MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'కి తొలిరోజే రూ.500 కోట్లు గ్యారెంటీ.. చిరంజీవి రేంజ్ కి అది చాలా తక్కువ అని చెప్పా 

ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'కి తొలిరోజే రూ.500 కోట్లు గ్యారెంటీ.. చిరంజీవి రేంజ్ కి అది చాలా తక్కువ అని చెప్పా 

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల ఏదో విధంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. సినిమా అంశాలపై, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా తమ్మారెడ్డి తరచుగా ఘాటు వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉన్నాం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 28 2023, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల ఏదో విధంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. సినిమా అంశాలపై, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా తమ్మారెడ్డి తరచుగా ఘాటు వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉన్నాం. టాలీవుడ్ నుంచి వరుసగా పాన్ ఇండియా చిత్రాలు విడుదలై సత్తా చాటుతున్నాయి. దీనిపై తమ్మారెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి తెలుగు సినిమా వసూళ్ల గురించి మాట్లాడారు. హాలీవుడ్ చిత్రాలు సాధారణంగా 20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా వసూళ్లు రాబడతాయి. మన తెలుగు సినిమాకి కూడా ఆ స్థాయిని అందుకునే సత్తా ఉందని తమ్మారెడ్డి అన్నారు. రీసెంట్ గా నేను ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె సెట్స్ కి వెళ్ళాను. వాళ్ళు తెరకెక్కిస్తున్న విధానం చూసి ఆశ్చర్యపోయాను. సరైన విధంగా ఆ చిత్రాన్ని ప్రమోట్ చేస్తే అంతర్జాతీయ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. 

36

వైజయంతి మూవీస్ వారు సరిగ్గా ప్లాన్ చేస్తే ప్రాజెక్ట్ కె చిత్రం తొలిరోజే రూ.500 నుంచి 600 కోట్లు రాబట్టే సత్తా ఉంది. ఇక సినిమా బాగుందని టాక్ వస్తే టాప్ హాలీవుడ్ చిత్రాల జాబితాలో నిలిచే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది అని తమ్మారెడ్డి అన్నారు. ఒకప్పుడు ఇంద్ర చిత్రం 30 కోట్లు రాబట్టింది. టాలీవుడ్ లో అప్పట్లో అది సంచలనం. గ్రాండ్ గా ఫంక్షన్ కూడా చేశారు. ఆ టైంలో చిరంజీవి గారిని కలిశాను. 

46
Project K

Project K

మీ రేంజ్ కి ఇది చాలా తక్కువ.. సరైన స్క్రిప్ట్ పడితే 100 కోట్లు వసూళ్లు వస్తాయి అని చిరంజీవితో అప్పుడే చెప్పా. బాహుబలి చిత్రంతో 1000 కోట్లు సాధించడం చాలా సులభం అని రాజమౌళి నిరూపించారు. ఆ తర్వాత కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు దానిని కొనసాగించాయి. సౌత్ సినిమా వరల్డ్ రికార్డు చిత్రాల జాబితాలో నిలవాలనేది నా కల. ఆ కల ప్రాజెక్టు కె తో నెరవేరే అవకాశం ఉంది. 

56

రెండు సార్లు ప్రాజెక్ట్ కె సెట్స్ కి వెళ్ళాను. వాళ్ళు అవుట్ పుట్ అద్భుతంగా రాబడుతున్నారు. ఫైనల్ గా చిత్రాన్ని మంచి షేప్ కి తీసుకురాగలిగితే హాలీవుడ్ టాప్ 50 చిత్రాల జాబితాలో తప్పకుండా ప్రాజెక్ట్ కె ఉంటుంది అని తమ్మారెడ్డి అన్నారు. 

66

రీసెంట్ గా ప్రాజెక్టు కె చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా జాయిన్ కావడంతో ఈ మూవీ స్వరూపమే మారిపోయింది అని చెప్పొచ్చు. బడ్జెట్ లెక్కలు కూడా కనీవినీ ఎరుగని విధంగా ఉన్నాయి. ప్రభాస్, కమల్ తో పాటు అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి టాప్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ్ అశ్విన్
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image2
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image3
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved