన బ్యూటీతో ఒక ఊపు ఊపేసిన ఓ హీరోయిన్ 55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం గడుపుతోంది. కోట్లు సంపాదించిన ఆమె క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు మనీషా కొయిరాలా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
33 ఏళ్ల సినిమా జీవితంలో..
Image Credit : our own

33 ఏళ్ల సినిమా జీవితంలో..

1970లో నేపాల్‌లో జన్మించిన మనీషా కోయిరాలా, 1991లో తన నటజీవితాన్ని బాలీవుడ్‌లో సౌదాగర్ సినిమా ద్వారా స్టార్ట్ చేసింది. దాదాపు 33 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఎన్నోబ్లాక్ బస్టర్ మూవీస్ చేసింది మనీషా. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్.. చిన్నగా సౌత్ లోకి కూడా ఎంటర్ అయ్యింది. తెలుగు తమిళ సినిమాల్లో నటించి, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఒక ఊపు ఊపేసింది.

35
12 మంది స్టార్స్ తో ఎఫైర్ నిజమెంత?
Image Credit : our own

12 మంది స్టార్స్ తో ఎఫైర్ నిజమెంత?

ఎందరో స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన మనీషా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 మందితో ప్రేమాయణం నడిపించిందని టాక్. మనీషా కోయిరాలా లవ్ అఫైర్స్ ఆమె కెరీర్ లో స్టార్ డమ్ కంటే కూడా ఎక్కువగా పాపులర్ అయ్యేలా చేశాయి. వివేక్ ముశ్రన్‌తో మనీషా కోయిరాల మొదటి ప్రేమ మొదలైంది, ఆ తరువాత నానా పటేకర్‌, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, రాజీవ్ మూల్‌చందానీ, సంగీత దర్శకుడు సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్‌లు లాంటి స్టార్స్ తో ఆమె డేటింగ్ చేసినట్టు సమాచారం. ఆ రూమర్స్ మధ్యే ఆమె పెళ్లి చేసుకున్నా.. ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు.

45
పెళ్లైన రెండేళ్లకే విడాకులు..
Image Credit : our own

పెళ్లైన రెండేళ్లకే విడాకులు..

2010 లో మనీషా కొయిరాలా నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను పెళ్ళి చేసుకుంది. కాని వారి వివాహజీవితం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్ళైన రెండేళ్ళకే.. 2012 లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఒంటరి జీవితాన్నే గడుపుతోంది.

55
క్యాన్సర్‌ ను జయించిన మనీషా కోయిరాలా..
Image Credit : our own

క్యాన్సర్‌ ను జయించిన మనీషా కోయిరాలా..

2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది మనీషా. భయంకరమైన వ్యాధి ఇబ్బందిపెడుతున్నా.. ఎంతో ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. కొన్నేళ్ల క్రితం ఆ వ్యాధి నుంచి కోలుకుంది స్టార్ బ్యూటీ. అంతే కాదు అప్పటి నుంచి క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ.. బాధితులకు అండగా నిలబడింది. జనవరి 8, 2018న ముంబైలో ఆమె తన ఆత్మకథ – హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్‌ను ఆవిష్కరించింది. ఆమె తన పుస్తకంలో ఎలా క్యాన్సర్‌ ను జయించింది అన్న విషయాలను వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Srishti: బిగ్ బాస్ నుంచి సృష్టి ఎలిమినేట్.. హౌస్ లో ముసుగు వేసుకున్నది ఆ ఇద్దరే, అంటించి వెళ్లడం అలవాటు
Recommended image2
Drishyam 3: దూసుకుపోతున్న దృశ్యం 3, భర్త కష్టానికి ప్రతిఫలం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి
Recommended image3
Sardar 2 OTT: థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్, ఓటీటీలో మాత్రం ర్యాంపేజ్.. నెంబర్ 1 ప్లేస్ లో కార్తీ సినిమా
Related Stories
Recommended image1
సాయి పల్లవి కి బిగ్ షాక్, మరి ఇంత దారుణంగానా ? రామాయణ పై ప్రభావం పడుతుందా?
Recommended image2
Thalapathy Vijay: వెనకే ఉన్న కుర్రాడు ఇంత పని చేస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు.. విజయ్ సక్సెస్ పై ఆర్జీవీ పోస్ట్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved