- Home
- Entertainment
- Beast story Leak: విజయ్ 'బీస్ట్' స్టోరీ లీక్.. కథ మొత్తం అదేనా, కాపీ అంటూ ట్రోలింగ్ షురూ
Beast story Leak: విజయ్ 'బీస్ట్' స్టోరీ లీక్.. కథ మొత్తం అదేనా, కాపీ అంటూ ట్రోలింగ్ షురూ
ఇలయ తలపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ట్రైలర్ యాక్షన్స్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.

beast
ఇలయ తలపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ట్రైలర్ యాక్షన్స్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. విజయ్ ఎప్పటిలాగే పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. విజయ్ పవర్ ఫుల్ గా కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే.
beast
ఇక బీస్ట్ కథ ఏంటి అంటూ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. ట్రైలర్ ని బట్టి కొంత కథ అర్థం అయింది. ఈ చిత్రం ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న ప్రజల్ని రక్షించే మిషన్ గా సాగుతోంది. విజయ్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ఆర్మీ కమాండర్ గా నటిస్తున్నాడు.
beast
తాజాగా ఈ చిత్ర కథ మొత్తం లీక్ అయి ఆన్లైన్ లో చెక్కర్లు కొడుతోంది. లీకైన వివరాల ప్రకారం.. ' జనసంచారం ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్ లోకి ఉగ్రవాదులు చొరబడతారు. అక్కడ కొంత విధ్వంసం సృష్టించి ప్రజల్ని బందీలుగా అదుపులోకి తీసుకుంటారు. వందలాది మంది ప్రజలు ఉగ్రవాదుల చెరలో చిక్కుకుంటారు.
beast
ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల హెడ్ భారత ప్రభుత్వానికి తన డిమాండ్ చెబుతాడు. ఇండియన్ ఆర్మీ అరెస్ట్ చేసిన తమ సహచరుడిని వెంటనే రిలీజ్ చేయాలని లేకుంటే తమ వద్ద ఉన్న ప్రజల్ని చెంపేస్తామని చెబుతారు. దీనితో భారత ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు జరుపుతూ టెర్రరిస్ట్ ని విడుదల చేసేందుకు అంగీకరిస్తుంది. ఇంతలో ఆర్మీ సీక్రెట్ మిషన్ ప్రారంభిస్తుంది.
beast
ఉగ్రవాదుల వద్ద బందీగా ఉన్న వారిలో మాజీ ఇండియన్ రా ఏజెంట్ కూడా ఉంటారు. దీనితో విజయ్ అండ్ టీం ప్రజలని రక్షించేందుకు అతడి సహకారం తీసుకుంటుంది. తమ ప్లాన్ ని పక్కాగా అమలు చేసిన విజయ్ అండ్ టీం టెర్రరిస్ట్ ని రిలీజ్ చేసే సమయానికి ఉగ్రవాదులని మట్టుబెట్టి ప్రజలని కాపాడతారు.
beast
కథ చూడడానికి చాలా సింపుల్ గానే అనిపిస్తోంది. అలాగే ఈ కథతో నెటిజన్లు చాలా పోలికలు కూడా పెడుతున్నారు. మనీ హీస్ట్ వెబ్ సిరీస్ దాదాపుగా ఇలానే ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు. అలాగే టెర్రరిజం బ్యాక్డ్రాప్ లో వచ్చిన చాలా చిత్రాలు దాదాపు ఇదే కాన్సెప్ట్ తో ఉంటాయి. ఉగ్రవాదులు ఏదో ఒక హైజాక్ చేయడం.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం దాదాపుగా ఇలానే ఉంటాయి.
beast
నాగార్జున నటించిన 'గగనం' చిత్రం స్టోరీ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఆ చిత్రంలో హైజాక్ ఐన ఫ్లైట్ లో రిటైర్డ్ ఆర్మీ అధికారి కూడా ఉంటారు. ఆయన నాగార్జున టీంకి సాయం చేయడం చూశాం. ఏది ఏమైనా బీస్ట్ చిత్రాన్ని తక్కువగా అంచనా వేయలేం . ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. కథలో అద్భుతమైన ట్విస్ట్ లు ఉంటాయని.. దిలీప్ టేకింగ్ డిఫెరెంట్ గా ఉంటుందని అంటున్నారు. కానీ నెటిజన్లు మాత్రం కాపీ స్టోరీ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.