New Year Songs : బాక్సులు దద్దరిల్లాలా.. 2023లో ఊపూపిన మాస్ సాంగ్స్ ఇవే!
న్యూ సెలబ్రేషన్స్ కు అందరూ సిద్ధమవుతున్న వేళా.. మరింత జోష్ ను నింపేందుకు కొన్ని పాటలు కూడా ఉండాల్సిందే. మాస్ బీట్స్ కు డీజే మోగాల్సిందే. 2023లో సోషల్ మీడియాలో ఊపూపిన పది మాస్ సాంగ్స్ కచ్చితంగా మోగించాల్సిందే.. ఆ సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం...

నందమూరి నటసింహం ‘వీరసింహారెడ్డి’ Veera Simha Reddyలో నుంచి ‘జై బాలయ్య యాంథిమ్’ Jai Balayya Song కొద్దిరోజులు మోతమోగించింది. ఇప్పటికే డీజేలు, పబ్బుల్లో ఈ పాటకున్న క్రేజే వేరు.. అలాంటి సాంగ్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లోనూ మోగాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi నుంచి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ లోని ‘బాస్ పార్టీ’ Boss party సాంగ్ కూడా ఊపూపిన విషయం తెలిసిందే. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లోనే ఉంది.
షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ నుంచి వచ్చిన ‘బేషరమ్’ Besharam సాంగ్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. తెలుగులోనూ ఈ సాంగ్ బాగానే ట్రెండ్ అయ్యింది. సంగీత ప్రియులను మెప్పించింది.
రజనీకాంత్ నుంచి వచ్చిన ‘జైలర్’ Jailer మూవీలో తమన్నా నటించిన ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్ ఎంతలా వచ్చిందో తెలిసిందే. ఇప్పటికీ పార్టీల్లో ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అనిరుధ్ ఇచ్చిన మాస్ బీట్ కు ఊగిపోవాల్సిందే.
ఇక ‘జవాన్’ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ ఊపుతెచ్చేలా ఉంటాయి. ‘చలేయా’, ‘రామయ్యా వస్తావా’ సాంగ్స్ ఈ ఏడాది ఊపూపాయి. న్యూ ఇయర్ కూ మోగుతున్నాయి.
యూత్ ఫుల్ ఎంటర్ టైన మెంట్ ‘మ్యాడ్’ Mad నుంచి కూడా జోష్ ఇచ్చే సాంగ్ వచ్చింది. ‘కళ్లజోడు కాలేజీ పాప’ సాంగ్ బాగానే ట్రెండ్ అయ్యింది. డీజేలు గుమ్ముమనే బీట్స్ తో అలరించింది.
‘కోటబొమ్మాళి’ మూవీ నుంచి వచ్చిన శ్రీకాకుళం సాంగ్ ‘లింగి లింగి లింగిడి’ పాట కూడా ఊపూపింది. మాస్ సాంగ్స్ ఇష్టపడే వారిని అలరించింది. ఈ ఏడాది సోషల్ మీడియాలోనూ ఊపూపింది.
దుల్కర్ సల్మాన్ కు సంబంధించిన మ్యూజిక్ అల్బమ్ ‘హీరియే’ (Heeriye) సాంగ్ కూడా ఊపూపింది. సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ నెట్టింట్లో ట్రెండింగ్ లోనే ఉంది.
‘యానిమల్’ నుంచి వచ్చిన అబ్రార్స్ ఎంట్రీకి సంబంధించిన బాబీ డియో సాంగ్ ‘జమల్ కుడు’ JAMAL KUDU కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది.
అలాగే ‘జైలర్’ లో పెట్టిన taal se taal mila రిమిక్స్ వెర్షన్ కూడా 2023లో ఊపూపింది. డీజే బాక్సుల్లో మోతమోగింది. యూట్యూబ్ లోనూ ట్రెండింగ్ అవుతూనే ఉంది.
మరోవైపు సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ ఫిల్మ్ ‘టిల్లు స్క్వేర్’ నుంచి ‘టిక్కెటే కొనకుండా’.. ‘రాధికా రాధికా’ సాంగ్స్ కూడా మోతమోగించాయి.