- Home
- Entertainment
- Teja Sajja: గ్రాండ్ గా తేజ సజ్జా నిశ్చితార్థం.. రవితేజ నుంచి వరలక్ష్మి వరకు, హాజరైన సెలెబ్రిటీలు వీళ్ళే
Teja Sajja: గ్రాండ్ గా తేజ సజ్జా నిశ్చితార్థం.. రవితేజ నుంచి వరలక్ష్మి వరకు, హాజరైన సెలెబ్రిటీలు వీళ్ళే
క్రేజీ హీరో తేజ సజ్జా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో తేజ సజ్జా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

తేజ సజ్జా నిశ్చితార్థం
టాలీవుడ్ లో సూపర్ హీరోగా గుర్తింపు పొందిన తేజ సజ్జా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇందులో భాగంగా తొలి అడుగు పడింది. తేజ సజ్జా నిశ్చితార్థం గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. కుటుంబ సభ్యులు ఈ వేడుకని ప్రైవేట్ గా నిర్వహించారు. తేజ సజ్జా ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ గా వైభవంగా జరిగినట్లు సమాచారం.
తేజ సజ్జాకి కాబోయే భార్య ఎవరు ?
తేజ సజ్జాకి కాబోయే భార్య గురించి ఎక్కువ విషయాలు బయటకి రాలేదు. ఆ అమ్మాయి యూఎస్ కి చెందిన అమ్మాయి అని సమాచారం. ఆమె ఫ్యామిలీ వ్యాపారంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది. వధువు గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. డిసెంబర్ లో తేజ సజ్జా పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది.
Natural Star @NameIsNani makes a stylish arrival at the #TejaSajjaEngagement with his signature charm. ❤️
Super Hero @tejasajja123 https://t.co/azzoIoExKb
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 16, 2026
రాజకీయ ప్రముఖుల సందడి
కాగా సోమవారం రోజు జరిగిన నిశ్చితార్థం వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు లాంటి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అదే విధంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, ప్రశాంత్ వర్మ, నటుడు శివాజీ హాజరయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హనుమాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మిరాయి లాటి సూపర్ హిట్ మూవీ రూపొందించిన కార్తీక్ ఘట్టమనేని కూడా హాజరయ్యారు.
The lovely pair @varusarath5 and #NicholaiSachdev make a grand arrival at the #TejaSajjaEngagement. ❤️
Super Hero @tejasajja123 https://t.co/qSRkkDkeyY
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 16, 2026
హాజరైన సెలెబ్రిటీలు వీళ్ళే
వీరితో పాటు రానా దగ్గుబాటి, రవితేజ, నాని, వరలక్ష్మి శరత్ కుమార్, శ్రీకాంత్, కోన వెంకట్ లాంటి ప్రముఖులు హాజరై తేజ సజ్జ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చూడాలని ఉంది, ఇంద్ర, గంగోత్రి, కలిసుందాం రా లాంటి చిత్రాల్లో తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ తో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నారు.
Hon’ble Union Minister @kishanreddybjp garu graced the #TejaSajjaEngagement with his presence. ❤️
Super Hero @tejasajja123 https://t.co/eEtYWyW0VW
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 16, 2026













