తరుణ్ రీఎంట్రీ కన్ఫమ్.. ఒకటి కాదు ఏకంగా రెండు.. ప్రకటించిన లవర్ బాయ్..
లవర్ బాయ్ తరుణ్ పదేళ్లుగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు తరుణ్. రీఎంట్రీని ప్రకటించాడు.

లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో తరుణ్. కెరీర్ ప్రారంభంలో వరుసగా లవ్ స్టోరీస్ చేసి విజయాలు అందుకున్నాడు. దీంతో ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. అయితే ఆ ఇమేజ్ నుంచి బయటపడలేకపోయాడు. వరుసగా అలాంటి సినిమాలే చేయడంతో తరుణ్ అంటే లవర్ బాయ్ అనే ట్యాగ్ ఫిక్స్ అయిపోయింది. అదే కెరీర్‌ని దెబ్బకొట్టింది. దీంతో ఆ తర్వాత కెరీర్ సాఫీగా సాగలేదు. వరుసగా ఫెయిల్యూర్స్, మాస్ సినిమాలు సెట్ కాకపోవడంతో ఇమేజ్ పరంగా డౌన్ అయిపోయాడు తరుణ్.
చివరికి మొత్తంగా సినిమాలు చేయడం మానేశాడు. కానీ యాక్టివ్‌గానే ఉంటున్నాడు. ప్రస్తుతం తన వ్యాపారాలు చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య తల్లి, సీనియర్ నటి రోజారమణి ఈ విషయాలు బయటపెట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయని, అవే చూసుకుంటున్నాడని, త్వరలో మళ్లీ కమ్ బ్యాక్ అవుతాడని చెప్పింది రోజా రమణి.
తాజాగా తరుణ్ సైతం స్పందించాడు. తన రీఎంట్రీ విషయంలో ఆయన గుడ్ న్యూస్ చెప్పాడు. సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)కి సంబంధించి టాలీవుడ్ టీమ్‌కి తరుణ్ కెప్టెన్ కావడం విశేషం. దీనికి సంబంధించి కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తరుణ్ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్బంగా ఆయన రీఎంట్రీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సినిమాల్లోకి కమ్ బ్యాక్‌కి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పాడు తరుణ్. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లపై వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. ఒకటి సినిమా అని, మరోటి వెబ్ సిరీస్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వాటిని సంబంధించిన వర్క్ జరుగుతుందని, ఒకటి రెండు నెలల్లోనే వాటి అనౌన్స్ మెంట్ ఉంటుందన్నారు తరుణ్. త్వరలోనే తాను సినిమాల్లోకి కమ్ బ్యాక్ అవుతున్నట్టు చెప్పేశాడు.
నటి రోజా రమణి కొడుకు అయిన తరుణ్.. బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించాడు. `అంజలి` చిత్రానికి బాలనటుడిగా ఏకంగా జాతీయ అవార్డుని అందుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే మూడు నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2000లో `నువ్వే కావాలి` సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సరికొత్త లవ్ స్టోరీ పెద్ద హిట్ అయ్యింది. ఇందులోని పాట ఎవర్ గ్రీన్ గా నిలిచింది.
ఆ తర్వాత `ప్రియమైన నీకు`, `చిరుజల్లు`, `నువ్వు లేక నేను లేను`, `అదృష్టం`, `నువ్వే నువ్వే`, `ఎలా చెప్పను`, `నీ మనసు నాకు తెలుసు` వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలను ఫేస్ చేసిన తరుణ్.. `వేట`(2014) తో సినిమాలు మానేశాడు. మధ్యలో ఆయన చేసిన `ఇది నా లవ్ స్టోరీ` ఆరేళ్ల క్రితం విడుదలైంది. కానీ ఆకట్టుకోలేదు. ఓ రకంగా దాదాపు పదేళ్లుగా సినిమాలకు దూరమయ్యాడు తరుణ్. ఇప్పుడు ఎలాంటి సినిమాతో వస్తాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.