వర్మకి టీడీపీ నుండి రూ.50 కోట్ల ఆఫర్.. నిజమెంత!

First Published 16, Mar 2019, 2:29 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత ఎలాంటి సంఘటలు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఓ వర్గం ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో టీడీపీ పార్టీ నుండి వర్మకి యాభై కోట్ల ఆఫర్ వచ్చిందని, వైసీపీ నుండి పాతిక కోట్ల రెమ్యునరేషన్ వచ్చిందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా వీటిపై స్పందించిన చిత్రనిర్మాత రాకేశ్ రెడ్డి ఈ విషయాల్లో నిజం లేదని చెప్పేశాడు. చాలా కాలంగా నిర్మాతగా సినిమా తీయాలని భావిస్తోన్న రాకేశ్ రెడ్డి.. వర్మ 'ఎన్టీఆర్' గురించి సినిమా తీస్తున్నారని తెలుసుకొని ఆయన్ని కలిసినట్లు, తన కుటుంబం మొత్తం ఎన్టీఆర్ కి అభిమానులం అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక వైసీపీ పార్టీ నుండి వర్మకి పాతిక కోట్లు అందిందనే విషయంపై స్పందిస్తూ.. ఏ రాజకీయనాయకుడు అంత డబ్బు ఖర్చు చేయరని, వేరే వాళ్లతో ఖర్చు పెట్టించుకుంటారని, వర్మకి అంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం వైసీపీకి లేదని అన్నారు.

ఇక వర్మకి టీడీపీ పార్టీ యాభై కోట్లు ఆఫర్ చేసిందనే విషయంలో కూడా నిజం లేదని, వర్మపై ఇలాంటి వార్తలు చాలానే వస్తుంటాయని, ఆయన దమ్మున్న దర్శకుడు అంటూ చెప్పుకొచ్చారు.