ముంబయ్ లో విడిగా ఉంటున్న సూర్య – జ్యోతిక, విడాకుల వార్తల్లోనిజం ఎంత..?
సూర్య - జ్యోతిక విడిపోబోతున్నారా..? తాజాగా వస్తున్న రూమర్స్ నిజమేనా..? ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా.. ఇంకా ఎందుకు ఈ రూమర్స్ బయటకు వస్తున్నాయి...?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇండస్ట్రీకే ఆదర్శంగా ఉండేవారు విడిపోవడం.. విళ్లు ఎందుకు కలిసుంటారులే అనుకున్నవారు.. విడిపోవడం.. ఇలా అనుకోని పరిణామాలు జరుగుతుంటాయి. ఈక్రమంలో.. హీరో దనుష్.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు అందరిని ఆశ్చర్యపరిచాయి. ప్రస్తుతం కొన్ని అనుకోని పరిణామాలు జరుగుతున్నా.. అవి రూమర్లుగానే వినిపిస్తున్నాయి. నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే.. సూర్య జోతిక విడాకుల వార్తలు.
అదేంటి ఈరూమర్స ఎప్పుడో వచ్చాయి కదా.. అందులో నిజం లేదు అని కూడా అన్నారు కదా అని అనకోవచ్చు. కాని తాజాగా మరోసారి వీరి విడాకులు న్యూస్ వైరల్ అయ్యింది. కుటుంబానికి దూరంగా ముంబయ్ లో ఉంటున్నారు ఈ ఇద్దరు స్టార్టు. ఫ్యామిలీ గోడవలంటూ ప్రచారం జరిగినా.. పిల్లల చదువులంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే వీరి మధ్య గొడవలు ఉన్నాయి విడాకులు తీసుకోబోతున్నారు అంటే.. కాదని గట్టిగా క్లారిటీ కూడా ఇచ్చారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరికి పడటం లేదట. మనస్పర్ధల కారణంగా వీరు ముంబయ్ లో విడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. పిల్లల చదువుకోసం మాత్రమే సూర్య కూడా ముంబయ్ లో ఉంటున్నాడట. జ్యోతిక ప్రాపర్ ముంబయే కాబట్టి.. అక్కడ ఉంటుంది. ఇక సూర్య షూటిగ్ కోసం చెన్నై వెళ్ళి వస్తున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది అనేది ఎవరికీ తెలియదు కాని.. వారు క్లారిటీ ఇస్తే మాత్రం అసలు విషయం తెలుస్తుంది.
స్టార్ కపుల్స్ సూర్య – జ్యోతిక గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీరిద్దరిది చూడ చక్కనైన జంట. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇప్పటివరకు ఎలాంటి ట్రోలింగ్ కు గురికాలేదు. వీరిద్దరూ ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు.
<p>jyothika</p>
అయితే వీరి విడాకుల వార్తలు మరీ ఎక్కువ అవ్వడంతో.. ఈ వార్తలపై తాజాగా జ్యోతిక స్పందించారు. నాకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. సూర్య చాలా సిన్సియర్ పర్సన్. మా ఇద్దరికీ విడాకులు తీసుకునే ఆలోచన కూడా లేదు అని చెప్పుకొచ్చింది. మా అమ్మానాన్నలు ముంబైలో ఉంటారు.వారికి ఆరోగ్యం బాగోలేకపోవడం తో నేను ముంబయ్ వచ్చాయి. నా తల్లీ తండ్రులను చూసుకోమని సూర్య ఇక్కడికి పంపించాడు.. అతను ఎంత మంచివాడో ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు.
<p>surya jyothika</p>
అంతే కాదు ప్రస్తుతం సూర్య షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో ఇలాంటి సమయంలో అతన్ని డిస్టర్బ్ చేయడం తనుకు ఇష్టం లేదు అంటోంది జ్యోతిక . ప్రస్తుతం జ్యోతిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే జ్యోతిక చేసిన వ్యాఖ్యల వీడియోలు ఎక్కడ కనిపించలేదు. ఆమె తన సన్నిహిత వర్గాల దగ్గర ఈ ప్రస్తావన తీసుకోచ్చినట్టు తెలుస్తోంది.