ఆ రోల్‌కి ఎన్టీఆర్ సెట్ అవుతాడని బాలయ్యనే చెప్పారు.. `అన్‌స్టాపబుల్`లో ఎన్టీఆర్ అన్న ప్రస్తావనే రాలేదు
బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్` షోలో ఎన్టీఆర్ ప్రస్తావన రాలేదా? తాజాగా నిర్మాత నాగవంశీ దీనిపై స్పందించారు. అసలేం జరిగిందో తెలిపారు.
నందమూరి ఫ్యామిలీ రెండుగా విడిపోయినట్టుగా కనిపిస్తుంది. చాలా రోజులుగా అటు బాలకృష్ణ ఫ్యామిలీకి, ఇటు జూ ఎన్టీఆర్ ఫ్యామిలీకి పడటం లేదని తెలుస్తుంది. ఆ గ్యాప్ స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పట్నుంచి ఈ గ్యాప్ నెలకొందని తెలుస్తుంది. కానీ అంతకు ముందే చాలా కారణాలతో వీరికి గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది.
ఇక బాలకృష్ణ హోస్ట్ గా చేసే `అన్‌స్టాపబుల్` షోలో జూ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా బాలయ్య జాగ్రత్తపడుతున్నారని, అదే విషయాన్ని `ఆహా` నిర్వాహకులకు చెప్పారనిసమాచారం. మొన్న దర్శకుడు బాబీ ఎపిసోడ్‌లో ఆయన తన అన్ని సినిమాల గురించి చెప్పారు.
చిరు, వెంకీ, రవితేజ, పవన్ కళ్యాణ్‌లతో చేసిన సినిమాల గురించి, వారి గురించి చెప్పారు. కానీ ఎన్టీఆర్ ప్రస్తావన తేలేదు. అయితే ఎడిటింగ్‌లో కట్ చేశారనే టాక్ వినిపించింది.
దీనిపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు. ఆ ఎపిసోడ్‌లో నాగవంశీ కూడా ఉన్నారు. `డాకు మహారాజ్` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాబీ, నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి కట్ చేశారనే వార్తలపై స్పందించారు నాగవంశీ. అసలు షోలో ఎన్టీఆర్ ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు.
కట్ చేసింది నిజం కాదన్నారు. అదే సమయంలో గతంలో ఓ సమయంలో ఓ మూవీ గురించి చర్చిస్తుంటే ఈ పాత్రకి ఎన్టీఆర్ సెట్ అవుతాడని ఆయనే చెప్పినట్టు తెలిపారు. అయితే అది షోలో కాదని, షోలో ఎన్టీఆర్ ప్రస్తావన రాలేదని తెలిపారు.
బయట ప్రచారం జరుగుతున్నది కూడా ఇదే. `అన్‌స్టాపబుల్` షోలో జూ ఎన్టీఆర్ గురించి ఎవరూ మాట్లాడవద్దని ఆ విషయాన్ని గెస్ట్ లకుచెప్పాలని సూచించారట బాలయ్య. దీంతో ముందుగానే షోకి వచ్చిన గెస్ట్ లకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారట.
దీంతో బాబీ ఎన్టీఆర్‌తో చేసిన `జై లవకుశ` సినిమా ప్రస్తావన తేలేదు. అలాగే రామ్ చరణ్ సైతం తారక్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఆయన గురించి చెప్పలేదని తెలుస్తుంది.
ఎన్టీఆర్‌పై కోపంతోనే బాలయ్య ఇలా చేస్తున్నాడని అంటున్నారు. తారక్‌ని తొక్కేయాలని చేసే ప్రయత్నం అంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తారక్ ఆల్‌రెడీ పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు ఎవరీ గొప్పలు, ఎవరి ఎంకరేజ్‌మెంట్ అవసరం లేదు. ఆయన ఆ స్థాయిని దాటిపోయారని అంటున్నారు. తారక్‌కి మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు.
బాలయ్య లోకల్ స్టార్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తారక్ ఇటీవల `దేవర`తో హిట్ అందుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఇంకోవైపు `వార్ 2`లో నటిస్తున్నారు. అలాగే `దేవర 2`లో నటించాల్సి ఉంది.
read more: `బాహుబలి 2` రికార్డులు బ్రేక్, అక్కడ మాత్రం `పుష్ప 2` డిజాస్టర్, ఇదేం ట్విస్ట్?
also read: వాటిలో ఏది టచ్ చేసినా దెబ్బలే.. చిరంజీవి నటుడిగా మారడం వెనుక అసలు కారణాలు