రాత్రి సెక్యూరిటీ జాబ్.. తెల్లారి ఫోటోలు పట్టుకుని తిరిగిన.. గతం తలుచుకుంటూ తాగుబోతు రమేష్ కన్నీళ్లు
కమెడియన్ తాగుబోతు రమేష్.. తాగుబోతు పాత్రలతో పాపులర్ అయ్యాడు. కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల సీరియస్ రోల్స్ తోనూ ఆకట్టుకున్నాడు రమేష్.
photo credit Sridevi drama company show
తాగుబోతు రమేష్(Thagubothu Ramesh).. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలు ఆయన్ని పాపులర్ చేశాయి. అదే తన ఇంటిపేరుగా మారిపోయింది. `జగడం` చిత్రంతో టాలీవుడ్‌లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన రామిల్ల రమేష్(అసలు పేరు).. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా రాణిస్తున్నారు. మధ్యలో ఒకటి రెండు సార్లు కెరీర్ కాస్త డౌన్ అయినా, స్ట్రగుల్ అవుతూనే మళ్లీ పుంజుకున్నాడు.
photo credit Sridevi drama company show
ఈ క్రమంలో అందివచ్చిన టీవీ కామెడీ షో `జబర్దస్త్`ని వాడుకున్నాడు. అక్కడ తన కామెడీతో నవ్వులు పూయించాడు. ఇప్పుడు ఓ వైపు జబర్దస్త్ షోని, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నాడు. అయితే వెండితెరపై కమెడియన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సీరియస్ రోల్స్ కూడా చేసి మెప్పిస్తున్నారు. కాలానికి అనుగునంగా మారుతూ రాణిస్తున్నారు తాగుబోతు రమేష్.
photo credit Sridevi drama company show
ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆయన గతంలోకి వెళ్లాడు. తాను ఎలాంటి పరిస్థితుల నుంచి హైదరాబాద్‌కి వచ్చాడు, ఎలా సినిమాల్లోకి వచ్చాడనేది తెలిపాడు రమేష్. ఈ క్రమంలో తన కష్టాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆటో డ్రైవర్‌గా అట్నుంచి యాక్టర్‌గా మారిన వైనాన్ని, ఈ క్రమంలో తాను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ని వెల్లడించారు రమేష్. కన్నీళ్లు కారుతుండగా, ఆ రోజులను గుర్తు చేసుకుంటూ అందరి హృదయాలను బరువెక్కించాడు.
photo credit Sridevi drama company show
తాజాగా తాగుబోతు రమేష్.. `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో పాల్గొన్నారు. ఇందులో గతం గుర్తు చేసుకుంటూ, ప్రొక్లెయినర్ నడిపినా, లారీలు నడిపినా, జీపులు నడిపిన.. హైదరాబాద్‌కి వచ్చిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ చేసిన తర్వాత సినిమా ఫీల్డ్ అంత ఈజీ కాదు, ఇట్లయితే కష్టమని, రాత్రి సమయంలో సెక్యూరిటీ జాబ్ చేసినా, పగలు ఫోటోలు పట్టుకుని తిరిగిన(సినిమా ఆఫీసుల చుట్టూ). ఈ క్రమంలో తనకు `జగడం` సినిమా అవకాశం వచ్చిందని తెలిపారు తాగుబోతు రమేష్.
photo credit Sridevi drama company show
తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉండటానికి వెనకాల తాను పడ్డ బాధలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. రమేష్ తన బాధని వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని కదిలించింది. ఆయనే కాదు కావ్య, నిఖిల్ వంటి వారు తమ కష్టాలను చెప్పుకున్నారు. హృదయాలను కదిలించారు. ఇక తాగుబోతు రమేష్.. `మీటర్`, `రామన్న యూత్`, `నా నేను` చిత్రాల్లో నటించారు. గతంతో పోల్చితే సినిమా ఆఫర్లు కొంత తగ్గాయనేది నిజం.