- Home
- Entertainment
- శ్రీరెడ్డిపై మరోసారి రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ తేజస్వి మదివాడ.. తప్పు చేసి గోల చేయడమెందుకంటూ కౌంటర్లు
శ్రీరెడ్డిపై మరోసారి రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ తేజస్వి మదివాడ.. తప్పు చేసి గోల చేయడమెందుకంటూ కౌంటర్లు
టాలీవుడ్‌లో కాంట్రవర్సియల్ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి పై విరుచుకుపడింది మరో బోల్డ్ హీరోయిన్ తేజస్వి మదివాడ. తాజాగా ఆమె టాలీవుడ్‌లో కమిట్‌మెంట్, క్యాస్టింగ్ కౌచ్‌ల గురించి చెబుతూ, శ్రీరెడ్డిని ఓ రేంజ్‌లో ఆడుకుంది.

హాట్ హీరోయిన్‌గా మారి బోల్డ్ రోల్స్ తో కనువిందు చేస్తున్న తేజస్వి మదివాడ చాలా రోజుల తర్వాత `కమిట్‌మెంట్` అనే చిత్రంలో నటించింది. పేరుకి తగ్గట్టే చిత్ర పరిశ్రమలోని కమిట్‌మెంట్ల గుట్టు రట్టు చేసేందుకు వస్తోందీ బ్యూటీ. తన జీవితంలోని కొన్ని యదార్థ సంఘటనలు కూడా మేళవింపుతో రూపొందిన చిత్రమిది. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
నలుగురు జంట స్టోరీలను ఆవిష్కరించే చిత్రమిది. నాలుగు కథలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆగస్ట్ 19న(శుక్రవారం) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా అనేక విషయాలను బోల్డ్ గా షేర్ చేసుకుంది తేజస్వి మదివాడ. ఇప్పటికే టాలీవుడ్‌లోని కమిట్‌మెంట్ల గురించి చెప్పి హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డిపై కూడా హాట్ కామెంట్లు చేసింది.
తాజాగా మరో ఇంటర్వ్యూలో మరోసారి శ్రీరెడ్డిని టార్గెట్ చేసింది తేజస్వి. చేయాల్సిన తప్పు చేసి, అంతా అయిపోయాక ఇప్పుడు నేను మోసపోయాను, నన్ను వాడుకున్నారని చెప్పడం కరెక్ట్ కాదని వెల్లడించింది తేజస్వి. మన అంగీకారం లేకపోతే ఏమీ జరగదని, కానీ ఆ టైమ్‌లో ఒప్పుకుని, ఇప్పుడు ఆ విషయాలను బయటపెట్టడం సరికాదని తెలిపింది. తాను నటించిన `కమిట్‌మెంట్` చిత్రంలో అవకాశాల కోసం ఆఫీసుల వెంట తిరిగే అమ్మాయిగా నటిస్తుంది. ఇది శ్రీరెడ్డి రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండటంతో, దీనిపై స్పందించింది.
tejaswi madivada
మనం చిత్ర పరిశ్రమలోకి వచ్చి, ఇక్కడే ఉంటూ ఇండస్ట్రీ బాగా లేదనడం కరెక్ట్ కాదని, ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో సందర్భంలో కమిట్‌మెంట్ ని ఫేస్ చేస్తారని చెప్పింది. కమిట్‌మెంట్ అడగడమో, లేక మనతో తప్పుగా ప్రవర్తించడమో జరుగుతుంది. ఆ సమయంలోనే మనం ఫైట్ చేయాలని, అప్పుడు లొంగిపోయి, ఇప్పుడు ఫైట్ చేయకూడదని చెప్పింది. నీకు తప్పు అనిపిస్తే ఆ క్షణమే దాన్ని వ్యతిరేకించాలని, అది నాకు నచ్చలేదని ముఖం మీదే చెప్పాలని వెల్లడించింది.
ఈ సందర్భంగా శ్రీరెడ్డిని ఉద్దేశిస్తూ తేజస్వి మదివాడ మాట్లాడుతూ, చేయాల్సిన తప్పు చేసేసి, నన్ను అందరు వాడుకున్నారని, నన్ను మొత్తం నాశనం చేశారని, గోల చేయడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పింది. తాను ఈ ఇండస్ట్రీలో ఉన్నానని కాదు, ప్రతి అమ్మాయికి ఓ సందేశం ఇచ్చేలా కమిట్మెంట్ మూవీ ఉంటుందని చెప్పింది. నువ్వు చేసేది తప్పా;? రైటా? తేల్చుకోవాల్సింది నువ్వే అని, అంతా అయిపోయాక నన్ను వాడుకున్నారు, ఇలా చేశారని కామెంట్ చేయడం తనకు నచ్చదని తెలిపింది. నీకు తెలియకుండా నిన్ను ఎవరూ ఏం చేయలేరు, కమిట్‌మెంట్ నీకు ఇవ్వాలని లేకపోతే అసలు నిన్ను అడిగే వారూ ఎవరూ ఉండరని చెప్పింది తేజస్వి.
ఇక తన వ్యక్తిగత అనుభవాలకు సంబంధించి ఓపెన్ అయ్యింది తేజస్వి. తాను కమిట్‌మెంట్ పరిస్థితులను ఎదుర్కొన్నట్టు చెప్పింది. సక్సెస్ అనేది పక్కన పెడితే తనకు చాలా బలుపు ఉంటుందని పేర్కొంది. తనని చాలా మంది కమిట్‌మెంట్ అడిగారని, ఇప్పుడు అడగడానికి భయపడతారని, వాళ్ల పేర్లు ఎక్కడ బయటపెడతానో అన్న భయం వాళ్లల్లో ఉందని చెప్పింది.
తాను ఈవెంట్‌లకు వరంగల్ లాంటి ప్రదేశాలను వెళ్లినప్పుడు రాత్రి టైమ్‌లో ఓ ఇరవై ముప్పై మంది తాగేసి తనపై ఎటాక్ చేశారని, వాళ్ల నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చి ఏడ్చానని తెలిపింది. ఆ సమయంలో వాళ్లకి కావాల్సింది ఆడది మాత్రమే. నువ్వు సెలబ్రిటీనా, హీరోయినా? అనేది కాదు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం.
`కమిట్‌మెంట్ అంటే ఫోన్లు చేసి అడుగుతారని, కొంత మంది ఏమీ మాట్లాడకుండా కలిసిన తర్వాత ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అర్థం అవుతుంది. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఆమె అమ్మాయి అయితే చాలు, ఇలాంటి పరిస్థితులు చూడాల్సిందే. అమ్మాయిని చూడగానే, ఓ యాంగిల్ బయటకు వచ్చేస్తుంటుంది. నా మాటలు కొత్తగా వచ్చే వారికి రూల్ బుక్‌లాంటిది. ఏదైనా పడే నేర్చుకోవాలి. కమిట్‌మెంట్ గురించి తెలుసుకుని వస్తే చాలు` అని వెల్లడించింది తేజస్వి.