- Home
- Entertainment
- డైరెక్టర్ అట్లీ భార్యను చూశారా..? హీరోయిన్లు కూడా తక్కువే.. వైరల్ అవుతున్న ప్రియా ఫోటోస్
డైరెక్టర్ అట్లీ భార్యను చూశారా..? హీరోయిన్లు కూడా తక్కువే.. వైరల్ అవుతున్న ప్రియా ఫోటోస్
స్టార్ డైరెక్టర్ అట్లీ తన భార్య ప్రియాతో కలిసి అవార్డుల వేడుకకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్లను మించిన అందంతో హాట్ టాపిక్ అవుతున్నారు డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ. సోషల్ మీడియాలో ప్రియా అట్లీ ఫోటోలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ గా మారతున్నాయి. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుకల్లో తన భర్త అట్లీతో కలిసి మెరుపులు మెరిపించారు ప్రియా అట్లీ.
అట్లీ చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇండియాన్ జేమ్స్ కామరూన్ గా పేరు తెచ్చుకున్నడైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. డైరెక్టర్ గా ఫస్ట్ సినిమాతోనే సంచలనం సృష్టించారు. రాజా రాణి సినిమాతో కమర్షియల్‌గా హిట్ సాధించడంతో తమిళంలో స్టార్ గామారాడు. అంతే కాదు నయనతార రీ ఎంట్రీతో ఆమెకు లైఫ్ ఇచ్చాడు అట్లీ.
బాలీవుడ్ లో అడుగు పెట్టి.. అక్కడ కూడా సంచలన సృష్టించాడు అట్లీ. తమిళంలో ఆయన సక్సెస్ చూసి బాలీవుడ్ అట్లీకి వెల్కం చెప్పింది. షారూఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాను తెరకెక్కించాడు. తన మొదటి సినిమా హీరోయిన్ నయనతారను సెంటిమెంట్ గా..బాలీవుడ్ కు పరిచయం చేసిన అట్లీ.. మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ కి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చాడు.
ఈ చిత్రాన్ని షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తన రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించారు. ఇక ఈ చిత్రం తమిళ అభిమానుల్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ హిందీతో పాటు విదేశాల్లోనూ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది.
ఇటీవల జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్‌లో 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన 'జవాన్' చిత్రం 4 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటుడి అవార్డు షారుఖ్ ఖాన్, ఉత్తమ నటి అవార్డు నయనతార, మ్యూజిక్ కంపోజర్ అవార్డు అనిరుధ్ మరియు డైరెక్టర్ అవార్డు అట్లీకి దక్కాయి.
ఈ అవార్డును అందుకోవడానికి దర్శకుడు అట్లీ... తన సతీమణితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో షూట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ క్యూట్ లవ్ పోర్ట్స్ లా పోజులిచ్చారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.