తెల్లకల్లు, మటల్‌కే తెలంగాణ ఆడియెన్స్ లో వైబ్.. దిల్ రాజు నోటి నుంచి అవమానకర వ్యాఖ్యలు
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ఆడియెన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెల్ల కల్లు, మటన్ కే ఇక్కడి ఆడియెన్స్ లో వైబ్ వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మెన్, నిర్మాత దిల్ రాజు..ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రాల నుంచి మిడిల్ రేంజ్ మూవీస్ ని, చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఆడియెన్స్ కి టేస్ట్ ఉన్న చిత్రాలను అందిస్తున్నారు. ఇంటిళ్లిపాది చూసే సినిమాలను అందించేందుకు ప్రయారిటీ ఇస్తుంటారు.
GAME CHANGER, CHENNAI EVENT, Ramcharan, shankar
దిల్ రాజు ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో వస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో `గేమ్ ఛేంజర్` తీశారు. ఇది జనవరి 10న విడుదల కాబోతుంది. దీంతోపాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రాన్ని నిర్మించారు.
ఇది జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు దిల్ రాజు. దీంతోపాటు `డాకు మహారాజ్` మూవీని కూడా నైజాంలో ఆయనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండగ మొత్తం ఆయనదే కాబోతుంది.
ఇదిలా ఉంటే సోమవారం నిజామాబాద్‌లో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ట్రైలర్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వివాదంగా మారుతున్నాయి. తెలంగాణ ఆడియెన్స్ ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
సినిమాలకు తెలంగాణ ఆడియెన్స్ పెద్ద గా వైబ్ ఇవ్వరు అంటూ కామెంట్ చేశారు. వెంకటేష్‌కి ఈ విషయాన్ని చెబుతూ, మా ఆడియెన్స్ తెల్లకల్లు, మటన్ కి వైబ్ ఇస్తారని, ఆంధ్రా ఆడియెన్స్ అయితే సినిమాకి వైబ్ ఇస్తారని కామెంట్ చేశారు. ఉదయాన్నే నీరా తాగితే అదిరిపోతుందని, మా వాళ్లు నీరా తాగుతూ వైబ్ పొందుతారని చెప్పారు.
దీంతో దిల్ రాజు వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆయన `వైబ్` గురించి మాట్లాడినా, దాని మీనింగ్ మాత్రం రాంగ్ వేలోనే వెళ్తుంది. తెలంగాణ ఆడియెన్స్ ని దిల్ రాజు దారుణంగా అవమానించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు.
ఆంధ్ర ఆడియెన్స్ ని పొగుడుతూ తెలంగాణ ఆడియెన్స్ ని తక్కువ చేసి మాట్లాడటం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నెట్టింట పెద్ద రచ్చ అవుతుంది. బాధ్యాతాయుత పదవిలో ఉండి, తెలంగాణ నిర్మాత అయి ఉండి ఇలాంటి కామెంట్ చేయడం పట్ల అసహనం వ్యక్తమవుతుంది.
ఇటీవల కాలంలో ఏపీలో వచ్చే కలెక్షన్ల కంటే తెలంగాణ(నైజాం)లో వచ్చే కలెక్షన్లే ఎక్కువగా ఉంటున్నాయి. మొన్న వచ్చిన `పుష్ప 2` నుంచి `దేవర`, `కల్కి 2898 ఏడీ`, `సలార్`, `సరిపోదా శనివారం`, `లక్కీ భాస్కర్`, `క`, `దసరా`, `బలగం` ఇలా చాలా సినిమాలకు నైజాంలోనే మంచి కలెక్షన్లు వచ్చాయి.
పెద్ద సినిమాలు ఏపీలో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. కానీ నైజాంలో బ్రేక్ ఈవెన్ దాటాయి.ఇటీవల వచ్చిన `పుష్ప 2` విషయంలోనూ అదే జరిగింది. కానీ అవన్నీ మరిచి దిల్ రాజు ఇలా అవమానిస్తూ కామెంట్ చేయడం విచారకరం. తెలంగాణ ప్రజలు తాగుడు తినుడుకే ప్రయారిటీ ఇస్తారనేలా ఆయన వ్యాఖ్యానించడం బాధాకరం.
అది తెలంగాణలో ఒక కల్చర్. దాన్ని ఒక తెలంగాణకి చెందిన వ్యక్తినే ఇలా చులకన చేసి మాట్లాడటంతో సోషల్ మీడియాలో దిల్ రాజుని ఆడుకుంటున్నారు. ఈ ప్రభావం ఆయన సినిమాలపై కూడ పడే ఛాన్స్ ఉంది. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.
read more:వాటిలో ఏది టచ్ చేసినా దెబ్బలే.. చిరంజీవి నటుడిగా మారడం వెనుక అసలు కారణాలు