MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ తో మాత్రమే కాదు.. వెంకీ, ప్రభాస్ తో కూడా కన్నడ సెన్సేషనల్ బ్యూటీ రొమాన్స్ ?

ఎన్టీఆర్ తో మాత్రమే కాదు.. వెంకీ, ప్రభాస్ తో కూడా కన్నడ సెన్సేషనల్ బ్యూటీ రొమాన్స్ ?

వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రం గురించి బలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి తాజాగా మరో వార్త వైరల్ గా మారింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 23 2025, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బన్నీ, త్రివిక్రమ్ చిత్రం వాయిదా
Image Credit : Asianet News

బన్నీ, త్రివిక్రమ్ చిత్రం వాయిదా

గుంటూరు కారం తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని భావించారు. పురాణాల నేపథ్యంలో త్రివిక్రమ్ కథ కూడా రెడీ చేసుకున్నారు. కానీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా అట్లీ దర్శకత్వంలో నటించేందుకు మొగ్గు చూపారు. దీనితో త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో మరో హీరోతో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
త్రివిక్రమ్, వెంకీ కాంబినేషన్ 
Image Credit : our own

త్రివిక్రమ్, వెంకీ కాంబినేషన్ 

ఈ క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా రాబోతుందన్న వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయినా సరే, ఈ వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

35
ముగ్గురు హీరోలతో కన్నడ బ్యూటీ రొమాన్స్  
Image Credit : our own

ముగ్గురు హీరోలతో కన్నడ బ్యూటీ రొమాన్స్  

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో కథానాయికగా రుక్మిణి వసంత్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆమెకు ఇప్పటికే కథను త్రివిక్రమ్ వినిపించినట్లు తెలుస్తోంది. ఆమె నుంచి తుది నిర్ణయం రావాల్సి ఉంది. రుక్మిణి వసంత్ ప్రస్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ చిత్రానికి కూడా పరిశీలనలో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీపికా పదుకొనె ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో స్పిరిట్ చిత్రంలో ఆమెకు అవకాశం దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

45
త్వరలో ప్రకటన
Image Credit : Instagram

త్వరలో ప్రకటన

వెంకటేష్‌తో త్రివిక్రమ్ గతంలో ఓ సినిమా ప్రకటించినప్పటికీ, అది వివిధ కారణాల వల్ల సాధ్యపడలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ తెరపైకి వస్తున్నందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ప్రాజెక్టును హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారని సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు.

55
భారీ హిట్ తర్వాత వస్తున్న వెంకీ.. 
Image Credit : our own

భారీ హిట్ తర్వాత వస్తున్న వెంకీ.. 

వెంకటేష్ చివరగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయం అందుకున్నారు. ఈ మూవీ వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వెంకీ, త్రివిక్రమ్ అనుబంధం ఇప్పటిది కాదు.. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
ఫారెన్ నుంచి వచ్చాను కదా, దానికి ఒప్పేసుకుంటానని అనుకున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ కామెంట్స్
Recommended image2
ఓటీటీ ఆడియన్స్ కి పండగే.. ఈ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు రిలీజ్, ఎందులో చూడాలంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved