- Home
- Entertainment
- కొడుకు చంద్రహాస్ పై బీభత్సమైన ట్రోల్స్.. ‘ఇట్స్ గుడ్’ అంటూ తండ్రి ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్.!
కొడుకు చంద్రహాస్ పై బీభత్సమైన ట్రోల్స్.. ‘ఇట్స్ గుడ్’ అంటూ తండ్రి ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్.!
నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ (Chandra Haas)పై బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రభాకర్ రియాక్షన్ వైరల్ గా మారింది.

టాలీవుడ్ కు యంగ్ హీరోగా పరిచయం కాబోతున్న నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై బీభత్సమైన ట్రోలింగ్ కొనసాగుతోంది. చంద్రహాస్ (Chandra Haas) బర్త్ డే సందర్భంగా ఆయన తొలిచిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ప్రభాకర్, ఆయన భార్య సహా పలువురు సినీ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే ఆ ఈవెంట్ లో చంద్రహాస్ ప్రవర్తన కొందరికి కాస్తా అతిగా అనిపించింది. తాను నిల్చున్న తీరు, వేదికపై క్రమశిక్షణగా మెదలకపోవడం, తండ్రి మాటలకు చంద్రహాస్ ఇచ్చిన రియాక్షన్స్ అన్నీ ట్రోలర్స్ కు మంచి స్టఫ్ గా మారాయి. బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ బీభత్సంగా ట్రోల్స్ చేస్తున్నారు.
దీనిపై తాజాగా తండ్రి ప్రభాకర్ రియాక్షన్ షాకింగ్ గా ఉంది. ‘ఇట్స్ గుడ్’ అంటూ స్పందించడం వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రహాస్ పై ఇష్టమొచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ.. వీడు హీరో ఎంటీ? వీడి స్టైల్ ఎంటీ? జేబులో చేతులు పెట్టాడేంటీ? అంటూ ఇష్టమొచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా ‘ఇట్స్ గుడ్’.. వాడు జనాల్లోకి వెళ్తున్నాడు’ అన్నారు.
అదేవిధంగా.. ‘వాడు నిల్చున్న తీరు, స్టైల్ జనాలకు నచ్చలేదు కాబట్టి.. నచ్చలేదని చెప్పారు. తప్పులేదు. తర్వాత చంద్రహాస్ నటన చూసి నచ్చితే మెచ్చుకుంటారు. ప్రేక్షకుల రివ్యూ ఎప్పుడూ ప్రోత్సాహకంగా ఉంటుంది. ఆడియెన్స్ ప్లేయిన్ గా ఉంటారు. వారికి అనిపించిందే చెబుతుంటార’ని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభాకర్ వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇక మరికొందరు మాత్రం చంద్రహాస్ కు మంచి ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ కు చంద్రహాస్ వేసిన స్టెప్పులకు అభినందిస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో వెలగాలంటే కాస్తా క్రమశిక్షణగా ఉండాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇంకా ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు.
చంద్రహాస్ ఇటీవలనే డిగ్రీ పూర్తి చేశాడు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యం. ఈ మేరకు తన పెర్ఫామెన్స్ ను చూపించేందుకు రూ.10 లక్షలతో కవర్ సాంగ్ కూడా చేశాడు. ఇటీవల ఆయన బర్త్ డే సందర్భంగా తొలి సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రెండు చిత్రాలు కూడా కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది.