MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajamouli: ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టి, మరి రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? జక్కన్నసేఫ్ గేమ్

Rajamouli: ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టి, మరి రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? జక్కన్నసేఫ్ గేమ్

చిన్న కథను కూడా వెండితెరపై అద్భుతంగా చూపించే దర్శకుడు రాజమౌళి. తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పి, హీరో విషయంలో మాత్రం జక్కన్న ఎందుకు సేఫ్ గేమ్ ఆడారు? గతంలో రాజమౌళి ఇంటర్వ్యూ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 30 2026, 08:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చరిత్రను తిరగరాసిన డైరెక్టర్ ..
Image Credit : Asianet News

చరిత్రను తిరగరాసిన డైరెక్టర్ ..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రను 'బాహుబలి'కి ముందు, 'బాహుబలి' తర్వాత అని రెండు భాగాలుగా చూడొచ్చు. మన సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఒక్క వ్యక్తికి దక్కుతుంది. ఆయనే అందరికి గర్వకారణం, అపజయం ఎరుగని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. అందరు ముద్దుగా పిలుచుకునే జక్కన్న. సినిమా రంగంలో ఒక్క ఫ్లాప్ కూడా ఎరుగని దర్శకధీరుడు ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?
Image Credit : Asianet News

ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?

అయితే, ఈ సమయంలో రాజమౌళి కి సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో తన పర్సనల్ ఫేవరెట్స్ గురించి జక్కన్న చెప్పిన మాటలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా ఏ డైరెక్టర్‌ను అయినా 'మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?' అని అడిగితే, సమాధానం చెప్పడానికి చాలా ఆలోచిస్తారు. కానీ రాజమౌళి మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, మొహమాటం లేకుండా ఒక పేరు చెప్పేశారు. ఆ పేరు మరెవరిదో కాదు, మన టాలీవుడ్ జేజమ్మ, స్వీటీ అనుష్క శెట్టి.

35
రాజమౌళి మాట్లాడుతూ..
Image Credit : others

రాజమౌళి మాట్లాడుతూ..

"హీరోయిన్ల విషయానికొస్తే నాకు అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం. కేవలం అందం వల్లే కాదు, పని పట్ల అనుష్కకు ఉండే శ్రద్ధ, నిజాయితీ, ప్రొఫెషనలిజం నాకు బాగా నచ్చుతాయి'' అని రాజమౌళి అన్నారు. అందుకే 'విక్రమార్కుడు' సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్, 'బాహుబలి'లో దేవసేన పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అనుష్క మాత్రమే కాదు.. 'మగధీర'లో కాజల్, 'మర్యాద రామన్న'లో సలోని నటనను కూడా జక్కన్న మెచ్చుకున్నారు.

45
హీరో విషయంలో కిలాడి రాజమౌళి
Image Credit : instagram

హీరో విషయంలో కిలాడి రాజమౌళి

రాజమౌళి ఇంటర్వ్యూలో అసలు మజా ఇక్కడే ఉంది.. యాంకర్ నెమ్మదిగా "సరే సార్, హీరోయిన్ ఓకే. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు?" అని అడగగానే, రాజమౌళి ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. సరదాగా నవ్వుతూ ఆయన ఇచ్చిన సమాధానం విని యాంకర్ కూడా షాక్ అయ్యారు! "నా ఫేవరెట్ హీరో ఎవరో పబ్లిక్‌గా చెప్పేంత అమాయకుడిని కాదు నేను!" అని నవ్వుతూ జక్కన్న మాట దాటేశారు. ఒక హీరో పేరు చెబితే మిగతా స్టార్ హీరోల అభిమానులు ఊరుకుంటారా? లేదా భవిష్యత్తులో సినిమాలకు డేట్స్ దొరకడం కష్టమవుతుందా? అని ఆలోచించారో ఏమో, రాజమౌళి చాలా తెలివిగా ఈ ప్రశ్న నుంచి తప్పించుకున్నారు.

55
వారణాసి బిజీలో రాజమౌళి..
Image Credit : Instagram

వారణాసి బిజీలో రాజమౌళి..

"నేను అందరు హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను, అందరూ నాకు ఇష్టమే" అంటూ డిప్లొమాటిక్‌గా సమాధానమిచ్చి తన స్మార్ట్‌నెస్ చూపించారు. ప్రస్తుతం జక్కన్న, మహేష్ బాబుతో వారణాసి అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నారు. ఈసినిమా చేస్తున్నాడు. ఈమూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు జక్కన్న. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మళయాల స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. 

రాజమౌళి సినిమా అంటేనే అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద, హీరోయిన్ల విషయంలో 'దేవసేన'కు జై కొట్టిన రాజమౌళి, హీరోల విషయంలో మాత్రం 'సేఫ్ గేమ్' ఆడి.. తానొక గొప్ప డైరెక్టరే కాదు, చాలా తెలివైన వ్యక్తి అని కూడా నిరూపించుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
అనుష్క శెట్టి
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Recommended image2
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Recommended image3
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా
Related Stories
Recommended image1
IMDb Top Indian Stars: సీఎం విజయ్, ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన కుర్రాడు, IMDb రేటింగ్ లో నెం.1 ఎవరో తెలుసా?
Recommended image2
Jr NTR: బాలకృష్ణ, ఎన్టీఆర్ లతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved