ఫస్ట్ 100కోట్ల సినిమాలు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మలయాళంలో ఇవే తోపు
ఇండియన్ సినిమాల్లో వంద కోట్లు ఈజీ అయిపోయాయి. చిన్న సినిమాల హీరోలే కొడుతున్నారు. మరి అన్ని భాషల్లో మొదటి వంద కోట్లు సాధించిన చిత్రాలేంటో ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం సినిమా పరిధి చాలా పెరిగింది. మార్కెట్ పెరిగింది. పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తుంది. ఒకప్పుడు వంద కోట్లు అంటే అదో సంచలనం. కానీ ఇప్పుడు చిన్న హీరోల సినిమాలు కూడా వంద కోట్లు వసూలు చేస్తున్నాయి. ఐదు వందల కోట్లే ఈజీ అయిపోయాయి. వెయ్యి కోట్ల సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక రెండు వేల కోట్లే టార్గెట్‌గా మూవీస్ రూపొందుతున్నాయి. మున్ముందు ఆ టార్గెట్ కూడా దాటే సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో ఆ రేంజ్ మూవీస్ కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఫస్ట్ వంద కోట్లు వసూలు చేసిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఫస్ట్ టైమ్ వంద కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రాలేంటో చూద్దాం. తెలుగులో మొదటి వంద కోట్ల సినిమా రాజమౌళికే దక్కింది. అదే రామ్ చరణ్‌తోనే సాధ్యమైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో `మగధీర`(2009) మూవీ వచ్చింది. ఇది టాలీవుడ్‌లో వంద కోట్ల గ్రాస్ దాటిన మొదటి సినిమాగా నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.150కోట్ల గ్రాస్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక కోలీవుడ్‌లో మొదటి వంద కోట్ల మూవీ `శివాజీ` అనే చెప్పాలి. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీ 2007లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ మూవీ కూడా సుమారు రూ.150కోట్లు రాబట్టి అప్పట్లో సంచలనం సృష్టించింది.
కన్నడలో మొదటి వంద కోట్ల మూవీ యష్ నటించిన `కేజీఎఫ్` కావడం విశేషం. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ మూవీ 2018లో విడుదలై ఇండియన్ సినిమాని షేక్ చేసింది. కన్నడ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. ఈ మూవీ ఏకంగా రూ.250కోట్లు వసూలు చేసింది. కన్నడలో తొలి వంద కోట్ల గ్రాస్ దాటిన మూవీగా నిలిచింది.
మలయాళంలో మోహన్‌లాల్ నటించిన `పులిమురుగన్`(మన్యంపులి) సినిమా వంద కోట్లు దాటిన సినిమాగా నిలిచింది. 2016లో విడుదలైన ఈ చిత్రానికి వైశాఖ్ దర్శకత్వం వహించారు. మోహన్‌లాల్ హీరోగా నటించారు. ఈ మూవీ రూ.150కోట్లు సాధించింది. మాలీవుడ్ రూపురేఖలను మార్చేసింది. ఒకచిన్న ఇండస్ట్రీలో వంద కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అక్కడి నుంచి రెండు, మూడు వందల కోట్ల సినిమాలు రూపొందుతుండటం విశేషం.
బాలీవుడ్ వంద కోట్ల మార్క్ ఎప్పుడో దాటేసింది. నార్త్ ఇండియా మొత్తం బాలీవుడ్‌గా పరిగణిస్తారు. అందుకే అక్కడి మార్కెట్ చాలా పెద్దది. హిందీ సినిమాలను విశేషంగా ఆదరిస్తుంటారు. దీంతో డాన్స్ యాక్షన్ ప్రధానంగా రూపొంది,న `డిస్కో డాన్సర్` మూవీ 1982లోనే వంద కోట్ల గ్రాస్ సాధించింది.
ఈ మూవీకి బబ్బర్ సుభాష్ దర్శకత్వం వహించగా, మిథున్ చక్రవర్తి హీరోగా నటించారు. అప్పట్లో ఇది హిందీ మార్కెట్ ఓ ఊపు ఊపేసిన మూవీ కావడం విశేషం. ఇలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ, శాండల్ వుడ్, మాలీవుడ్‌లో వంద కోట్ల ఎప్పుడో దాటేశాయి. ఇప్పుడు వెయ్యి కోట్లని ఈజీగా దాటేస్తున్నండటం విశేషం.
read more: టాక్సిక్ సినిమా కోసం యష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?
also read: రజినీకాంత్ సినిమా లో బాలయ్య ను ఎందుకు తీసుకోలేదు...వీరిద్దరి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?