MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Thalapathy Vijay Net Worth: దళపతి విజయ్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు.. టీవీకే చీఫ్ లెక్కలు ఇవే!

Thalapathy Vijay Net Worth: దళపతి విజయ్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు.. టీవీకే చీఫ్ లెక్కలు ఇవే!

Thalapathy Vijay Net Worth: తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించారు టీవీకే అధినేత విజయ్ దళపతి. వందల కోట్ల రూపాయల నెట్ వర్త్, లగ్జరీ కార్లు, విల్లాలు ఆయన సొంతం. విజయ్ మొత్తం సంపాదన ఎంతో తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 04 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దళపతి విజయ్ : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తగ్గని రేంజ్.. టీవీకే అధినేత ఆస్తుల లెక్కలు ఇవే!
Image Credit : Gemini

దళపతి విజయ్ : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తగ్గని రేంజ్.. టీవీకే అధినేత ఆస్తుల లెక్కలు ఇవే!

తమిళ సినీ పరిశ్రమలో దళపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ సంచలన ఫలితాలు సాధించింది. 100కు పైగా స్థానాల్లో తనదైన మార్కు చూపిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారు విజయ్.

సూపర్‌స్టార్ నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగిన విజయ్ ఆస్తుల విలువ ఎంత? ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది మార్చిలో ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం దళపతి ఆస్తుల వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
624 కోట్ల ఆస్తులు.. నో అప్పులు
Image Credit : ANI

624 కోట్ల ఆస్తులు.. నో అప్పులు

విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం, ఆయన మొత్తం నికర ఆస్తి విలువ సుమారు 624 కోట్ల రూపాయలు. ఇందులో చరాస్తులు 404 కోట్ల రూపాయలు కాగా, స్థిరాస్తులు 220 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. తాను పైసా అప్పు కూడా లేనని అందులో ప్రకటించారు. ఆయన ఎటువంటి బ్యాంక్ లోన్లు గానీ, ఇతర ఆర్థిక బకాయిలు గానీ లేవని స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ విజయ్ ఆదాయం ఏకంగా 184.53 కోట్ల రూపాయలుగా నమోదైంది.

Related Articles

Related image1
Goa Trip: గోవాలో తప్పక చూడాల్సిన బీచ్ ఇది.. కలంగుట్ బీచ్ ఎందుకు అంత స్పెషల్ !
Related image2
Credit Card : బెస్ట్ క్రెడిట్ కార్డ్ కావాలా? తీసుకునే ముందు ఈ 5 విషయాలు చూడాల్సిందే!
36
బ్యాంకులోనే 200 కోట్లు.. వంద కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
Image Credit : Gemini AI

బ్యాంకులోనే 200 కోట్లు.. వంద కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు

చాలామంది స్టార్ హీరోలు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే, విజయ్ మాత్రం సేఫ్ గేమ్‌ను ఎంచుకున్నారు. ఆయనకు షేర్ మార్కెట్‌లో కేవలం 20 లక్షల లోపే పెట్టుబడులు ఉన్నాయి. కానీ, బ్యాంకు నిల్వలు చూస్తే కళ్లు చెదరాల్సిందే. ఒక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాలోనే ఆయనకు 213 కోట్ల రూపాయల నగదు ఉంది. ఇది కాకుండా యాక్సిస్ బ్యాంక్ (40 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (20 కోట్లు), ఎస్‌బీఐ (15 కోట్లు) వంటి బ్యాంకుల్లో సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన వద్ద 2 లక్షల రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

46
టాం క్రూజ్ ఇల్లు లాగే సముద్ర తీరంలో లగ్జరీ విల్లా
Image Credit : PTI

టాం క్రూజ్ ఇల్లు లాగే సముద్ర తీరంలో లగ్జరీ విల్లా

విజయ్ స్థిరాస్తుల విషయానికి వస్తే, చెన్నైలోని నీలాంకరైలో ఆయనకు ఒక అద్భుతమైన బీచ్ ఫేసింగ్ బంగళా ఉంది. దీని విలువ దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. హాలీవుడ్ స్టార్ టాం క్రూజ్ బీచ్ హౌస్ డిజైన్‌తో ఇన్‌స్పైర్ అయి ఈ ఇంటిని నిర్మించుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. నీలాంకరైతో పాటు సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మూర్ వంటి ప్రాంతాల్లో విజయ్‌కు కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్‌లు ఉన్నాయి. అలాగే కొడైకెనాల్‌లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి.

56
గ్యారేజీ నిండా కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు
Image Credit : X/ TVKPartyHQ

గ్యారేజీ నిండా కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు

విజయ్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో ఉన్న ఒక్కో కారు విలువ కోట్లలో ఉంటుంది. అఫిడవిట్ ప్రకారం ఆయన వద్ద ఉన్న కార్ల లిస్ట్ ఇదే..

• టొయోటా లెక్సస్ 350: రూ. 3.01 కోట్లు

• బీఎండబ్ల్యూ i7: రూ. 2 కోట్లు

• టొయోటా వెల్‌ఫైర్: రూ. 1.63 కోట్లు

• బీఎండబ్ల్యూ 530: రూ. 80.54 లక్షలు

ఇవే కాకుండా రోల్స్ రాయిస్ ఘోస్ట్, ఫోర్డ్ మస్టాంగ్ వంటి కార్లు కూడా ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా ఆయన వద్ద ఒక మారుతీ స్విఫ్ట్ కారు, టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్ బైక్ కూడా ఉండటం విశేషం.

66
విజయ్ వ్యక్తిగత జీవితం ఇదే
Image Credit : Chat gpt

విజయ్ వ్యక్తిగత జీవితం ఇదే

విజయ్ భార్య సంగీత ఆస్తి విలువ సుమారు 15.76 కోట్ల రూపాయలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. విజయ్‌కు సుమారు 883 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి, వీటి విలువ 1.20 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. సినిమాల ద్వారా వచ్చే పారితోషికం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ప్రాపర్టీల ద్వారా వచ్చే అద్దెలు విజయ్‌కు ప్రధాన ఆదాయ వనరులు. విజయ్ తన సంపాదనలో కొంత భాగాన్ని కుటుంబ సభ్యులకు రుణాల రూపంలో కూడా ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాల్లో కింగ్ గా మారుతున్న విజయ్ దళపతి, తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కూడా అంతే పక్కాగా నిర్మించుకున్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Goa Trip: గోవాలో తప్పక చూడాల్సిన బీచ్ ఇది.. కలంగుట్ బీచ్ ఎందుకు అంత స్పెషల్ !
Recommended image2
Credit Card : బెస్ట్ క్రెడిట్ కార్డ్ కావాలా? తీసుకునే ముందు ఈ 5 విషయాలు చూడాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved