- Home
- Entertainment
- Telugu Indian Idol EP1 Promo : సింగర్ పంపిన లవ్ లెటర్ చూసి ఎమోషనలైన నిత్యా.. చదివి వినిపించిన థమన్..
Telugu Indian Idol EP1 Promo : సింగర్ పంపిన లవ్ లెటర్ చూసి ఎమోషనలైన నిత్యా.. చదివి వినిపించిన థమన్..
‘ఆహా’లో ప్రసారం కానున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాలిటీ షోకు నిత్యామీనన్, థమన్, కార్తీక్ లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న నిత్యామీనన్ కు ఓ సింగర్ లవ్ లెటర్ రాశాడు. దీంతో ఆమె షాక్ కు గురైంది. లెటర్ లో ఏముందని థమన్ చదివి వినిపించాడు. అసలు ఆ లెటర్ లో ఏముందంటే..

ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’ సింగింగ్ రియాలిటీ షోను ప్రారంభించింది. ‘వేలాది కలలు, విభిన్న స్వరాలు... ఒక్క వేదిక, ఒక్క విజేత’ అంటూ ఈ షోను సరికొత్తగా ప్రదర్శించనుంది. ‘తెలుగు ఇండియన్ ఐడల్’టైటిల్ తో ఎపిసోడ్స్ కూడా నిర్మించనుంది.
ఈ షోకు నిత్యామీనన్, థమన్, కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇండియన్ ఐడల్ ఫేమ్, సింగర్ శ్రీ రామచంద్ర వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. ఈ నెల 25 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ షో ప్రసారం కానుంది. ప్రతి శుక్రవారం, శనివారం ఆహాలో ప్రసారం కానుంది.
ప్రతిభ గల సింగర్స్ ను వెలికి తీసి, వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు రూపొందించినదే ఈ సింగింగ్ రియాలిటీ షో. న్యాయ నిర్ణేతల తీర్పు ఆధారంగా ఒక సింగర్ కు టైటిల్ ను అందించనున్నారు. ఈ క్రమంలో రిలీజైన షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా ఉంది.
ఈ ఎపిసోడ్ లో జడ్జీ నిత్యా మీనన్ కు ఊహించని విధంగా ఒకరు లవ్ ప్రపోజ్ చేస్తూ లెటర్ రాశారు. దీంతో నిత్యామీనన్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. తనకు లవ్ లెటర్ రాయడమేంటని.. సైలెంట్ అయ్యింది. దీంతో అసలు ఆ లెటర్ లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు థమన్. ఇందుకు లెటర్ ను ఓపెన్ చేసి చదివే ప్రయత్నం చేశాడు.
థమన్ లెటర్ చదువుతూ.. ‘ డియర్ నిత్యామీనన్.. నీ అందాన్ని ఎలా పొగడాలో తెలియక.. నా ఇష్టాన్ని దారంతో పోల్చితే.. ఆ దారం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది’ అంటూ ఆ లెటర్ ను పూర్తి చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న నిత్యా మీనన్ నవ్వుతూ షోను కొనసాగించింది. ఇక నిత్యామీనన్ తో డ్యాన్స్ చేయాంటూ ఓ సింగర్ తెగ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ నిత్యా నవ్వుతూ జడ్జీ స్థానంలో ఉండిపోతోంది. మరోవైపు షోలో థమన్ సందర్భానుసారంగా విసిరే పంచులు, స్పందించే తీరు షోకు అట్రాక్షన్ గా నిలిచాయి. మరోవైపు సింగర్స్ కూడా తమ సిన్సియారిటీని పాటల రూపంలో చూపిస్తున్నారు.
అయితే ఆ లెటర్ ఎవరు రాశారు?.. ఆ సింగర్ తో నిత్యా మీనన్ డ్యాన్స్ చేసిందా.. లేదా?.. థమన్ ఇంకా ఎలాంటి పంచులతో షోలో అట్రాక్ట్ గా నిలిచారనేది సస్పెన్స్ గానే ఉంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 25న ప్రసారమయ్యే ఈ షోను చూడక తప్పదు.. నిత్యా మీనన్ ప్రముఖ నటిగానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ కూడా. గుండె జారి గల్లంతయ్యిందే, ఇష్క్ వంటి చిత్రాలకు కూడా పాటలు పాడింది. సంవత్సరాలుగా ఆమె కొన్ని తమిళం, మలయాళం మరియు కన్నడ పాటలకు తన గాత్రాన్ని అందించింది.