MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishnu Priya: విష్ణుప్రియ గ్లామర్‌కు ఇంత డిమాండా? ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా భారీ మొత్తం, నిజమేనా

Vishnu Priya: విష్ణుప్రియ గ్లామర్‌కు ఇంత డిమాండా? ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా భారీ మొత్తం, నిజమేనా

తెలుగు యాంకర్ విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ధర ₹399 అని టాక్ నడుస్తోంది. ఆమెకున్న 8,449 మంది సబ్‌స్క్రైబర్ల లెక్కన నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా? ఆ లెక్కల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 17 2026, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాంకర్ విష్ణుప్రియ
Image Credit : Asianet News

యాంకర్ విష్ణుప్రియ

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ భీమినేని తనదైన మాటల గారడీతో, చలాకీతనంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. టీవీ షోలతో పాటు రియాలిటీ షోలలో కూడా సందడి చేసిన ఈ బ్యూటీ, 'బిగ్‌బాస్ తెలుగు 8'లో అడుగుపెట్టాక మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ధర, దాని ద్వారా వస్తున్న ఆదాయం లెక్కలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ రేటు ఎంత?
Image Credit : Asianet News

విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ రేటు ఎంత?

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ, తన ఫొటోలు, వీడియోలతో పాటు పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఇస్తోందనే వార్త వైరల్ అవుతోంది. దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకున్న అభిమానులకు ఆమె స్పెషల్ కంటెంట్ చూసే అవకాశం దక్కుతుంది.

తాజా సమాచారం ప్రకారం, విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌కు నెలకు ₹399 ఫీజు ఫిక్స్ చేశారట. సెలబ్రిటీలు తమ అభిమానులతో మరింత క్లోజ్‌గా ఉండటానికి, స్పెషల్ కంటెంట్ షేర్ చేయడానికి ఇలాంటి ఫీచర్లను వాడుకుంటున్నారు.

35
నెలకు ₹33 లక్షలకు పైగా ఆదాయం వస్తుందా?
Image Credit : Asianet News

నెలకు ₹33 లక్షలకు పైగా ఆదాయం వస్తుందా?

విష్ణుప్రియ సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా చర్చల్లో ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఆమెకు దాదాపు 8,449 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారట. ఈ నంబర్‌ను బట్టి ఆమె నెలవారీ ఆదాయం ఎంత ఉంటుందనే దానిపై లెక్కలు వేస్తున్నారు. ఒక సబ్‌స్క్రైబర్ నెలకు ₹399 చెల్లిస్తే, 8,449 మంది చెల్లించే మొత్తం ఇలా ఉంటుంది:

సబ్‌స్క్రిప్షన్ ఫీజు: ₹399

రిపోర్ట్స్ ప్రకారం సబ్‌స్క్రైబర్ల సంఖ్య: 8,449

నెలవారీ అంచనా ఆదాయం: ₹33,71,151

45
నెట్టింట తెగ చర్చ
Image Credit : Asianet News

నెట్టింట తెగ చర్చ

అంటే, ఈ లెక్కల ప్రకారం నెలకు సుమారు ₹33.71 లక్షల దాకా వసూలు కావొచ్చు. అందుకే విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. అయితే, ఈ మొత్తం అంతా ఆమె జేబులోకే వెళ్తుందని అనుకోలేం. సబ్‌స్క్రైబర్ల సంఖ్య, ఫీజుల గురించి వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన లేదు. పైగా, ప్లాట్‌ఫామ్ కమీషన్, ట్యాక్స్‌లు, ఇతర కోతలు పోను ఆమె చేతికి వచ్చే మొత్తం వేరేలా ఉండొచ్చు.

55
యాంకర్ నుంచి రియాలిటీ షో స్టార్‌గా విష్ణుప్రియ జర్నీ
Image Credit : Asianet News

యాంకర్ నుంచి రియాలిటీ షో స్టార్‌గా విష్ణుప్రియ జర్నీ

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ, ఎన్నో టీవీ షోల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన 'పోవే పోరా' షో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు ఎంటర్‌టైన్‌మెంట్ షోలు, సినిమాల్లో కనిపించిన ఆమె, 'బిగ్‌బాస్ తెలుగు 8'లో పాల్గొని మరింత పాపులర్ అయింది.

ఇప్పుడు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాను కూడా తన కెరీర్‌లో కీలక భాగంగా మార్చుకుంది. విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు, ఆమె సంపాదన లెక్కలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, సబ్‌స్క్రైబర్ల సంఖ్య, అసలు ఆదాయంపై క్లారిటీ వచ్చే వరకు ఈ లెక్కలను కేవలం అంచనాలుగానే చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
Recommended image2
Bigg Boss Telugu 10: ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్.. ఎలిమినేట్‌ అయ్యేది ఆమెనే?
Recommended image3
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Related Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
Recommended image2
Jr NTR: నా ఇమేజ్ వల్ల ఆ సినిమా పాడైపోయేది, అందుకే పక్కన పెట్టా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఆలోచించారా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved