MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో రివర్స్ కాస్టింగ్ కౌచ్, దానికి రెడీ అని హీరోయిన్లే ఛాన్స్ ఇస్తారు, బాంబు పేల్చిన తమ్మారెడ్డి

టాలీవుడ్ లో రివర్స్ కాస్టింగ్ కౌచ్, దానికి రెడీ అని హీరోయిన్లే ఛాన్స్ ఇస్తారు, బాంబు పేల్చిన తమ్మారెడ్డి

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. అవకాశాల పేరుతో దర్శక నిర్మాతలు హీరోయిన్లని వేధించే సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 06 2025, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tammareddy Bharadwaja

Tammareddy Bharadwaja

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. అవకాశాల పేరుతో దర్శక నిర్మాతలు హీరోయిన్లని వేధించే సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది నటీమణులు తమకి అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి ఓపెన్ గా చెబుతున్నారు. కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్ కి లొంగుతారని కూడా కొందరు చెబుతుంటారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మరికొందరు అయితే పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు ఇస్తామని నమ్మించి వారిని లైంగికంగా లోబరుచుకోవడం, ఆర్థికంగా దోచుకునే సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీనిపై టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉండొచ్చు. కాకపోతే అది చాలా తక్కువ శాతం మాత్రమే. అందరూ అలా ఉండరు కదా. 10 శాతం మంది మాత్రమే కాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలని వేధించే వారు ఉంటారు. 

35
tammareddy

tammareddy

ఎలాగైనా సినిమా ఛాన్స్ కావాలి అని భావించే అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ కి లొంగుతారు అని తమ్మారెడ్డి అన్నారు. అయితే టాలీవుడ్ లో రివర్స్ కాస్టింగ్ కౌచ్ కూడా ఉందని తమ్మారెడ్డి బాంబు పేల్చారు. రివర్స్ కాస్టింగ్ కౌచ్ అంటే నేరుగా అమ్మాయిలే వచ్చి దర్శకులకు ఆఫర్ ఇస్తారట. సినిమాలో ఛాన్స్ ఇస్తే తాము దేనికైనా రెడీ అని ఓపెన్ గా చెబుతారట. అలాంటి సంఘటన తనకి రెండు మూడు సార్లు ఎదురైంది అని తమ్మారెడ్డి అన్నారు. 

45

కొంతమంది దర్శకులు అడగడానికి మొహమాటపడి సైలెంట్ గా ఉన్నారేమో.. మనమే వాళ్ళకి ఆఫర్ ఇస్తే సినిమాలో ఛాన్స్ వస్తుంది కదా అని భావించే హీరోయిన్లు ఉంటారు. వాళ్లే దర్శకుల దగ్గరకి వెళ్లి ఓపెన్ గా ఆఫర్ ఇస్తారు అని తమ్మారెడ్డి అన్నారు. తమ్మారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

55

తాను మాత్రం తన హీరోయిన్లని తన ఇంట్లో ఆడపిల్లల్లాగే చూసుకునేవాడిని అని తమ్మారెడ్డి అన్నారు. ఒకరిద్దరు హీరోయిన్లు ఇలా బ్యాడ్ గా బిహేవ్ చేసినా వాళ్ళని పట్టించుకునే వాడిని కాదని అన్నారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సీఈఓగా దీప, జ్యో- కార్తీక్, దీపలను విడదీసిన జ్యో- కాంచన ఆవేశం
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు.. జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ తో పాటు రొమాంటిక్ వెబ్ సిరీస్ లు రెడీ
Recommended image3
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved