టీచర్స్ డే స్పెషల్: పంతుళ్లుగా మెప్పించిన మన తారలు!

First Published 5, Sep 2019, 1:02 PM IST

టాలీవుడ్ లో గురు-శిష్యుల కాన్సెప్ట్ తో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. 

టాలీవుడ్ లో గురు-శిష్యుల కాన్సెప్ట్ తో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకు చాలా మంది స్టార్ హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం గురువు పాత్రల్లో నటించి తమ టాలెంట్ చాటుకున్నారు. అప్పట్లో హీరోలు గురువు పాత్రలు పోషిస్తే.. హీరోయిన్లు ఎక్కువగా శిష్యపాత్రలు పోషించేవారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమా గురుశిష్యుల బంధాన్ని తెలియజేసే భావోద్వేగ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. నేడు టీచర్స్ డే సందర్భంగా తెలుగులో గురు శిష్యులు ఇతివృత్తంగా వచ్చిన సినిమాల గురించి తెలుసుకుందాం..

ఎన్టీఆర్ నటించిన 'బడి పంతులు' సినిమా గురించే.. అప్పటికి స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ఎన్టీఆర్ ఓ వృద్ధ పంతులు పాత్రలో నటించే సాహసం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇప్పటికీ ఆ సినిమాలో 'భారతమాతకు జేజేలు' అనే పాట వినిపిస్తూనే ఉంది. ఎన్టీఆర్ 'విశ్వరూపం' అనే మరో సినిమాలో కూడా టీచర్ పాత్ర పోషించారు.

సీనియర్ నటుడు కృష్ణంరాజు 'అగ్గిరాజు' అనే సినిమాలో ఆకతాయిగా తిరిగే విద్యార్థులను సరైన దారిలో నడిపించే టీచర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి 'మాస్టర్' సినిమాలో పవర్ ఫుల్ టీచర్ క్యారెక్టర్ లో తనదైన నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో చిరంజీవి ఓ పాట కూడా పాడడం విశేషం. రౌడీలుగా వ్యవహరించే స్టూడెంట్స్ ని మంచి విద్యార్థులుగా మార్చే మాస్టర్ క్యారెక్టర్ లో హుందాతనాన్ని కనబరిచాడు చిరంజీవి. చాలా కాలం తరువాత మళ్లీ 'ఠాగూర్' సినిమాలో లెక్చరర్ నటించారు చిరు.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 'సుందరకాండ' సినిమాలో పూర్తి స్థాయి టీచర్ పాత్ర పోషించారు. తనను ఇష్టపడే స్టూడెంట్ కి అది తప్పని చెబుతూ ఆమెను ఓ కూతురిలా చూసుకునే సన్నివేశాలు ఎమోషనల్ గా సాగుతాయి.

విజయశాంతి నటించిన 'ప్రతిఘటన' మరో ఎత్తు. టీచర్ అయిన విజయ్ శాంతి బొమ్మను విద్యార్థులు నగ్నంగా బోర్డు మీద గీతే.. వారికి జ్ఞానం కలిగించే విధంగా ''ఈ దుర్యోధన దుస్సాసన'' అంటూ వేటూరి రాసిన పాటతో కనువిప్పు కలిగించే సన్నివేశాలు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతాయి.

'కొత్తబంగారు లోకం' సినిమాలో రావు రమేష్ అధ్యాపకుడిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జీవిత పాఠాల గురించి ఆయన గొప్పగా చెప్పే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

'గోల్కొండ హైస్కూల్' లో సుమంత్ స్పోర్ట్స్ టీచర్ గా నటించి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

హీరోయిన్ అసిన్ 'ఘర్షణ' సినిమాలో ఫ్రెండ్లీ టీచర్ గా కనిపిస్తుంది.

loader