- Home
- Entertainment
- Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
నందమూరి బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు కొందరు క్రేజీ హీరోలు టైం ట్రావెల్ సినిమాల్లో నటించారు. టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Balakrishna
టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కానీ కమర్షియల్ సినిమా తరహాలో టైం ట్రావెల్ సినిమాలు కుప్పలు తెప్పలుగా చేయడం కుదరదు. టైం ట్రావెల్ అనేది చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్. అందుకే టైం ట్రావెల్ సినిమాల్లో నటించే అవకాశం కొద్దిమంది హీరోలకు మాత్రమే దక్కింది. ఆ హీరోలు ఎవరు, ఆ సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
ఆదిత్య 369
హిస్టరీ, టైం ట్రావెల్ అంశాలని అద్భుతంగా మిక్స్ చేసిన మూవీ ఇది. తెలుగు సినిమా చరిత్రలో గొప్ప సినిమాగా నిలిచింది. నందమూరి బాలకృష్ణ ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయులుగా నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రలో బాలయ్య నటన అద్భుతం అనే చెప్పాలి.
24
హీరో సూర్య నటించిన టైం ట్రావెల్ సినిమా 24. ఈ మూవీలో సూర్య విలన్ గా, తండ్రి కొడుకులుగా ట్రిపుల్ రోల్ లో నటించారు. కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే కాన్సెప్ట్ పరంగా ఈ సినిమా ఒక అద్భుతం అనే చెప్పాలి. విలన్ పాత్రలో సూర్య ప్రదర్శించిన విలక్షణ నటన నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటుంది.
ఒకే ఒక జీవితం
చార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా టైం ట్రావెల్ సినిమాలో నటించాడు. ఆ సినిమా పేరు ఒకే ఒక జీవితం. మదర్ సెంటిమెంట్, సైన్స్ ఫిక్షన్ అంశాలు కలగలిసిన టైం ట్రావెల్ మూవీ ఇది. శర్వానంద్,వెన్నెల కిషోర్, ప్రియదర్శి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ మూవీలో ఆకట్టుకుంటాయి.
అద్భుతం
ఇది ఒక టైం లూప్ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. తేజ సజ్జా, శివాని రాజశేఖర్ ఈ మూవీలో జంటగా నటించారు.
మానాడు
ఇది కూడా టైం లూప్ కాన్సెప్ట్ లో తెరకెక్కిన చిత్రమే. శింబు హీరోగా నటించిన మూవీ ఇది. విలన్ గా నటించిన ఎస్ జె సూర్య పాత్ర ఈ సినిమాకి హైలైట్. అన్నయ్య అన్నయ్య అంటూ ఎస్ జె సూర్య చెప్పిన డైలాగ్స్ కడుపుబ్బా నవ్వించాయి.

