- Home
- Entertainment
- ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన బెస్ట్ టాలీవుడ్ మూవీస్ ఇవే.. ఈ జోనర్ లో వెంకటేష్ కి తిరుగులేదుగా..
ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన బెస్ట్ టాలీవుడ్ మూవీస్ ఇవే.. ఈ జోనర్ లో వెంకటేష్ కి తిరుగులేదుగా..
తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. తండ్రి ప్రేమని తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తండ్రి రియల్ హీరో
ప్రతి ఒక్కరికీ వారి జీవితాల్లో తండ్రి రియల్ హీరోగా ఉంటారు. కుటుంబాన్ని నడిపించేది తండ్రి. అలాంటి తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. తండ్రి ప్రేమని తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొమ్మరిల్లు
భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. తన కొడుకు ఎదిగినా, అతని జీవితంపై తన నియంత్రణ కొనసాగిస్తుంటాడు తండ్రి. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయి నటించారు. పెళ్లి విషయంలో హీరో సిద్దార్థ్ తండ్రితో విభేదించడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. చివర్లో తండ్రీ కొడుకుల ఎమోషనల్ సీన్స్ ఈ చిత్రానికి హైలైట్.
నాన్నకు ప్రేమతో
ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఒక తండ్రి-కొడుకు అనుబంధాన్ని చూపిస్తుంది. తండ్రి ఆస్తి కోల్పోయినప్పుడు, కొడుకు తన ప్రతిభను ఉపయోగించి దాన్ని తిరిగి సాధించాలనే సంకల్పంతో ప్రయాణం మొదలుపెడతాడు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించారు.
సన్నాఫ్ సత్యమూర్తి
ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యతను తీసుకుంటాడు. తన తండ్రి మరణించినప్పటికీ భూ వివాదంలో చెడ్డపేరు రాకూడదని అల్లు అర్జున్ చేసే పోరాటం ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
వెంకటేష్ నటించిన ఈ చిత్రంలో కొడుకు ఉద్యోగం లేక తండ్రికి భారం అవుతాడు. కొడుకు ఉద్యోగం సాధించిన సమయంలో, తండ్రి అనుకోని రీతిలో మరణిస్తాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగ అనుబంధాన్ని హృదయాన్ని తాకేలా చూపుతుంది. వెంకటేష్ ఈ పాత్రకు నంది అవార్డు కూడా గెలుచుకున్నారు.
సూర్య వంశం
తండ్రి సెంటిమెంట్ తో వెంకటేష్ నటించిన మరో చిత్రం సూర్య వంశం. వెంకటేష్ ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. తండ్రికి ఇష్టం లేని చిన్న కొడుకుగా వెంకటేష్ నటించిన విధానం అద్భుతం. చివరికి తండ్రి మనసు ఎలా దోచుకున్నాడు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి కాకుండా తులసి, జయం మనదేరా లాంటి చిత్రాల్లో కూడా వెంకటేష్ తండ్రి సెంటిమెంట్ ని అద్భుతంగా పండించారు.
డాడీ
ఈ చిత్రంలో చిరంజీవి, సిమ్రన్ జంటగా నటించారు. కూతురి కోసం పరితపించే తండ్రిగా మెగాస్టార్ నటన ఆకట్టుకుంటుంది.
హాయ్ నాన్న
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధాన్ని చూపుతుంది. అనారోగ్యంతో ఉన్న కూతురిని కాపాడేందుకు తండ్రి చేసే పోరాటమే ఈ చిత్రం.