MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jr NTR: నా ఇమేజ్ వల్ల ఆ సినిమా పాడైపోయేది, అందుకే పక్కన పెట్టా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఆలోచించారా ?

Jr NTR: నా ఇమేజ్ వల్ల ఆ సినిమా పాడైపోయేది, అందుకే పక్కన పెట్టా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఆలోచించారా ?

ఎన్టీఆర్ తన కెరీర్ రిజెక్ట్ చేసిన ఓ అద్భుతమైన మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇమేజ్ వల్లే ఆ సినిమాని పక్కన పెట్టాల్సి వచ్చింది అని తెలిపారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 17 2026, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jr NTR
Image Credit : Asianet News

Jr NTR

హీరోలంతా ఏదో ఒక సందర్భంలో కొన్ని గొప్ప సినిమాలని మిస్ అవుతుంటారు. ఆ చిత్రం తమ వద్దకు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేస్తుంటారు. కొన్ని సినిమాల గురించి తెలిస్తే.. ఇంత మంచి సినిమాని వీళ్ళు ఎలా రిజెక్ట్ చేశారు అనే అనుమానం కలుగుతుంది. ఆ విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ గొప్ప సినిమాని రిజెక్ట్ చేశారు. తారక్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బొమ్మరిల్లు ప్రభంజనం
Image Credit : Asianet News

బొమ్మరిల్లు ప్రభంజనం

ఆ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్, యువత బ్రహ్మరథం పట్టారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే బొమ్మరిల్లు. భాస్కర్ దర్శకత్వంలో సిద్దార్థ్, జెనీలియా నటించిన ఈ మూవీ అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాని దిల్ రాజు ముందుగా ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు. కథ కూడా వినిపించారు.

35
నా ఇమేజ్ వల్ల పాడైపోవచ్చు
Image Credit : Dil Raju\Instagram

నా ఇమేజ్ వల్ల పాడైపోవచ్చు

కానీ తాను ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని తారక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దిల్ రాజు గారు బొమ్మరిల్లు కథని నా వద్దకు తీసుకువచ్చి వినిపించారు. వెంటనే చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంత మంచి సినిమా చేయడానికి నా ఇమేజ్ నాకు అడ్డుగా వస్తోంది. నా సినిమాలో అభిమానులు ఫైట్స్, భారీ డైలాగులు లాంటివి ఆశిస్తారు. అవన్నీ పక్కన పెట్టి చేస్తే నా ఇమేజ్ వల్ల సినిమా పాడైపోయే అవకాశం ఉంది.

45
హిట్ కాకపోయినా పర్వాలేదు కానీ
Image Credit : facebook.com/SriVenkateswaraCreations

హిట్ కాకపోయినా పర్వాలేదు కానీ

నా ఇమేజ్ వాళ్ళ ఒక సినిమా సూపర్ హిట్ కాకపోయినా పర్వాలేదు.. కానీ పాడైపోకూడదు అని కోరుకుంటా. అంత మంచి కథని నేను చేస్తే ఏమవుతుందో అనే సందేహంతో పక్కన పెట్టేశాను అని తారక్ తెలిపారు. ఆ తర్వాత బొమ్మరిల్లు చిత్రం సిద్దార్థ్ చేతుల్లోకి వెళ్లడం అతడు చేయడం జరిగింది.

55
ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు
Image Credit : facebook.com/SriVenkateswaraCreations

ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు

తారక్ చెప్పిన ఈ విషయాలు గమనిస్తే అతడు ఒక సినిమా విషయంలో ఎంత లోతుగా ఆలోచిస్తాడు అనేది అర్థం అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ చేయాల్సి ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎక్కువ సినిమాలు చేసిన పాపానికి తప్పుడు లింకులు పెట్టారు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్
Recommended image2
సుడిగాలి సుధీర్‌కు నిశ్చితార్థం జరిగినా.. పెళ్లి మాత్రం ఎందుకు ఆగిపోయింది?
Recommended image3
Crazy Kalyanam Day 1 Collections: టీ ఖర్చులు కూడా రాలేదు.. జైలర్‌ 2కి, రణబాలికి మధ్య నలిగిన క్రేజీ కళ్యాణం
Related Stories
Recommended image1
OTT: సముద్రంలో దొరికిన బంగారు ఆభరణంతో ఊహించని చిక్కులు.. అదిరిపోయే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మిస్ కావొద్దు
Recommended image2
Kota Srinivasa Rao: ఇష్టం లేకుంటే షూటింగ్ నుంచి వెళ్ళిపో, కోట శ్రీనివాసరావుతో డైరెక్టర్.. నటి వల్ల వివాదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved