MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘ఖుషి’ వచ్చింది... సెప్టెంబర్ లో విడుదల కానున్న పది సినిమాలివే.. ఈ డేట్స్ గుర్తుంచుకోండి.. రచ్చరచ్చే

‘ఖుషి’ వచ్చింది... సెప్టెంబర్ లో విడుదల కానున్న పది సినిమాలివే.. ఈ డేట్స్ గుర్తుంచుకోండి.. రచ్చరచ్చే

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఈ చిత్రంతోపాటు సెప్టెంబర్ లో ఇంకా పది సినిమాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా భారీ సినిమాలు విడుదల కాబోతుండటంతో సినీ ప్రియులకు పండగనే చెప్పాలి. 

3 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 01 2023, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  - స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. బ్యూటీఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా ఈ రోజు (సెప్టెంబర్ 1) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న మరో పది సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది.
 

28

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం  Miss Shetty Mr Polishetty. రెండేళ్ల గ్యా ప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty)తో కలిసి వెండితెరపై సందడి చేయబోతున్నారు. ‘బాహుబలి’ వంటి  భారీ చిత్రం తర్వాత అనుష్క ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. కొంచెం గ్యాప్ తర్వాత నవీన్ కు జోడీగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో రాబోతోంది. చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు  దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా సాగుతున్నాయి. 

38

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothieni) -  యంగ్ సెన్సేషన్ శ్రీలీలా జంటగా వస్తున్న చిత్రం ‘స్కంద’ (Skanda). మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ (Boyapati Srinivas)   దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. సెప్టెంబర్ 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. 
 

48

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)   కాంబోలో వస్తున్న మెస్ట్ అవైటెడ్ ఫిల్మ్ Salaar Cease Fire.  హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. శృతి హాసన్ హీరోయిన్. వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే, సెప్టెంబర్ 28న సలార్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ ఈ చిత్రం వాయిదా పడే అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ రిలీజ్ డేట్ లో మార్పులు లేకుండా ఫ్యాన్స్ తో మూవీ లవర్స్, ముఖ్యంగా యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి పండగనే చెప్పాలి. 

58

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) చివరిగా ‘పఠాన్’తో దుమ్ములేపిన విషయం తెలిసిందే. భారీ సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో Jawanతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న గ్రాండ్ గా విడుదల చేయబోతన్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించారు. ఈ  యాక్షన్ ఫిల్మ్ నుంచి నిన్న వచ్చిన పవర్ ఫుల్ ట్రైలర్ 102 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. దీంతో ఈ సినిమాపై ఎంతటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుందో చూడాలి.  ఈ యాక్షన్ డ్రామాను రెడ్ చిల్లీస్ బ్యానర్ పై రూ.300 కోట్లతో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. 
 

68

రజినీకాంత్ ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న Chandramukhi 2 కూడా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పి.వాసు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రాఘవా లారెన్స్, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కలిసి నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సెప్టెంబర్ 19న  రిలీజ్ కాబోతుంది. చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. 

78

ఇక తమిళంలో మూడు సినిమాలు విడుదల కానున్నాయి. హరీశ్ ఉత్తమన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘నూడిల్స్’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న విడుదల చేయబోతున్నారు. అలాగే బాహుబలి ఫేమ్ కట్టప్ప, సినియర్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం ‘అంగరాగన్’ను కూడా అదే రోజు విడుదల చేయబోతున్నారు. మిస్టర్, హారర్ జోనర్ లో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది.

88

సెప్టెంబర్ 15న తమిళ స్టార్ విశాల్ నటించిన కోలీవుడ్ ఫిల్మ్ ‘మార్క్ ఆంటోనీ’ కూడా రాబోతోంది. ఈ టైమ్ ట్రావెల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఎప్జే సూర్య కీలక పాత్రలో నటించారు. ఇక ‘ది కాశ్మీర్ ఫైల్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అగ్నిహోత్రీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ది వ్యాక్సిన్ వార్’ కూడా ఈ నెలలోనే రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahul Sipligunj: పెళ్లి తర్వాత రాహుల్ సిప్లిగంజ్ జోరు.. అటు పాటలు, ఇటు సినిమాలు.. విలన్ గా ఎంట్రీ
Recommended image2
తన పర్సనల్ లైఫ్ గురించి పెద్ద అబద్ధం చెప్పి స్టార్ అయిపోయిన బోల్డ్ హీరోయిన్.. ఎవరామె ?
Recommended image3
వామ్మో వాయ్యో.. ఫస్ట్ మాస్ సాంగ్ ఇదే, రెస్పాన్స్ కి గాల్లో తేలిపోతున్న ఆషిక.. క్రేజీ ఫోటోస్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved