Japan : కార్తీ ‘జపాన్’ ప్రీ రిలీజ్ వేడుక.. గ్రాండ్ గా ఈవెంట్.. ఫొటోలు
కార్తీ నటించిన ‘జపాన్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. వేడుకలో సార్ట్స్ సందడికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జపాన్’ (Japan). రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది.
ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. నంబర్ 10న తమిళంతోపాటు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా కార్తీ ‘జపాన్’ Japan ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ వేడకకు నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు వంశీ పైడిపల్లి అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈవెంట్ ఆటపాటలతో చాలా సక్సెస్ ఫుల్ గా జరిగింది.
కనకాల సుమ అద్భుతమైన యాంకరింగ్ తో ఈవెంట్ సందడిగా సాగింది. నాని, కార్తీ, వంశీ పైడిపల్లి, అను ఇమ్మాన్యుయేల్, చిత్ర యూనిట్ రాకతో వేడుక సందడిగా మారింది.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ నటుడు సునీల్ సైతం ఈవెంట్ కు హాజరయ్యారు. తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. అలాగే మణికంఠ మాస్టర్ తో కలిసి వేదికపై మాస్ స్టెప్పులేశారు.
ఈవెంట్ కు చాలా మంది ఫ్యాన్స్ హజరయ్యారు. తమ అభిమాన హీరోలను చూసి ఖుషీ అయ్యారు. ఇక నాని, కార్తీ కూడా తమ సంభాషణలతో ఆకట్టుకున్నారు.
తమిళ స్టార్ కార్తీ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా నచ్చుందని అభిప్రాయపడ్డారు. తన సినిమా చూడకుంటే సీటు కింద బాంబ్ పెట్టి లేపేస్తానంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
గ్రాండ్ ఈవెంట్ లో బిగ్ టికెట్ ను కూడా లాంచ్ చేశారు. వేదికపై కార్తీ, అనుఇమ్మాన్యుయేల్, నాని, అతిథులు, చిత్ర యూనిట్ టికెట్ తో కలిసి ఫొటోకు ఫోజిచ్చారు.
నాని, కార్తీలతో సుమ వేదికపైనే ఫన్నీ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లు సంధించి సమాధానాలు రాబట్టింది. ఈ సందర్బంగా వారూ ఆసక్తికరంగా ఆనర్స్ ఇచ్చారు.
నాని మాట్లాడుతూ.. కార్తీ, నేను అసిస్టెంట్ డైరెక్టర్స్ గానే కెరీర్ స్టార్ట్ చేశాం. కార్తీకి తెలుగు బాగా తెలుసు. కానీ నాకు తమిళం రాదు. అదొక్కటే తేడా మిగితావన్నీ ప్రేక్షకులకు మాలో సిమిలర్ గానే కనిపిస్తాయి.
కార్తీ - నాని కలిసి మల్టీస్టారర్ చేసే అవకాశం తప్పకుండా ఉంటుందని, వందశాతం చేస్తామని హామీనిచ్చారు. సుమ ప్రశ్నకు.. నాని రజినీకాంత్ బయోపిక్ నటిస్తాననడం విశేషం.
చాలా సమయం కార్తీ, నాని వేదికపైనే సందడి చేయడం.. సినిమా విషయాలను, తమ పర్సనల్ లైఫ్ విషయాలనూ స్టేజీపైనే పంచుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
మొత్తానికి ‘జపాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. వేడుకకు అభిమానులు పెద్దసంఖ్యలోనే చేరుకోవడంతో విజయవంతమైంది.
యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) కూడా ఈవెంట్ కు హాజరైంది. బ్యూటీఫుల్ శారీలో కట్టిపడేసింది. మెరిసిపోయే అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది.
చీరకట్టులో పద్ధతిగా మెరిసి అనుఇమ్మాన్యుయేల్ అందరి చూపు తనపైనే పడేలా చేసింది. అలాగే వేదికపై తన క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకుంది.
అతిథులతో ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. బ్యూటీఫుల్ స్టార్స్ సందడితో వేడుక మొత్తం పాజిటివ్ వైబ్స్ తో నిండిపోయింది. సినిమాపై ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచేశారు.
ఇక నేచురల్ స్టార్ నాని, అను ఇమ్మాన్యుయేల్ ఫొటోస్ ఆసక్తికరంగా మారాయి. అనును టాలీవుడ్ కు పరిచయం చేసింది నానినే. ‘మజ్ను’ చిత్రం తర్వాత వీరిద్దరూ ఇలా వేడుకలో కలవడం విశేషంగా మారింది.